By: ABP Desam | Updated at : 02 Dec 2022 05:23 AM (IST)
షర్మిల రాజకీయంతో ఏ పార్టీకి లాభం ?
Sharmila In TS Politics : తెలంగాణలో రెండు రోజులుగా వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల హాట్ టాపిక్ అవుతున్నారు. ఆమె పాదయాత్రపై దాడి జరిగిన దగ్గర్నుంచి రాజకీయం ఆమె చుట్టూనే తిరుగుతోంది. ఆమె కూడా రోడ్డెక్కి పోరాటం చేసి.. తాను ఎంత మాత్రం బిడియంగా ఉండే రాజకీయ వారసురాల్ని కాదని ఎలాంటి రాజకీయం అయినా చేయగలనని నిరూపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో టీఆర్ఎస్ ఆమెపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడుతోంది.అదే సమంయలో బీజేపీ మాత్రం షర్మిల విషయంలో సాఫ్ట్‌గా వ్యవహరిస్తోంది. గవర్నర్ మద్దతు పలికారు. అందుకే టీఆర్ఎస్ షర్మిల పార్టీని బీజేపీ వదిలిన బాణం అని అంటోంది. షర్మిలను ప్రోత్సహిస్తే బీజేపీకి వచ్చే లాభమేంటి ? షర్మిల పార్టీకి అనవసర ప్రాధాన్యం ఇవ్వడం వల్ల టీఆర్ఎస్‌కు జరిగే మేలేంటి ?
షర్మిల వెనుక బీజేపీ ఉందా?
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని వైఎస్ షర్మిల అనుకోవడమే ఓ సంచలనం. ఎందుకంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డారు. ఆయనపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించేవారు. అంతకు మించి షర్మిలకు నేటివిటీ లేదు. కడప బిడ్డగానే ప్రసిద్ధి పొందారు. అయితే తాను తెలంగాణ కోడలినని చెప్పుకుని పార్టీ ప్రారంభించేశారు. ఆమే ధైర్యం ఏమిటన్నదానిపై మొదట్లోనే చర్చలు జరిగాయి. కొంత మంది టీఆర్ఎస్ వదిలిన బాణం అని చెప్పుకున్నారు. మరికొంత మంది ఆమె వెనుక బీజేపీ ఉందన్నారు. అందు కోసం రకరకాల విశ్లేషణలు చేశారు. కానీ షర్మిల మాత్రం ఎవరేమనుకున్నా తన రాజకీయాలు తాను చేసుకుంటూ పోతున్నారు.
మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు.. భాషలో మార్పు వచ్చిన తర్వాతే హైలెట్ అవుతున్న షర్మిల !
షర్మిల పాదయాత్రను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన తర్వాత స్టైల్ మార్చారు. తీవ్రమైన భాషతో టీఆర్ఎస్ నేతల్ని విమర్శించడం ప్రారంభించారు. ఎంత పట్టించుకోకూడదన్నా.. ఆమె అంటున్న మాటలు చురుగ్గా తగులుతూండటంతో టీఆర్ఎస్ నేతలు స్పందించడం ప్రారంభించారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో స్పీకర్‌కే ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అరెస్ట్ చేస్తారేమోనని షర్మిల కూడా భావించారు. అందుకే పోలీసుల బేడీలు చూపించి.. తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే స్పీక్ర ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ షర్మిల తన భాషలో మరింత కటువుతనం పెంచారు కానీ తగ్గించలేదు. నర్సంపేట వచ్చేసరికి ఆ భాష దాడులకు కారణం అయింది.
అప్పటి వరకూ పట్టించుకోని టీఆర్ఎస్ ఇప్పుడెందుకు సీరియస్‌గా తీసుకుంది?
షర్మిల పాదయాత్రకు అనవసర ప్రాధాన్యం ఎందుకని టీఆర్ఎస్ మొదట్లో పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా ఆమె యాత్రపై దాడి చేయడం.. యాత్రను నిలుపుదల చేయడం ద్వారా .. షర్మిలకు ప్రాధాన్యత పెంచారు. ఇక సోమాజీగూడ ఎపిసోడ్‌లో అయితే .. షర్మిల హైలెట్ అయ్యేలా సహకరించారన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. హౌస్ అరెస్ట్ చేసి ఉంటే అసలు పట్టించుకునేవారు కాదు కదా అనేవారే ఎక్కువ. ఆ తర్వాత వెహికల్‌తో పాటే తీసుకెళ్లడం.. రోజంతా షర్మిల ఎపిసోడే అయ్యేలా చూశారన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో ఉన్నాయి. ఈ కారణంగా ఆమె రాజకీయ పోరాటం హైలెట్ అయింది.
బీజేపీ ఎందుకు షర్మిలకు మద్దతుగా నిలిస్తోంది ?
అనూహ్యంగా బీజేపీ షర్మిలకు మద్దతుగా నిలుస్తోంది. ఆమె విషయంలో ప్రభుత్వం తీరును ఖండిస్తోంది. గవర్నర్ స్వయంగా మద్దతు పలికారు. ఈ క్రమంలో గవర్నర్‌ను షర్మిల కలవనున్నారు. అందుకే టీఆర్ఎస్ నేతలు ఆమెను బీజేపీ వదిలిన బాణం అంటూ ప్రచారం చేస్తున్నారు.
షర్మిలను బలోపేతం చేస్తే ఏ పార్టీకి లాభం ?
షర్మిల పార్టీ ఇప్పటికీ ప్రభావం చూపే స్థాయిలో లేదు. ఆమె పాదయాత్ర చేసినా... ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆమె పార్టీని బలోపేతం చేయడం వల్ల ఎవరికిలాభం అన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది. వ్యతిరేక ఓటును రెండు, మూడు శాతం చీల్చినా చాలు టీఆర్ఎస్‌కు మేలేనని అందుకే టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని అంటున్నారు. అదే సమయంలో షర్మిల పార్టీకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్ కాబట్టి.. ఆమెకు మద్దతుగా నిలవడం ద్వారా ఆ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మరో వర్గం భావిస్తోంది. కారణం ఏదైనా షర్మిల రాజకీయాలు.. ఆమె చుట్టూ తెలంగాణ పార్టీలు చేస్తున్న రాజకీయం మాత్రం గందరగోళంగానే ఉంది.
బుధవారం ఏపీ క్యాబినెట్ భేటీ- రాజధాని షిఫ్టింగ్‌పై ప్రధానంగా చర్చ!
YSRCP Cadre : వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నేతలకు గుడ్ న్యూస్ - ఇక నుంచి టచ్‌లోకి నేరుగా సీఎం జగన్ !
BRS Politis Hottopic : అసెంబ్లీ రద్దు లేదా కేటీఆర్ సీఎం - అసెంబ్లీ సమావేశాల తర్వాత సంచలనం ఖాయమేనా ?
Telangana Budget 2023: రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులేనా?: బడ్జెట్ పై బండి సంజయ్
MLC Kavitha: రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి, అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి?: ఎమ్మెల్సీ కవిత
‘వసుమతి’కి పెళ్లైపోయింది - బాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌తో ఘనంగా కియారా వెడ్డింగ్, ఒక్కరోజుకు అంత ఖర్చా?
Kadiyam Srihari On Sharmila: జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !
Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!
YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన
Khammam Politics : సస్పెండ్ చేయమంటున్న పొంగులేటి - రాజీనామా చేయమంటున్న పువ్వాడ ! ఇద్దరి కామన్ డైలాగ్‌లో "దమ్ము" హైలెట్ !