Telangana Investment Politics : రేవంత్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎటాక్ - బీఆర్ఎస్ సైన్యానికి కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వలేకపోతోందా ?
Telangana : బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంతో రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ ప్రచార ధాటిని తట్టుకోలేక అమెరికా నుంచి అధికారులు కూడా వివరణ వీడియోలు రిలీజ్ చేయాల్సి వస్తోంది.
Telangana Politics : రాజకీయాల్లో ఇప్పుడు ప్రతిపక్షమంటే రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పని లేదు. ఆ పని చేయాల్సినప్పుడు చేయవచ్చు..కానీ రోజూ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడవచ్చు. ఈ విషయలో భారత రాష్ట్ర సమితికి ఉన్న నిర్మాణాత్మక సోషల్ మీడియా సైన్యం ప్రభుత్వంపై ఓ రకమైన యుద్ధం చేస్తోంది. సోషల్ మీడియా సైన్యానికి రూల్స్ ఏమీ ఉండవు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు పెంచడానికి ఎలాంటి వార్త ఉపయోగపడుతుందో.. అలాంటి దాన్ని తెరపైకి తెచ్చి ప్రచారం చేయడమే. ప్రభుత్వం సీరియస్ అయి కేసులు పెడితే అదో అడ్వాంటేజ్ కానీ.. మైనస్‌గా భావించడం లేదు. పలితంగా ప్రభుత్వంపై ఎటాక్ అంతకంతకూ పెరిగిపోతోంది. దీనికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా బలం సరిపోవడం లేదు. ఆ విషయం స్పష్టంగానే కనిపిస్తోంది.
రేవంత్ అమెరికా పర్యటనపై ఉద్దృతంగా వ్యతిరేక ప్రచారం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారు. అధికార, మంత్రుల బృందంతో ఆయన వెళ్లారు. పెట్టుబడుల ఆకర్షణలో గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలకంగా పని చేసిన అధికారి జయేష్ రంజన్. కేటీఆర్ ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా ఆయనే పక్కన ఉంటారు. మొత్తం పెట్టుబడుల వ్యవహారాలు, ఎంవోయూలు..చర్చలు ఆయన పర్యవేక్షణలో జరుగుతాయని అధికారులు అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయనకు ప్రాధాన్యం తగ్గలేదు. బీఆర్ఎస్ హయాంలో ఎంత ప్రాధాన్యం ఉందో.. కాంగ్రెస్ హయాంలోనూ అంత కంటే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. తాజాగా రేవంత్ పర్యటనను కూడా ఆయనే సమన్వయ పరుస్తున్నారు. పెట్టుబడుల ప్రతిపాదనలు, ఎంవోయూలను ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే స్వచ్చబయో అనే ఓ కంపెనీతో చేసుకున్న ఎంవోయూ వివాదాస్పదమయింది. ఆ కంపెనీ ఇటీవలే ప్రారంభించారని దానికి రేవంత్ సోదరుడు యజమానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా బయట పెట్టి అసలు రేవంత్ సర్కార్ చేసుకుంటున్న ఒప్పందాలన్నీ ఫేక్ అని ప్రచారం ఉద్దృతంగా చేసింది. దీంతో జయేష్ రంజన్ స్వయంగా వివరణ ఇస్తూ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది.
నిప్పు లేకుండా పొగ రాదు - బీజేపీ, బీఆర్ఎస్ మధ్య విలీన చర్చలు నిజమేనా ?
క్రమంగా పెరుగుతున్న వ్యతిరేక ప్రచారం
కేటీఆర్ తమ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని అత్యంత పటిష్టంగా నిర్మించుకన్నారు. వ్యవస్థీకృతమైన సోషల్ మీడియా విభాగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉంచుకున్నారు. పార్టీ కోసం విస్తృతంగా సోషల్ మీడియాలో పని చేసే వారు హైదరాబాద్ లో మాత్రమే కాదు.. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంటారు. వీరందర్నీ కోఆర్డినేట్ చేసే వ్యవస్థను కూడా పకడ్బందీగా నియమించుకున్నారు. అందుకే ఓ అంశాన్ని ట్రెండ్ చేయాలంటే.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇట్టే చేసేస్తుంది. సోషల్ మీడియా ప్రభావం తెలుసు కాబట్టి.. కేటీఆర్ ఓడపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా బలహీనపడకుండా చూసుకుంటున్నారు. దానికి ఇప్పుడు ప్రతిపలం కనిపిస్తోంది . కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చికాకు పెట్టడంలో సోషల్ మీడియా విభాగమే కీలకంగా ఉంది. కేసులు అయినా ఎవరూ భయపడటం లేదు.
జీఎస్టీ కుంభకోణం కేసులో కీలక పరిణామం.. మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ కు సిఐడి నోటీసులు.?
నిజమా.. ఫేకా అన్నది కాదు.. వైరల్ చేయడమే టార్గెట్ !
రాజకీయాల్లో నిజమా.. ఫేకా అన్నదానికి ఇప్పుడు విలువలేదు. ఎంత మంది ప్రజల్ని నమ్మించగలమన్నదే కీలకం. ప్రభుత్వంపై అపోహలు.. వ్యతిరేకత పెంచగలిగితే ఎలాంటి అవకాశాన్ని అయినా వదలరు. గత ఐదు నెలల కాలంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని ప్రచారాలు చేసిందో లెక్కే లేదు. కరెంట్ ఉండదన్న దగ్గర నుంచి.. ప్రతి సమస్యనూ భూతద్దంలో చూపించడం ప్రారంభించారు. చివరికి మంత్రులు కూడా స్పందించాల్సి వచ్చింది. అయితే.. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు.. తమ సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. కౌంటర్లు ఇవ్వలేకపోతున్నామని .. అనిపించడంతో .. కొత్తగా టీముల్ని ఎంపిక చేుసకోవాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఉండే.. రాజకీయ వ్యూహకర్త.. సునీల్ కనుగోలును ఈ అంశంలో సంప్రదించారని ఆయన త్వరలోనే లీడ్ తీసుకుంటారని.. కాంగ్రెస్ సోషల్ మీడియా కష్టాలు తీరిపోతాయని అంటున్నారు. అయితే ఇప్పటికైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆరోపణలు చేయడం... కాంగ్రెస్ వివరణ ఇచ్చుకోవడంతోనే సరిపోతోంది.