Jr NTR Apologize to CM Revanth Reddy
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమా వార్ 2. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. అయితే ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. సినిమా గురించి, అభిమానుల గురించి ఆనందంతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల సహకారం గురించి మాట్లాడటం మర్చిపోయా.. క్షమించండి అని అన్నాడు ఎన్టీఆర్. ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేయడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ కు ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్. పాతికేళ్ల సినిమా ప్రయాణం ఒక్క అభిమానితో మొదలైందని అతన్ని పరిచయం చేశారు తారక్. వార్ 2 ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన Jr NTR తన తాత సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకూ తనను ఎవ్వరూ ఆపలేరన్నారు. హృతిక్ రోషన్ ను మించిన డ్యాన్సర్ దేశంలోనే లేడన్నారు జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన ఆయన..హృతిక్, తను ఒకే సారి ఇండస్ట్రీలోకి వచ్చినా తనను చూసే డ్యాన్స్, యాక్టింగ్ విషయంలో ఇన్ స్పైర్ అయ్యాయని అలాంటిది అతనితోనే కలిసి నటించటం, డ్యాన్స్ చేయటం ఫ్యాన్ బోయ్ మూమెంట్ అన్నారు తారక్.





















