అన్వేషించండి

KTR News: బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య - ఆమె కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

Woman Dies In Kukatpally | హైడ్రా కూల్చివేతల భయంతో కూకట్ పల్లిలో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబానిక అండగా ఉంటామన్నారు.

HYDRA demolitions in Kukatpally | హైదరాబాద్: గత కొన్ని నెలలుగా హైడ్రా పేరు చెబితే నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. హైడ్రా ఎక్కడ తమ ఇంటిని కూల్చేస్తుందా అని కొత్త నిర్మాణం పూర్తయిన వారు, గతంలో గృహప్రవేశం చేసిన వారు హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతల భయంతో కూకట్ పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ భరోసా ఇచ్చారు.

కేటీఆర్ కామెంట్స్
కేటీఆర్ మాట్లాడుతూ.. ‘గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు, అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా కూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారు. హైడ్రా అనే బ్లాక్ మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పారు. నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది. పిల్లలు పుస్తకాలను తీసుకోనివ్వకుండా పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. ఎక్కడ తన ఇల్లు కూలగొడుతారమోనని 52 ఇళ్ల బుచ్చమ్మ అనే మహిళ భయాందోళనకు గురై ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల కుటుంబాన్ని చూస్తే చాలా బాధగా ఉంది. ఎంతో కష్టపడి మా బిడ్డల కోసం ఇండ్లు కట్టామని బుచ్చమ్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 


KTR News: బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య - ఆమె కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

ఆలోచన, ప్రణాళిక, పద్దతి లేకుండా చేశారు. వాళ్లే పర్మిషన్లు ఇచ్చి ట్యాక్స్ కట్టించుకొని వాళ్లే ఇల్లు కూలగొడుతారంట. హైడ్రా అనే సంస్థ కారణంగానే బుచ్చమ్మ బలవన్మరణం పొందారు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య. మీ దిక్కుమాలిన చర్యల కారణంగా పేదలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. వేదశ్రీ అనే పాప ఏడుస్తూ పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లు కూలగొట్టారు. ఇంత అమానవీయంగా ప్రవర్తించాలా? ఈ రాష్ట్రంలో పేద వాళ్లకు మాత్రమే చట్టాలున్నాయా? రేవంత్ రెడ్డి  నీ అన్నకు మాత్రం ఎఫ్టీఎల్ లో ఉన్న ఇల్లుకు నోటీసులిస్తారా?. పేదవాళ్లు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇల్లు కూల్చటమనేది ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన చర్య ఏదైనా ఉంటుందా ? . ఎన్నో హామీలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కడతాం, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అన్నారు. ఒక్క ఇళ్లు కట్టలేదు. కానీ ఎన్ని ఇళ్లు కూలగొట్టవో ప్రజలు గమనిస్తున్నారు.  

హైదరాబాద్ లో మాత్రమే కాదు ఊళ్లలో కూడా రేవంత్ రెడ్డి అరాచకం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు నీ కేబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు. హైడ్రా తో ఆర్థిక మంత్రికి ఏంటీ సంబంధం. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన ఇస్తాడు. ఐదు మంది బిల్డర్ల పేరు చెబుతాడు. ఎందుకిదంతా బ్లాక్ మెయిల్ దందానా? నీ మంత్రులు, నీ తమ్ముళ్లకు ఇదే దందానా?. పెద్ద పెద్ద బిల్డర్లను బెదిరించి వాళ్ల దగ్గర దందా చేసి చందాలు తీసుకోవటానినా నీ ప్రభుత్వం ఉన్నది. గరీబోళ్ల ఇళ్లు కూలగొట్టి హైడ్రా పేరుతో దందా చేస్తున్నారు. బుచ్చమ్మ మరణం ఆత్మహత్య కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఈ హత్య కేసు రేవంత్ రెడ్డి పైన ఆయన హైడ్రా పైన పెట్టాలి. 

బుచ్చమ్మ కుటుంబానికి అండగా ఉంటాం. వారికి ఆర్థిక సాయం చేశాం. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మీకు న్యాయసాయం చేస్తుంది. రాష్ట్రం మొత్తం మీద ఇవ్వాళ అరాచకం నడుస్తోంది. గరీబోళ్ల పొట్టకొట్టే ప్రభుత్వ చర్యలపై పోరాడుతాం, న్యాయ పోరాటం కూడా చేస్తాం.  గరీబోళ్లకు మేము అండగా ఉంటాం. వారికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తోడుగా ఉంటారు. హైదరాబాద్ ప్రజలు మాకు ఓటు వేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగ, కసి పెంచుకుంది. కచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మనందరం తిరగబడాల్సిందే’ అని కేటీఆర్ అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
Arjun Son Of Vyjayanthi Twitter Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
Jr NTR: ఎన్టీఆర్ బరువు తగ్గడానికి ఓజెంపిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారనే వార్తల్లో నిజమెంత? అసలు ఓజెంపిక్ అంటే ఏమిటో తెలుసా?
ఎన్టీఆర్ బరువు తగ్గడానికి ఓజెంపిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారనే వార్తల్లో నిజమెంత? అసలు ఓజెంపిక్ అంటే ఏమిటో తెలుసా?
Pakistan vs India Military Power: పాకిస్తాన్‌, భారత్‌లో ఎవరి వద్ద ఎక్కువ సైనిక శక ఉంది?  గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏం చెబుతోంది?
పాకిస్తాన్‌, భారత్‌లో ఎవరి వద్ద ఎక్కువ సైనిక శక ఉంది? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏం చెబుతోంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విక్టరీ | ABP DesamMitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RR

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
Arjun Son Of Vyjayanthi Twitter Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
Jr NTR: ఎన్టీఆర్ బరువు తగ్గడానికి ఓజెంపిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారనే వార్తల్లో నిజమెంత? అసలు ఓజెంపిక్ అంటే ఏమిటో తెలుసా?
ఎన్టీఆర్ బరువు తగ్గడానికి ఓజెంపిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారనే వార్తల్లో నిజమెంత? అసలు ఓజెంపిక్ అంటే ఏమిటో తెలుసా?
Pakistan vs India Military Power: పాకిస్తాన్‌, భారత్‌లో ఎవరి వద్ద ఎక్కువ సైనిక శక ఉంది?  గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏం చెబుతోంది?
పాకిస్తాన్‌, భారత్‌లో ఎవరి వద్ద ఎక్కువ సైనిక శక ఉంది? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏం చెబుతోంది?
IPL 2025 MI VS SRH Update: పిచ్ తో స‌న్ ను బోల్తా కొట్టించిన ముంబై.. వ‌రుస‌గా రెండో విక్ట‌రీ.. జాక్స్ ఆల్ రౌండ్ షో.. స‌న్ రైజ‌ర్స్ కు ఐదో ఓట‌మి
పిచ్ తో స‌న్ ను బోల్తా కొట్టించిన ముంబై.. వ‌రుస‌గా రెండో విక్ట‌రీ.. జాక్స్ ఆల్ రౌండ్ షో.. స‌న్ రైజ‌ర్స్ కు ఐదో ఓట‌మి
YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
JEE Main results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఆలస్యం? వెబ్‌సైట్ నుంచి ఫైనల్ కీ తొలగింపు - ఎన్టీఏ తీరుపై విమర్శలు
జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఆలస్యం? వెబ్‌సైట్ నుంచి ఫైనల్ కీ తొలగింపు - ఎన్టీఏ తీరుపై విమర్శలు
Embed widget