అన్వేషించండి

Telangana News: లోటస్‌ ఆపరేషన్ లోకల్! తెలంగాణలో బిజెపి సరికొత్త వ్యూహం!

Telangana BJP: తెలంగాణలో అధికారం దిశగా బిజెపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. గెలుపు విషయంలో రాజీలేకుండా , దూసుకుపోవాలంటూ కేంద్ర పెద్దల నుంచి రాష్ట్ర నాయకులకు సమాచారం అందిందని తెలుస్తోంది.

Telangana News: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది బీజేపీ. లెక్కలు మారబోతున్నాయని ప్రత్యర్థులకు హెచ్చరిక సైరన్ చేస్తోంది. అధికారం దిశగా సరికొత్త వ్యూహాాలకు పదునుపెడుతూ ముందుకు సాగుదాం అంటోంది బిజెపి అదిష్టానం. కేవలం మాటలు మాత్రమే కాదు, ఇప్పటికే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలందుతున్నాయి.

తెలంగాణలో గతంతో పోల్చితే బిజేపి బాగా బలపడింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ తరువాత తామే అంటూ ఆ పార్టీ నేతలు మాంచి జోష్ మీదున్నారు. ప్రభుత్వంపై విమర్శలు, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిల‌్లో మతం కార్డు ప్రయోగించడం అందులో భాగమే అంటున్నారు. ఇలా రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి నేతలు జోరు పెంచుతున్నారు.

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అధికారం కోసం ఉవ్విల్లూరుతున్న బిజెపి అధిష్టానానికి మాత్రం ఆ కల నెరవేరడం లేదు. కలగానే మిగులుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి బిజెపి లెక్క మారింది. అదృష్టం జస్ట్ ఒక్క అడుగు దూరంలోనే ఉందని నాయకత్వం నమ్ముతోంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగరం ఖాయం, ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం అనే ధీమాలో ఉన్నారు బిజెపి నేతలు.

ఈసారి కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని అధిష్టానం సీరియస్‌గా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు చాలా టైం ఉంది, ఇప్పడే ఎందుకంత తొందర అనుకుని వదిలేస్తే కుదరదు. ఇప్పటి నుంచి జనంలోకి వెళ్లాలి. పార్టీ క్యాడర్‌ను మరింత బలోపేతం చేసుకోవాలి. బలం, బలగం చేజారకుండా చేయడంతోపాటు బలహీనతలపై అందకంటే ఎక్కువ శ్రధ్దపెట్టాలని కేంద్ర పెద్దలు భావించారు. అందుకే తెలంగాణలో ఇప్పటి నుంచే ఆపరేషన్ లోకల్ మొదలు పెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. 

ఈ ఆపరేషన్ లోకల్‌లో భాగంగా తెలంగాణలోని జిల్లాల వారీగా పార్టీ  బలాలు, బలహీనతలు గుర్తించే బాధ్యతను కేంద్రమంత్రి కిషన్  రెడ్డికి అప్పగించినట్లుగా సమాచారం. ముఖ్యంగా ఖమ్మం,వరంగల్ , నల్గండ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఫిక్సయ్యారట కేంద్రపెద్దలు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ జిల్లాలోనే పార్టీ బలహీనంగా ఉందని రాష్ట్ర నాయకత్వంతోపాటు, కేంద్రం సైతం ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూడు జిల్లాల్లో పార్టీ బలాలు ,బలహీనతలు వెంటనే గుర్తించాలి. స్థానిక సమస్యలపై పోరాటం చేసేందుకు కార్యచరణ రూపొందించాలి. ఇతర పార్టీల నుంచి సమర్ధులైన నాయకులను ఆకర్షించాలి. పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని కదిలించేలా నిరసనలు, ఆందోళనలు చేసేందుకు బిజెపి నేతలు సిద్దమైనట్లు తెలుస్తోంది. 

Telangana News: లోటస్‌ ఆపరేషన్ లోకల్! తెలంగాణలో బిజెపి సరికొత్త వ్యూహం!

ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల‌్లో ఇప్పటికే ఏర్పడ్డ బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీల ఎన్నికపై మరోసారి క్రాస్ చెక్ చేసేందుకు ఇన్ ఛార్జ్ లను అధిష్టానం నియమించినట్లు తెలుస్తోంది. క్యాడర్‌ను ఉత్తేజపరిచే కార్యక్రమాలతోపాటు, ఆర్ ఎస్ ఎస్, విహెచ్పీ వంటి సంఘ్ పరివార్ సంస్దలతో కలసి ప్రజాసమస్యలపై పోరాటం చేయడం ద్వారా లోకల్ గా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ఇలా ఓ వైపు ఈ జిల్లాలో నిర్మాణాత్మకంగా కార్యకర్తలను తయారు చేసుకోవడంతోపాటు, ప్రభుత్వం చేపట్టే ప్రజావ్యతిరేక విధానాలపై జనాన్ని సంఘటితం చేయడం, వారికి మద్దతుగా పోరాడుతూ బిజేపీ అంటే లోకల్, లోకల్ అంటే బిజెపి అనేలా ఇప్పటి నుంచి ప్రజలకు మరింత దగ్గరవ్వాలని భావిస్తోంది. ఇలా ఆపరేషన్ లోకల్ పై దృష్టిపెట్టడం ద్వారా  అధికారం చేతి నుంచి కమలం వశం చేసుకొచ్చనే మాస్టర్ ప్లాన్‌తో తెలంగాణలో బీజెపి వ్యూహాత్మకంగా దూసుకోపోతోంది.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget