అన్వేషించండి

Hyderabad News: హైదరాబాద్‌లో ఐదుగురికి మించి కలిసి తిరిగితే చర్యలు- నెలరోజులపాటు తీవ్ర ఆంక్షలు 

Telangana News: కానిస్టేబుళ్ల ఆందోళన నేపథ్యంలో హైదరాబాద్‌లో తీవ్రమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. ఐదుగురు కలిసి తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Section 163 Implemented In Hyderabad : ఏక్‌పోలీస్ విధానం కోసం పోరాడుతున్న బెటాలిన్ కానిస్టేబుళ్లు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్‌లో ఎలాంటి ఆందోళనలకు, ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని కమిషనర్ సీవీ అనంద్ స్పష్టం చేశారు. భారతీయ న్యాయ సురక్ష సంహిత 2023 సెక్షన్‌ 163 అమలు చేయనున్నట్టు ప్రకటించారు. రాజధాని హైదరాబాద్‌ నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచి నవంబర్‌ 28 వరకు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై పూర్తిగా నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అశాంతి సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నాయని అందుకే ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

పోలీసు శాఖలో అందరికీ ఒకే విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళనబాటపట్టారు. నలుగురితో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. కుటుంబ సభ్యులతో కలిసి కానిస్టేబుళ్లు ధర్నాలు చేస్తున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ఆందోళనలు చేయడం సరికాదని పలువురిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టికల్‌ 311 ప్రకారం 10 మంది కానిస్టేబుళ్లను విధుల నుంచి టెర్మినేట్ చేశారు. అంతే కాకుండా మరో 39 మందిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆదేశాలు వచ్చాయి. ఇది పోలీసు కుటుంబాల్లో మరింత ఆగ్రహానికి కారణమవుతోంది. 

ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన తోటి ఉద్యోగులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధపడ్డారు. బెటాలియన్‌ ముఖద్వారం వద్ద ధర్నా చేశారు. ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలు కూడా చేపట్టారు. దీన్ని మరింత ఉద్ధృతం చేయాలని సచివాలయ ముట్టడికి సిద్ధమయ్యారు. యూనిఫామ్‌తో వచ్చి సచివాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అందుకే ముందు జాగ్రత్తగా అధికారులు హైదరాబాద్‌లో ఆంక్షలు అమలు చేశారు. 

మరోవైపు రోడ్డు ఎక్కిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవడాన్ని ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్‌ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. "ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుం;f తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. "నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెల్సు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు" అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి... అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు.? వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..? భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకొని, సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం." అని ఎక్స్‌లో పోస్టు చేశారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila And YS Jagan: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
KTR: 'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
China Palm Payment System: చెయ్యి ఊపితే అకౌంట్లో డబ్బులు కట్ - ఆశ్చర్యపరుస్తున్న చైనా టెక్నాలజీ!
చెయ్యి ఊపితే అకౌంట్లో డబ్బులు కట్ - ఆశ్చర్యపరుస్తున్న చైనా టెక్నాలజీ!
Janwada Farm House: జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మతిపోగొట్టే రాయల్ వింటేజ్ కార్స్, కార్స్ 'ఎన్' కాఫీలో చూసేద్దామా?షర్మిల డ్రామా వెనుక పెద్ద కుట్ర, నీలాంటి చెల్లి ఉన్నందుకు మాకు బాధ - భూమనSajid Khan Nomal Ali vs England | రెండు టెస్టుల్లో 39వికెట్లు తీసి బజ్ బాల్ ను సమాధి చేశారు | ABPInd vs NZ Test Series | WTC 2025 ఫైనల్ ఆడాలంటే టీమిండియా ఇలా చేయాల్సిందే.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila And YS Jagan: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
KTR: 'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
China Palm Payment System: చెయ్యి ఊపితే అకౌంట్లో డబ్బులు కట్ - ఆశ్చర్యపరుస్తున్న చైనా టెక్నాలజీ!
చెయ్యి ఊపితే అకౌంట్లో డబ్బులు కట్ - ఆశ్చర్యపరుస్తున్న చైనా టెక్నాలజీ!
Janwada Farm House: జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
Best Selling Royal Enfield Bike: బెస్ట్ సెల్లింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే - ప్రతి నెలా వేలల్లో సేల్స్!
బెస్ట్ సెల్లింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే - ప్రతి నెలా వేలల్లో సేల్స్!
Fire Accident: బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం - దీపావళి పండుగ ముందు హైదరాబాద్‌లో దుర్ఘటన
బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం - దీపావళి పండుగ ముందు హైదరాబాద్‌లో దుర్ఘటన
Andhra News: ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
Hyderabad News: రాజ్‌పాకాల సోదరుడి విల్లాలో సోదాలు - బీఆర్ఎస్ నేతల అరెస్ట్
రాజ్‌పాకాల సోదరుడి విల్లాలో సోదాలు - బీఆర్ఎస్ నేతల అరెస్ట్
Embed widget