Jawahar Lift Irrigation Project | జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని వంగవీడు గ్రామంలో 630 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరిగింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం వంగవీడు గ్రామంలో 630 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే జవహర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
కార్యక్రమంలో పాల్గొన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సాగు నీటిని సమృద్ధిగా అందించేందుకు, ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రైతుల కలలను నెరవేర్చే ఈ పథకం త్వరితగతిన ఫలితాలు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం అన్నారు. జవహర్ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 60,000 ఎకరాల పొలాలకు సాగునీరు అందించనుంది అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.



















