AP DSC 2025 Merit List: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ మెరిట్ లిస్ట్ ఎప్పుడు?
AP DSC 2025 Merit List: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయి. స్కోర్‌కార్డును అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. జిల్లాలు, జోన్‌లు వారిగా మెరిట్ జాబితా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

AP DSC 2025 Merit List: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్టాటస్ ఏంటో? జిల్లాలో, జోన్లో తామ ర్యాంకు ఎంతో ఉద్యోగం వస్తుందో రాదో అన్న చర్చ నడుస్తోంది. జిల్లా ఆయా సబ్జెక్టుల్లో టాప్ మార్కులు ఎన్ని కటాఫ్ ఎంత ఉండొచ్చు అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. స్కోర్ కార్డును అధికారిక వెబ్సైట్లో పెట్టిన అధికారులు మరో రెండు రోజుల్లో మెరిట్ లిస్ట్ విడుదల చేసేందుకు అవకాశం ఉంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంటుందో అనే విషయాలపై చర్చించుకుంటున్నారు.
మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు?
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అనేది జిల్లా స్థాయి, జోన్ స్థాయి అభ్యర్థుల కోసం నిర్వహించే పరీక్ష. ఉద్యోగాల నియామకం జిల్లాల వారీగా, జోన్ల వారీగా భర్తీ చేస్తారు. ఇదే విషయం నోటిఫికేషన్ టైంలోనే వెల్లడించారు. ఏ జిల్లాకు ఏ సబ్జెక్ట్ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయ. ఏ జోన్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో స్పష్టంగా తెలియజేశారు. ఏ కేటగిరికి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. నాన్ లోకల్ అభ్యర్థులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కూడా ముందే లెక్కలు వేసి చెప్పేశారు.
సాధారణంగా పరీక్ష తర్వాత జరిగే ప్రక్రియ నోటిఫికేషన్ టైంలోనే జరిగిపోయినందున మెరిట్ జాబితా తయారు చేయడం పెద్ద సమస్యగా ఉండదు. న్యాయపరమైన చిక్కులు కూడా ఉండేందుకు అవకాశమే లేదు. కాబట్టి జిల్లా స్థాయి అధికారులు ఈ పని మీదే ఉన్నారు.
టెట్ మార్కుల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చారు. ఇలా చేయడం ఇదే తొలిసారి. చాలా మంది టెట్ మార్కులు తప్పుగా వేశారని గుర్తించిన అధికారులు స్కోర్ కార్డు ప్రకటించిన తర్వాత కూడా టెట్ మార్కులు సవరణకు అవకాశం ఇచ్చారు. దీని కారణంగా ఫైనల్ స్కోర్‌లో మార్పులు జరగొచ్చు.
ఇప్పుడు టెట్లో క్వాలిఫై కాని అభ్యర్థులు కూడా టెట్ క్వాలిఫై అయినట్టు చెప్పుకొని పరీక్షలు రాశారు. కొందరు తప్పుగా మార్కులు నమోదు చేశారు. వీళ్లందరికి మరో అవకాశం ఇచ్చేందుకు టెట్ మార్కులు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఇలా మార్చుకునేందుకు ఆగస్టు 13 లోపు తప్పులు సవరించుకోవచ్చు.
తప్పులు సవరించుకోవడానికి గడువు ఇచ్చినందుకున ఆ తర్వాతే మెరిట్ లిస్ట్‌ను తయారు చేస్తారు. తప్పులు కరెక్షన్ చేసిన తర్వాత జిల్లా, జోనల్ స్థాయి మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. అనంతరం వాటిని వెబ్సైట్లో పెట్టనున్నారు. అనంతరం ఆగస్టు 17 తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సమయం కేటాయిస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఉద్యోగాలు వచ్చిన వారి పూర్తి జాబితాను అధికారులు వెబ్సైట్లో పెట్టనున్నారు. అలా ఫైనల్ లిస్ట్లో పేర్లు ఉన్న వాళ్లు కౌన్సెలింగ్ నిర్వహించి స్కూల్స్ ఎంచుకునే అవకాశం కల్పిస్తారు. ఆ ప్రక్రియ పూర్తి అయన తర్వాత వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఇది ఆగస్టు చివరి వారాంతానికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా 17 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని అన్నారు కానీ అది ఇప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.





















