![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana Politics: తెలంగాణలో పోలీస్ బెటాలియన్ ఆందోళనల వెనుక ఎవరు? రాజకీయ నేతగా మారిన మాజీ ఆఫీసర్ ప్లానేనా ?
Telangana: తెలంగాణలో పోలీసులు ఆందోళనలకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ బలమైన శక్తి వారి వెనుక లేకపోతే ఇంత ఆర్గనైజ్డ్‌గా జరగదని భావిస్తున్నారు.
![Telangana Politics: తెలంగాణలో పోలీస్ బెటాలియన్ ఆందోళనల వెనుక ఎవరు? రాజకీయ నేతగా మారిన మాజీ ఆఫీసర్ ప్లానేనా ? Telangana Police involvement in protests has become a hot topic Who is behind Telangana Politics: తెలంగాణలో పోలీస్ బెటాలియన్ ఆందోళనల వెనుక ఎవరు? రాజకీయ నేతగా మారిన మాజీ ఆఫీసర్ ప్లానేనా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/28/88f287b044e25d9ba594b1a51d5a31e71730132336842228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Police involvement Who is behind: తెలంగాణ పోలీస్ బెటాలియన్ పోలీసులు, వారి కుటుంబాలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టడం.. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులే కానీ వారికి ప్రత్యేకమైన సర్వీస్ రూల్స్ ఉంటాయి. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడాన్ని సీరియస్ గా పరిగణిస్తారు. ఎలాంటి వివరణ కూడా అడగకుండా డిస్మిస్ చేయగలరు కూడా. ఇంత రిస్క్ ఉన్నా బెటాలియన్ పోలీసులు, వారి కుటుంబాలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో పది మందిని డిస్మిస్ చేసేశారు. మరో 39 మందిని సస్పెండ్ చేశారు. ఇంత రిస్క్ తీసుకోవడానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏక్ పోలీస్ నినాదం వెనుక రాజకీయం !
పోలీస్ బెటాలియన్ ఉద్యోగులు ఏక్ పోలీస్ నినాదంతో ఉద్యమం చేస్తున్నారు. గతంలో ఉన్న విధానాన్నే పాటిస్తామని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. అయినా పోలీసులు ఆందోళనలు చేశారు. ఇలా చేయడం వెనుక వెనుక బలమైన రాజకీయ శక్తి ఉందని.. తమ ఆందోళనతో ప్రభుత్వం తగ్గింది కాబట్టి ఇంకా ఏదో చేయాలన్న తపనతోనే వారిని రెచ్చగొడుతున్నాని ప్రభుత్వ వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. పోలీసు కుటుంబాలకు కష్టాలు ఉండవని ఎవరూ చెప్పరు. బెటాలియన్ పోలీసులకు ఉంటాయి. మామూలు పోలీసులకూ ఉంటాయి. ఎవరి స్థాయిలో వారికి కష్టాలుంటాయి. అందుకే ఎవరికి వారు యూనియన్లు పెట్టుకుని పోరాడతారు. కానీ దానికి కూడా ఓ పద్దతి ఉంటుంది. పోలీసు అనే ట్యాగ్ వేసుకున్న వారికి ఎంత చిరుద్యోగికి అయినా ఎంతో బాధ్యత ఉంటుందని ప్రభుత్వం గుర్తు చేసింది.
హైదరాబాద్‌లో ఐదుగురికి మించి కలిసి తిరిగితే చర్యలు- నెలరోజులపాటు తీవ్ర ఆంక్షలు
భారీ ఆందోళనలకు ప్లాన్ - అందుకే పోలీస్ యాక్ట్ అమలు
హఠాత్తుగా పోలీసులు హైదరాబాద్‌లో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు చేశారు. మళ్లీ రజాకార్ రాజ్యం వచ్చిందని హరీష్ రావు ఆరోపించారు. ఇలా పోలీస్ యాక్ట్ అమలు చేయడానికి పండుగలే కారణం అని పోలీసులు చెబుతున్నారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు ముఖ్యమంత్రి నివాసంతో పాటు సెక్రటేరియట్ ను ముట్టడించి పెద్ద ఎత్తున సంచలనం రేపడానికి గట్టి కుట్ర జరిగిందని పోలీసులకు స్పష్టమైన సమాచారం వచ్చిందని తెలుస్తోంది. అందుకే సచివాలయంలో విధులు నిర్వహించే పోలీసులకు ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ ఇంటి వద్ద భద్రతను పెంచారు.
బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య - ఆమె కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
ఆ ఆందోళనలకు ప్లాన్ చేసింది డిపార్టుమెంట్‌లో పని చేసిన ప్రస్తుత రాజకీయ నాయకుడే ?
సుదీర్ఘ కాలం డిపార్టుమెంట్‌లో పని చేసి రాజకీయ నేత అవతారం ఎత్తిన ఓ నేత బెటాలియన్ పోలీసులను పూర్తి స్థాయిలో రెచ్చగొట్టారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కులాల పేరుతో రాజకీయం చేయడంలో దిట్ట అయిన ఆయన ఓ వర్గం బెటాలియన్ పోలీసులకు భరోసా ఇచ్చి మరీ రోడ్డెక్కేలా చేశారని అంటన్నారు. వారితో భారీ ఆందోళనలకు ప్లాన్ చేశారని అంటున్నారు. దీనిపై విస్పష్టమైన సమాచారం అందడంతోనే పోలీస్ యాక్ట్ అమలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఇంకా పలువురు బెటాలియన్ కానిస్టేబుళ్లపై రాజకీయ కుట్ర చేసినందుకు డిస్మిస్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)