అన్వేషించండి

Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?

Telangana: దీపావళి తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రేవంత్ చెప్పారు. దీంతో ఆశావహులంతా మరోసారి మరో సారి లాబీయింగ్ ప్రారంభించారు.

Revant Cabinet expansion: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి దగ్గర పడుతోంది. ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్ని భర్తీ చేయలేదు. ఇవాళ..రేపు అని వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పటికి పది సార్లకుపైగా కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇక విస్తరించడమే మిగిలి ఉందని ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల దీపావళి తర్వాత కేబినెట్‌ను విస్తరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు దీపావళి కూడా ముగిసింది. ఆశావహులంతా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. 
 
మంత్రివర్గంలో ఆరు ఖాళీలు

తెలంగాణ మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి.  మంత్రివర్గంలో ఎవరెవర్ని తీసుకోవాలన్న  అంశంపై ఇప్పటికే  కొన్ని పేర్లను రేవంత్ రెడ్డి హైకమాండ్ కు సమర్పించారు. అయితే ఆశావహులు చాలా ఎక్కవగా ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.  గత డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆరు ఖాళీలను భర్తీ చేయాలని అనుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు సంపాదించుకోలేకపోయారు. గతం కన్నా ఎక్కువ సీట్లే సాధించుకున్నా ఎనిమిది స్థానాలకే  పరిమితమయ్యారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను పెంచవద్దని ఆయన  చెప్పిన వారికి కాకుండా ఇతరులకు మంత్రి పదవులు ఇవ్వాలని  పలువురు సీనియర్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారని అందుకే గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు.   

Also Read: Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం

ప్రస్తుతం పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఆరు ఖాళీలు ఉండటం వల్ల ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడుతోంది. హోంశాఖ, విద్యాశాఖ వంటి వాటికి మంత్రులు లేకపోవడంతో వస్తున్న సమస్యలను అధిగమించడానికైనా త్వరగా పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని రేవంత్ కోరుతున్నారు. అయితే వివిద రకాల సమీకరణాలు కలసి రాకపోవడం వల్ల హైకమాండ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీపావళి తర్వాత హైకమాండ్‌ను ఒప్పించాలని అనుకుంటున్న రేవంత్.. ఈ మేరకు పండగ అయిపోయిన తర్వాత విస్తరణ ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రేవంత్ ఎవరెవరికి పదవులు ఇవ్వాలో ఓ నిర్ణయానికి వచ్చారు. హైకమాండ్‌ సమీకరణాల్ని చూసుకుని ఓకే చేయడమే మిగిలింది.               

కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?

మహారాష్ట్ర ఎన్నికలతో ముడిపెడితే మరింత ఆలస్యం 

తెలంగాణ పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. హైకమాండ్ కూడా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అనుమతి ఇవ్వకపోవచ్చని ఎన్నికలు అయిపోయే వరకూ ఉండాలని సూచించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే .. పాలనకు ఏడాది దాటిపోయిన తర్వాత మాత్రమే అవకాశం లభిస్తుంది. రేవంత్ కు పలుకుబడి తగ్గిపోయిందని అందుకే మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వడం లేదని విపక్ష నేతలు చేస్తున్న ప్రచారానికి మరింత బలం సమకూరినట్లవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Telangana: ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Embed widget