Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Elon musk : ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ షిప్స్ మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు రెడీ చేస్తున్నారు. కానీ ఆయన మరో యాంగిల్ కూడా ఆలోచిస్తున్నారు.
From Delhi To US In 40 Minutes: భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే విమానంలో వెళ్లాలంటే కనీసం ఇరవై గంటలు పడుతుంది. కానీ బెంగళూరురోడ్ల మీద పదికిలోమీటర్ల దూరం ప్రయాణించేలోపు అమెరికా నుంచి భారత్ వచ్చేయవచ్చు. ఇదేమీ అసాధ్యం కాదని తాము చేసి చూపిస్తామని ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ షిప్ అంటోంది. ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా గంటలోకి తీసుకెళ్లాలా స్టార్ షిప్స్ ను తీరిదిద్దుతామని అంటున్నారు.
Also Read; టెలిగ్రామ్ సీఈవో రియల్ విక్కీ డోనర్ - స్పెర్మ్ ఇచ్చి ఉచితంగా ఐవీఎఫ్ చేయిస్తాడట - ఒకటే కండిషన్
స్పేస్ ఎక్స్ ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనలు చేస్తోంది. ఎలాగైనా అంగాకరుడిపై అడుగు పెట్టి అక్కడ నివాస కాలనీలు నిర్మించాలన్నది ఎలాన్ మస్క్ ప్లాన్. అందుకు ట్రంప్ సహకరిస్తారన్న ఉద్దేశంతోనే ఆయనకు అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు తెలిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే మస్క్ మరో ఆలోచనలో ఉన్నారు. అదేమిటంటే ప్రపంచ విమానయాన రంగాన్ని తన స్టార్ షిప్స్ తో కైవసం చేసుకోవడం.
Under Trump's FAA, @SpaceX could even get Starship Earth to Earth approved in a few years — Taking people from any city to any other city on Earth in under one hour. pic.twitter.com/vgYAzg8oaB
— ALEX (@ajtourville) November 6, 2024
ఇటీవల ఎలా పైకి వెళ్లిన రాకెట్.. అలాగే వచ్చి లాంచ్ అయిన అద్భుతాన్ని స్పేస్ ఎక్స్ చేసి చూపించింది. అంటే ల్యాండింగ్ విషయంలోనూ వారు పురోగతి సాధించారన్నమాట. స్టార్ షిప్స్ ను ఇలా వెయ్యి మంది వరకూ కూర్చోబెట్టి అంతరిక్షంలోకి పంపేసి.. అలా ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండింగ్ చేసేందుకు అవసరమైన సన్నాహాలను ... పరిశోధనలకు కూడా స్పేస్ ఎక్స్ చేస్తోంది. దీనికి సంబంధించిన అనుమతులు, సపోర్టు ఇప్పుడు ట్రంప్ హయాంలో త్వరగా వస్తాయని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని స్పేస్ ఎక్స్ సోషల్ మీడియాలో చెప్పుకుంటోంది.
Also Read: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా.. మరో మూలకు గంటలో చేరుకునే వ్యవస్థను తీసుకు రావడం స్పేస్ ఎక్స్ లక్ష్యాల్లో ఒకటిగా ఉందని చెబుతున్నారు. నిజానికి ఈ ఊహా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాన్ మస్క్ ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేయగల వ్యక్తే. స్టార్ షిప్స్ విషయంలో ఆయన అద్భుతమైన ప్రగతిని చూపించారు. ఈ విషయంలోనూ ఆయన విజయం సాధిస్తే.. ప్రపంచ విజేతల్లో ఒకరిగా నిలుస్తారనడంలో ఆశ్చర్యం లేదు.