Tollywood Producers meet Minister Kandula Durgesh | సినీ నిర్మాతలతో మంత్రి దుర్గేష్ భేటీ | ABP Desam
టాలీవుడ్ లో నిర్మాతలు వర్సెస్ కార్మికులు అన్నట్లు వివాదం కొనసాగుతున్న వేళ తెలుగు సినీ నిర్మాతలు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను అమరావతిలో కలిశారు. ప్రొడ్యూసర్లు భోగవల్లి ప్రసాద్, నాగవంశీ, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, టీజీ విశ్వప్రసాద్ మంత్రి దుర్గేష్ ను కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న వివాదాన్ని మంత్రికి ప్రొడ్యూసర్లు వివరించారు. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ సామరస్యంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న మంత్రి దుర్గేష్..అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తామని చెప్పారు.ఏపీలో మంత్రి కందుల దుర్గేష్ ను కొంత మంది సినీ నిర్మాతలు కలిసిన రోజే తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మరికొంత మంది సినీ నిర్మాతలు కలిశారు. వీళ్లు కూడా మంత్రి దృష్టికి టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలను దృష్టికి వెళ్లారు. అయితే తెలంగాణ ప్రభుత్వం సినీ కార్మికుల పక్షాన ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఫెడరేషన్, ఛాంబర్ రెండూ పట్టు విడుపులతో వ్యవహరించాలన్న మంత్రి కోమటి రెడ్డి...కార్మికులు కూడా చిన్న నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని డిమాండ్లు పెట్టాలన్నారు.





















