అన్వేషించండి

Telangana: జీఎస్టీ కుంభకోణం కేసులో కీలక పరిణామం.. మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ కు సిఐడి నోటీసులు.?

Former Cs Somesh Kumar: జీఎస్టీ కుంభకోణం కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచుతున్నారు. కేసులో కీలకంగా మారిన సోమేష్ కుమార్ తోపాటు మరికొందరికి నోటీసులు అందించేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు.

Telangana GST Scam Case Updates: జీఎస్టీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల్లోనే వీరికి  నోటీసులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మొదట ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సిఐడి కి అప్పగించింది. సిసిఎస్ నుంచి ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సిఐడి అధికారులకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకే మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ సహా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్వీస్ టాక్స్ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఫ్లియాంటో టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులకు నోటీసులు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చినట్టు గుర్తించిన సిఐడి 

స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూపు ద్వారా సోమేశ్ కుమార్ సర్వీస్ టాక్స్ అధికారులు విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్, శోభన్ బాబులకు ఆదేశాలు ఇచ్చినట్లు సిఐడి అధికారులు ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు. కమర్షియల్ టాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కనూరి అందించిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తును సిఐడి అధికారులు చేపట్టారు. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలకు లబ్ధి చేసినట్లు ఆధారాలను సేకరించారు. ఈ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు 1000 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు సిఐడి అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సిఐడి దర్యాప్తు ముమ్మరం అయితే కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కేసును సిఐడి అధికారులు ప్రత్యేకంగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసుపై సీరియస్ గానే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఈ కేసు విషయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లేలా చేశారని ప్రభుత్వం భావించిన నేపథ్యంలోనే దీనిపై విచారణ చేపట్టింది. వీలైనంత వేగంగా విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సిఐడి అధికారులు దూకుడు పెంచారు. కొద్దిరోజుల్లోనే నోటీసులు అందించి వారిని విచారించేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. సదరు అధికారులను విచారించిన తర్వాత కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా వెల్లడి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget