ASI Aparna Lava Kumar Viral Video | Ambulance ముందు పరుగులు పెట్టిన ఏఎస్ఐ | ABP Desam
దీనికి రీజన్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ లో కనీసం అంబులెన్స్ వెళ్లటానికి స్పేస్ లేని చోట ఈ లేడీ పోలీస్ ఇలా పరుగులు పెడుతూ అంబులెన్స్ ముందున్న వాహనాలను క్లియర్ చేసి ఎమర్జెన్సీ లో ఉన్న పేషెంట్ ను వెంటనే హాస్పటల్ కు తీసుకువెళ్లేందుకు హెల్ప్ చేశారు. ఇప్పుడు ఈ మహిళా పోలీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె పేరు అపర్ణా లవ్ కుమార్. కేరళలోని త్రిసూర్ లో ASI గా విధులు నిర్వర్తిస్తున్నారు. తన డ్యూటీని ఫర్ ఫెక్ట్ గా చేస్తూ ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా ఇలా అంబులెన్స్ ముందు అపర్ణా పరుగులు పెట్టిన వీడియో కేరళ పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంది. కేరళ పోలీస్ తమ అఫీషియల్ ఖాతాలోనూ అపర్ణ వీడియోను పోస్ట్ చేసి ప్రశంసించింది. ఇప్పుడే కాదు 2019లోనూ ఓసారి అపర్ణ వైరల్ అయ్యారు. అప్పుడు క్యాన్సర్ బాధితుల కోసం తన జడను విగ్ కింద కట్ చేయించి ఇచ్చేశారు అపర్ణా. తనకు ఎప్పుడూ అలా చేయటం అలవాటు ఉన్నా అప్పుడు మాత్రం Ketto అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వార్త బయటకు రావటంతో అపర్ణ సేవాదృక్పథాన్ని అందరూ ప్రశసించారు. డ్యూటీనే కాకుండా ఖాళీగా ఉన్న సమయాల్లో కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు ఎలా జాగ్రత్తలు వహించాలనే విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అపర్ణ లవ్ కుమార్.





















