Money Heist Robber In Hyd : హైదరాబాద్‌లో వెబ్ సిరీస్ బ్యాంక్ దొంగ - ఏం చేస్తున్నాడంటే ?
హైదరాబాద్‌కు ప్రధాని మోదీ వస్తున్న సమయంలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపారు. ఓ వెబ్ సీరిస్‌లో దొంగ వేషంలో ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు.
Money Heist Robber In Hyd : రాజకీయ పార్టీలు రకరకాల పద్దతుల్లో తమ ప్రత్యర్థులపై పోరాటం చేస్తూంటాయి. ఈ క్రమంలో బీజేపీపై ఇలాంటి పోరాటాలు చేసేవారు ఎక్కువే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా..బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున ప్రచార సమరం జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ వ్యక్తి మనీ హిస్ట్ వెబ్ సీరిస్‌లో బ్యాంకులను కొల్లగొట్టే పాత్రధారి బొమ్మతో ఓ వ్యక్తి నిరసన ప్రదర్శన నిర్వహించాడు.
#MoneyHeist Gang on the streets of hyderabad?
— YSR (@ysathishreddy) July 2, 2022
Interesting…. What’s happening? 🤔#Hyderabad pic.twitter.com/7zsuVStUIP
WE ONLY ROB BANK.. YOU ROB THE WHOLE NATION’ #BYEBYE MODI అని రాసిఉన్న ప్ల కార్డులను పట్టుకుని నగరంలోని పలు బ్యాంకులు, పెట్రోల్ బంకులు, కాచీగూడ రైల్వే స్టేషన్, బీహెచ్‌ఈఎల్, జహీరాబాద్‌లోని ఎల్‌ఐసీ ఆఫీస్ వద్ద ఆ వ్యక్తి కనిపించాడు. అయితే అది ఒకరా లేకపోతే... ఓ గ్రూప్‌గా ఇలా మారి ఫోటోలు దిగి నిరసన చేశారాఅన్నదానిపైస్పష్టత లేదు.
హైదరాబాదులోకి బ్యాంక్ రాబరీ గ్యాంగ్ తిరుగుతు
— VENKANNA BANDARU (@VENKANNA_KTRS) July 2, 2022
మేము బ్యాంకుల మాత్రమే దోచుకుంటున్నాము
ప్రధాని మాత్రం మొత్తం దేశాన్ని దోచుకుంటున్నాడు అంటూ placards ను ప్రదర్శిస్తున్నారు
వీరితో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!#ByeByeModi pic.twitter.com/5ubMGAmNae
మోదీకి వ్యతిరేకంగా రాజధానిలో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు వెలుస్తున్నాయి. గురువారం పరేండ్ గ్రౌండ్స్ పరిసరాల్లో బైబై మోదీ హ్యాస్‌ట్యాగ్‌తో సాలు మోదీ.. సంపకు మోదీ అంటూ భారీ హోర్డింగ్‌లను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. అయితే ఈ మనీహిస్ట్ నిరసన చేసింది టీఆర్ఎస్ వ్యక్తా కాదా అన్నదానిపై స్పష్టత లేదు.
Intrestingly even I saw him with a placard at #KachigudaRailwayStation today morning. But couldn’t get down from my car. My kids were excited to see in reality.. 🙌🏻 #Hyderabad#MoneyHeist pic.twitter.com/5oCMBmK7Z2
— Anil Goud (@AnilgoudKTRs) July 2, 2022
ఈ నిరసన సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఇది టీఆర్ఎస్ నేతల పనేనని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు
What’s happening in Hyderabad?
— YSR (@ysathishreddy) July 2, 2022
Looks like #ModiHeist much bigger than #MoneyHeist👇🏻#Hyderabad pic.twitter.com/9bPg2aIctC
'Money Heist' hoarding in LB Nagar refres to PM Modi as a 'Nation robber'
— Pranav Mishra (@journopranav) July 2, 2022
#ByeByeModi pic.twitter.com/2rfkucdKsS