అన్వేషించండి

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం

Musi: మూసి నది ప్రక్షాళన చేసి తీరుతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూసి పునరుజ్జీవ పాదయాత్ర తర్వాత నాగిరెడ్డిపల్లిలో రేవంత్ మాట్లాడారు.

Revanth Reddy has announced that he will clean the Musi river: మూసి ప్రాజెక్టులో కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అణుబాంబు పేలితే ఎంత నష్టం జరుగుతుందో మూసిస నదిలో కాలుష్యం వల్ల అంత  కంటే ఎక్కువ నష్టం జరుగుతుందని అన్నారు. మూసి పరివాహక ప్రాంతంలో రెండున్నర కిలోమీటర్లు మూసి పునరుజ్జీవ పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

మూసి ప్రక్షాళన ప్రాజెక్టు చేసి తీరుతామని ప్రకటించారు. ముఫ్పై రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లు ఖరారు అవుతాయన్నారు. ఎవరు అడ్డుకున్నా బుల్డోజర్లతో తొక్కుకుపోయి పనులు చేయిస్తామన్నారు. ఇవాళ చూపించినది ట్రైలర్ మాత్రమేనని .. వాడపల్లి నుంచి జనవరిలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కేసీఆర్,కేటీఆర్, హరీష్ దమ్ముంటే మూసి ప్రక్షాళన ప్రాజెక్టు ఆపేందుకు ప్రయత్నించాలని సవాల్ చేశారు.  కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్ఎస్ అంటోందని .. తనకు కమిషన్లే కావాలనుకుంటే ధరణిలో బీఆర్ఎస్ వాళ్లు చేసినట్లే చేస్తే చాలని వ్యాఖ్యానించారు. 

మూసి ప్రక్షాళన అడ్డుకుంటే నల్లగొండ ప్రజలతో వచ్చి మీపై బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటానని రేవంత్ హెచ్చరించారు.  బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాలు.. ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి.. మా వెంకన్నను బుల్డోజర్ పై ఎక్కిస్తా... మా ఎమ్మెల్యే సామెల్ తో జెండా ఊపిస్తానని సవాల్ చేశారు.  మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే... మూసీ పరివాహక బిడ్డల జీవితాలు పోతుంటే నీకు పట్టదా అని ప్రశ్నించారు. నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా కేసీఆర్ ?మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నావ్ నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ... మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారని హెచ్చరించారు. 

మూసీని ప్రక్షాళన చేయకపోతే తన జన్మ దండగ అని రేవంత్ రెడ్డి  ప్రకటించారు. మూసీ నల్గొండ ప్రాంతానికి ఒకనాడు వరం అని, ప్రస్తుతం నల్గొండను ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ పీడిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో గౌడన్నలు కల్లు అమ్ముకునే పరిస్థితి లేదని, మూసీ నదిఒడ్డున పెంచే గొర్రె మాంసాన్ని కొనే పరిస్థితి లేదన్నారు.  ఇక్కడ గేదె, ఆవు పాలను కొనే పరిస్థితి లేదని తెలిపారు. బాధిత రైతుల బాధలు స్వయంగా తెలుసుకున్నానని, మూసీ కింద కూరగాయ రైతులు వ్యవసాయం కూడా చేయడం లేదన్నారు.  మన నగరాన్ని విధ్వంసం చేస్తుంటే రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మూసీ నది వరంగా మారాల్సింది శాపంగా మారితే బాగుచేయవద్దా అని రేవంత్ ప్రశ్నించారు. 

బీఆర్ఎస్, బీజేపీ వాళ్లను గ్రామాల్లో పిలవాలని..   మూసీ ప్రక్షాళన చెయ్యాలో వద్దో అడగాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చరాు.  బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు చెరో దిక్కున మనల్ని అడ్డుకోవాలని చూస్తున్నారని కానీ   సీపీఐ, సీపీఎం సోదరులు మద్దతుగా నిలిచా్నారు.  ఈ మూసీ నది మనకు వరంగా మారాల్సిందే. మార్పు చేసుకోవాల్సిందే. మూసీకి లక్షన్నర కోట్ల టెండర్ 25 వేల కోట్లు నేను తిన్నానని అంటున్నారని..   నేను మీలాంటి వాణ్ని కాదని స్ప్పష్టం చేశారు. మీరు కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. మీరు తెచ్చిన ధరణిని అడ్డం పెట్టుకుంటే.. కోకాపేటలో నాకు రూ.50వేల కోట్లు రాగలవని చెప్పారు. కానీ తాను అలా కాదన్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Embed widget