అన్వేషించండి

Telangana: కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?

KTR: ఓ విదేశీ కంపెనీకి ప్రభుత్వ ఖజానా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా 55 కోట్లు బదిలీ చేశారు. ఆ యాభై ఐదు కోట్లు ఎవరికి బదిలీ అయ్యాయి.

KTR Arrest News:  ఫార్ములా ఈ రేసింగ్ లో యాభై ఐదు కోొట్ల రూపాయలు నిబంధనలకు విరుద్దంగా విదేశీ కంపెనీలకు బదిలీ చేసారు. ఇందులో కేటీఆర్ పాత్ర కీలకం.రేపో మాపో ఏసిబి నోటీసులు ఇవ్వనుంది. ఆ తరువాత కేటీఆర్ అరెస్ట్ తధ్యం.. ఇదీ తాజాగా మీడియోలో కోడై కూస్తున్న హెడ్ లైన్స్..

సోషల్ మీడియా పదేపదే హైలెట్ చేస్తున్న అంశం. అయితే మీడియా అత్యుత్సాహం చూపిస్తున్నంతలా ఈ కేసులో ఏముందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏకంగా యాభై కోట్ల ప్రజాధనం గంగపాలైయ్యిందనే కొత్త విషయం వెలుగుచూసింది. 55 కొోట్లు విదేశీ  కంపెనీ ఖాతాలోకి వెళ్లడంలో కేటీఆర్ పాత్ర ఎంత ఉందో..అంతే స్దాయిలో రేవంత్ తొందరపాటు నిర్ణయంతో ఉన్నపళంగా రేస్ నిర్వహణ ఒప్పందం రద్దు చేయడం కూడా అంతే తొందరపాటు చర్య అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కేటీఆర్ పర్యవేక్షణలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణ
 
హైదరాబాద్ లో 2023 ఫిబ్రవరి 10,11 వ తేదీలలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ కు కొత్త జోష్ తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. లాభనష్టాలు ప్రక్కన పెడితే కార్ రిసింగ్ టీవిలలో మాత్రమే చూసిన హైదరబాదీలకు మొదటి సారి ప్రత్యక్షంగా  రేసింగ్ జోరు చూపింది ఈ కార్ రేసింగ్. 

గత బిఆర్ ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖా మంత్రి  కేటీఆర్ ఈ రేసింగ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. కర్త,కర్మ,క్రియ తానై హుస్సేన్ సాగర తీరాన ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించారు.హైదరాబాద్ లో నాలుగు సంవత్సరాలపాటు ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించాలంటూ 2022 ,అక్టోబర్ 25వ తేదిన మొాదటిసారి ఫార్ములా ఈ ఆపరేషన్స్, నెక్ట్స్ జన్ అనే రెండు విదేశీ సంస్దలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఓప్పందంలో భాగంగా మొదటి ఏడాది అంటే 2023 ,ఫిబ్రవరి 10,11 వ తేదీలలో భారీ హంగులతో ,అత్యంత వైభవంగా హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించారు ఎఫ్ ఈఓ ,నెక్ట్స్ జన్ కంపెనీలు. దేశవ్యాప్తంగా హైదరాబాద్ లో జరిగిన కార్ రేసింగ్ అందరినీ ఆకట్టుకుంది, కానీ నిర్వహణ సంస్ధలకు ఆశించిన స్దాయిలో లాభాలు తెచ్చిపెట్టలేదు సరికదా నష్టాల్లో నెట్టింది. దీంతో 2024 తాము కార్ రేసింగ్ నిర్వంచలేమంటూ ఒప్పందం నుండి హైదరాబాద్ పేరును తొలగించింది ఎఫ్ ఈ ఓ. ఈ విషయం ఎక్కడా బయట పడకుండా గత ప్రభుత్వ జాగ్రత్తపడింది. 

రెండో ఏడాది స్పాన్సర్ వెనక్కి తగ్గడంతో సమస్యలు 

హైదాబాద్ లో కార్ రేసింగ్ నిర్వహించిన క్రెడింగ్ తమ ఖాతాలో వేసుకున్న బిఆర్ ఎస్ ప్రభుత్వం ,తిరిగి మరో ఏడాది కూడా నిర్వహించాలని భావించింది. దీనికి ఎఫ్ ఈ ఓ ససేమీరా అనడంతో ప్రమోటర్ గా బాధ్యత హెచ్ ఎండిఏ తీసుకుందని చెప్పి విదేశీ కంపెనీలను రేస్ నిర్వహణకు ఒప్పించారు కేటీఆర్. తిరిగి 2023 అక్టోబర్ నెలలో మరోసారి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం యాధావిధిగా 2024 ఫిబ్రవరి 10వ తేదిన ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించాలి. అందుకుగాను 100కోట్లు నిర్వహణ ఖర్చుకు అవసరంకాగా అందులో హెచ్ ఎండిఏ తన ఖజానా నుండి 55కోట్లు , నిర్వహణ సంస్ద అయిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ ఈ ఓ)అనే విదేశీ సంస్దకు బదిలీ చేసింది.

కానీ రేస్ నిర్వహణకు మూడు నెలల ముందే బిఆర్ ఎస్ ఓటమిపాలవ్వగా, రేవంత్ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే సిఎం రేవంత్ ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందాన్ని రద్దు చేసారు. నిబంధనలకు విరుద్దంగా విదేశీ కంపెనీకి కేటీఆర్ 55 కొోట్లు ఎీలా బదిలీ చేయమంటారంటూ రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. ఏసిబి విచారణకు ఆదేశించడంలో ఇప్పటికే హెచ్ ఎండిఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ ను విచారించారు ఏసిబి అధికారులు. తాను కేటీఆర్ చెబితేనే 55కోట్లు బదిలీ చేసానంటూ అరవింద్ కుమార్ ఏసిబికి చెప్పినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ 

దీనిపై కేటీఆర్ వాదన మరోలా ఉంది. తాను మున్సిపల్ మంత్రిగా ఉన్నాను, హెచ్ ఎండిఏ వైస్ చైర్మెన్ గా ఉన్నాను. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకే ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించాం. నిర్వహణ కంపెనీలు చేతులెత్తేశాయి కాబట్టే ఫండింగ్ కొరత లేకుండా 55కోట్లు బదిలీ చేసాం. స్పాన్సర్స్ ను చూసి తిరిగి ఆ డబ్బు రాాబట్టే ప్రయత్నం చేద్దామనుకున్నాం ఇందులో తప్పేముంది. కేసులు మాపై కాదు రేవంత్ పై పెట్టాలి అంటున్నారు. 

ఇక్కడ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రేస్ వివాదంలో కొత్త ట్విస్ట్ ఏటంటే.. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తామే అధికారంలోకి వచ్చేస్తాము. 2024 ఫిబ్రవరిలో తామే రేసింగ్ నిర్వహిస్తామనే అత్యుత్సాహంతో 55 కోట్లు ఆగమేఘాలమీద బదిలీ చేసారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి కూడా అంతే దూకుడుతో యాభైకోట్లు వెనక్కు రాబట్టకుండానే గత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసారు. ఇప్పుడు ఇద్దరు చేసిన అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం విదేశీకంపెనీల పాలైయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఒకరిపై ఒకరు వివర్శలు, ఏసిబి నోటీసులు, అరెస్ట్ లు అంటూ కక్షసాధింపు వ్యహరాలు తప్ప పోయిన ప్రజాధనం ఆ విదేశీ కంపెనీ ( ఎఫై ఈ ఓ ) నుండి ఎవరు రాబడతారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Embed widget