Son murdered Mother: అలాంటివాడ్ని కనడమే ఆమెకు శాపం - నరికి చంపేసిన కన్నకొడుకు- ఏలూరులో ఘోరం !
Mother Murder: ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వడం లేదని ఓ కుమారుడు తల్లిని నరికి చంపాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Son hacked his mother to death: నవమాసాలు మోసి కన్న తల్లిని జీవితాంతం అత్యంత జాగ్రత్తగా చూసుకునే బిడ్డలు ఉంటారు. చూసుకోవడం చేతకాకపోయినా ఆమె బతుకు బతుకుతుందని వదిలేస్తారు. కానీ కొంత మంది రాక్షసుల్లాంటి వారు మాత్రం తమను కన్నందుకు కష్టాలు పడాల్సిందేనని వేధిస్తూంటారు. మరికొంత మంది నరరూపరాక్షసులు మాత్రం.. కన్న తల్లి అని చూడకుండా చంపేస్తూంటారు. ఇలాంటి ఓ సైకో.. ఏలూరు జిల్లా కొయ్యగూడెంలో ఉన్నాడు. అతని పేరు శివ.
మద్యానికి బానిసైన కొడుకు సైకోగా మారిన వైనం
కొయ్యగూడెం గ్రామంలో రోడ్డు మీద హటాత్తుగా చావు కేకలు వినిపించడం అందరూ భయపడిపోయారు. ఏమయిందో అని వచ్చి చూస్తే.. కొడవలిని తీసుకుని ఓ వ్యక్తి మహిళను ఇష్టం వచ్చినట్లుగా నరికేస్తున్నాడు. అయితే అతన్ని గుర్తు పట్టిన వారు మరింత షాక్‌కు గరయ్యారు. ఎందుకంటే ఆ వ్యక్తి చంపుతున్నది.. కన్నతల్లినే. అతని చేతిలో కొడవలి ఉండటంతో ఎవరూ ధైర్యం చేసి ముందుకు వెళ్లి ఆ కిరాతక కుమారుడి నుంచి తల్లిని కాపాడేందుకు ప్రయత్నించలేకపోయారు. కానీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇల్లు అమ్మి డబ్బులివ్వలేదని ఘోరమైన హత్య
మృతురాలి పేరు జక్కు లక్ష్మీనరసమ్మ. ఆమెకు ఓ ఇల్లు ఉంది. కుమారుడు శివ గాలి తిరుగుళ్లు తిరుగుతూ ఉంటాడు. మద్యానికి బానిస అయి.. ఊరంతా అప్పులు చేసి.. డబ్బుల కోసం తల్లిని వేధిసతూ వస్తున్నాడు. ఉన్న ఒక్క ఇల్లును అమ్మేసి డబ్బులివ్వాలని ఇటీవలి కాలంలో రోజూ గొడవ పడుతున్నారు. వారి గొడవను చుట్టూపక్కల వారు చూస్తూనే ఉన్నారు. హత్య జరిగిన రోజు కూడా అది కామనే అనుకున్నారు. కానీ ఇలా నరికేస్తాడని ఊహించలేకపోయారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన తల్లి
తల్లిని నరికేసిన రాజన్న కాసేపటికి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అంబులెన్స్ ను తీసుకు వచ్చారు. వేగంగా ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆమె చనిపోయిది. తల్లిని నరికి చంపిన కుమారుడు శివను పట్టుకునేందుు పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి కుమారుడ్ని కంటే.. ఇలా చచ్చిపోవడమేనని.. శివపై చుట్టుపక్కల వారు శాపనార్థాలు పెడుతున్నారు.
Sad to see this..😭😭
— AppalaNaiduKellaiTdp (@AppalaNaiduKe12) August 10, 2025
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం లోని అశోక్ నగర్ లో తల్లి పై కొడుకు హత్యాయత్నం.. ఆస్తి విషయంలో గొడవ... తల్లి పరిస్థితి విషమం. pic.twitter.com/EkX9GNRpWE
మద్యానికి బానిసైన వారు ఇలా ఏం చేస్తున్నామో తెలియని ఘోరమైన స్థితికి వెళ్లి నేరాలు చేస్తున్నారని ఇలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.





















