Nidhi Agarwal car controversy: వీరమల్లు హీరోయిన్‌కు ప్రభుత్వ కారిచ్చారా ? - తేలిపోయిన రాజకీయ వివాదం -ఇదిగో క్లారిటీ
Nidhi Agarwal car: నిధి అగర్వాల్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కారు వివాదాస్పదమయింది. చివరికి అది డ్రైవర్ చేసిన తప్పిదం అని తేలింది.

Nidhi Agarwal car sparks controversy: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వీరమల్లు సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ ఓ కారులో ప్రయాణించారు. దానికి ప్రభుత్వ వాహనం అనే బోర్డు ఉంది. దాంతో వివాదం ప్రారంభమయింది.
నిధి అగర్వాల్ భీమవరం లో ఒక జ్యువెలరీ స్టోర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆమె ప్రయాణించిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదని దానిపై "ON GOVT DUTY" అని ఉందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది టయోటా క్రిస్టా వాహనం. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. దీంతో ప్రభుత్వ వాహనాన్ని ప్రైవేటు పనికి ఉపయోగించడం పట్ల విమర్శలు వచ్చాయి.
నిధి అగర్వాల్ వచ్చిన కారు 2019లో రాజమండ్రి ఎంపీగా పని చేసిన @BharatRam_MP ఆయన బంధువుల షాపింగ్ మాల్ ఓపినింగ్ వచ్చిన నిధి అగర్వాల్ ను భరత్ కారులో రిసీవ్ చేసుకున్నారు.. ఆ కారుకి డిప్యూటీ పవన్ కళ్యాణ్ కి ఎటువంటి సంబంధం లేదు అని తెలుస్తుంది.. ఆ కారు సంబంధించిన ఫుల్ డిటైల్స్ చూడండి..… pic.twitter.com/0QqjM6KtuW
— South Digital Media (@SDM_official1) August 11, 2025
నిధి అగర్వాల్ ఈ వివాదంపై తన సోషల్ మీడియాలో ఒక స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ఈ వాహనాన్ని ఈవెంట్ ఆర్గనైజర్లు అరేంజ్ చేశారు. నాకు దాని గురించి తెలియదు, నేను దానిని రిక్వెస్ట్ చేయలేదు. ప్రభుత్వ అధికారులతో ఎలాంటి సంబంధం లేదు. ఈ రూమర్లు పూర్తిగా బేస్‌లెస్ అని చెప్పారు. తన అభిమానులకు నిజం చెప్పాలని, మిస్‌ఇన్ఫర్మేషన్ ప్రచారం చేయవద్దని కోరారు.
#NidhiAgarwal clarification on using Govt vehicle for Bhimavaram store launch event pic.twitter.com/kFAb3xDLCv
— Bharat Media (@bharatmediahub) August 11, 2025
ఆర్టీఏ రికార్డుల ప్రకారం ఆ వాహనం ప్రభుత్వానిది కాదు. కనీసం ప్రభుత్వానికి అద్దెకు కూడా ఇవ్వలేదు. ప్రైవేటు ట్రావెల్స్ లో నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ వాహనం అని ఆ డ్రైవర్ బోర్డు పెట్టుకోవడంతో వివాదాస్పదమయింది. ఉద్దేశపూర్వకంగా ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ పోలీసుల నుంచి, ఆర్టీఏ అధికారుల నుంచి తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కారు డ్రైవర్ తాను చేసింది తప్పేనని క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేశారు.
డ్రైవర్ శివాజీ – నటి నిధి అగర్వాల్ కారు వివాదంపై స్పష్టీకరణ..
— Swathi Reddy (@Swathireddytdp) August 11, 2025
నటి నిధి అగర్వాల్ భీమవరం ట్రిప్‌లో వాడిన కారుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై డ్రైవర్ శివాజీ స్పందించారు... pic.twitter.com/pbLLFZ49VP
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి అంశం రాజకీయం అవుతోంది. సంబంధం లేకపోయినా ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకు వచ్చారు. ఏదైనా ఓ కార్యక్రమంలో హీరోయిన్లు, సెలబ్రిటీలను ఆహ్వానిస్తే.. వారికి విమానం టిక్కెట్లు,, ర వాణా, బస సహా మొత్తం నిర్వాహకులే చూస్తారు. ఎవరికీ సంబంధం ఉండదు. అంతా తెలిసి కూడా పవన్ కల్యాణ్ పై కోపంతో ఇలాంటి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారని జనసేన వర్గాలంటున్నాయి.





















