అన్వేషించండి

Governer On Cloud Burst : అది క్లౌడ్ బరస్ట్ కాదు మామూలు వర్షమే - తమిళిసై కీలక వ్యాఖ్యలు !

క్లౌడ్ బరస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అది క్లౌడ్ బరస్ట్ కాదని మామూలుగా వచ్చే వరదేనన్నారు.

Governer On Cloud Burst :  గోదావరికి వచ్చిన వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ కుట్ర ఉందని.. దీని వెనుక ఇతర దేశాలు ఉన్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేయడం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ అంశంపై సూటిగా స్పందించారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడకుండానే క్లౌడ్ బరస్ట్‌పై తన అభిప్రాయాలను సూటిగా చెప్పారు. గోదావరికి వచ్చిన వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ లేదని స్పష్టం చేశారు. అవి ఎప్పుడూ వచ్చే వరదలేనని కాకపోతే ఈ సారి కాస్త ఎక్కువగా వచ్చాయన్నారు. అంత మాత్రాన క్లౌడ్ బరస్ట్ అనలేమని స్పష్టం చేశారు. 

పువ్వాడని తన సంగతేంటో చూసుకోమనండి, ఉమ్మడి రాష్ట్రం కావాలని మేమూ డిమాండ్ చేస్తాం: బొత్స

గవర్నర్ , తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు అంత గొప్పగా లేవు. వరదలు వచ్చిన తర్వాత గవర్నర్ తమిళిసై వేగంగా స్పందించి ముందు ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయకపోయినా ఆమె ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అయితే సహాయ కార్యక్రమాలపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ ఆమె పర్యటనపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. గవర్నర్ పర్యటించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలను గవర్నర్ పట్టించుకోలేదు. 

పోలవరం వల్లే భద్రాచలానికి ముప్పు, చెప్తున్నా పట్టించుకోట్లేదు: పువ్వాడ, సీఎం జగన్‌పైనా పరోక్ష వ్యాఖ్యలు

తమిళిసై ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేశారు. తనకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. రాజ్ భవన్‌లో ప్రజాదర్బార్ వంటి కార్యక్రమం పెట్టడంపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. రాజ్ భవన్‌లో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఆ తర్వాత  ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్న సంకేతాలు వచ్చాయి. చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్ భవన్ కు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో ఎలాంటి విభేదాలు లేనట్లుగానే కేసీఆర్ వ్యవహరించారు. 

జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు మరో షాక్! ఆ పిటిషన్ కొట్టివేత, ఈయనకు గొప్పఊరట

అయితే ఇప్పుడు మళ్లీ సీఎం, మంత్రుల కంటే ముందే తమిళిసై వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లడంతో మరోసారి విభేదాలు  బయటపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్‌పై సీఎం కేసీఆర్ అభిప్రాయాను కూడా నేరుగానే తోసిపుచ్చడంతో టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
UP Elections 2027 Analysis: ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
Invest Telangana Global Summit 2026: కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
YS Sharmila Invitation Controversy: పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!
పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Embed widget