Jr NTR No Politics : రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం - సినిమాలే లైఫ్ - ప్రతీ సారి వివాదాలెందుకు ?
Jr NTR: రాజకీయాలకు తాను రాజకీయాలకు దూరమని ప్రకటించారు. సినిమాలపైనే దృష్టి పెట్టాన్నారు జూ.ఎన్టీఆర్. అయితే ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ రాజకీయాలు వెదుక్కుంటూ కొంత మంది సోషల్మీడియాలో హడావుడి చేస్తున్నారు.

NTR is far from politics: " నేను సినిమాలు చేస్తున్నా.. సినిమాలే చేస్తా.. అభిమానులను మెప్పిస్తా" అని వార్ 2 ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. దీని అర్థం స్పష్టంగా ఉంది. రాజకీయాలపై దృష్టి లేదని సినిమాలు మాత్రమే తన టార్గెట్ అని నేరుగానే చెప్పేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసేందుకు రెడీ అయ్యారు. వార్ 2 సినిమాలో ఆయన ట్రూలీ పాన్ ఇండియా హీరో అవబోతున్నారు. ఆ సినిమా సక్సెస్ అయి.. హిందీ జనం కూడా ఎన్టీఆర్‌కు ఫిదా అయితే.. ఆయన ఇక బాలీవుడ్‌కు మకాం మార్చినా ఆశ్చర్యం లేదు. ఎన్టీఆర్ ఇప్పుడు సినీ కెరీర్‌లో అత్యుత్తమైన పేజ్ లో ఉన్నారు. అందుకే ఇతర అంశాలపై దృష్టి పెట్టడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా అదే చెబుతున్నారు. కానీ ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ రాజకీయం వెదుక్కని కొంత మంది సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు.
ఎన్టీఆర్‌ను సోషల్ మీడియాలో రాజకీయ వివాదాల్లోకి తెస్తున్న ఫ్యాన్స్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో కొంత మంది సోషల్ మీడియాలో.. టీడీపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఆయనను రాజకీయంగా తొక్కేశారని చెబుతూ ఉంటారు. వారు వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ ఉంటారు. కొంత మంది టీడీపీ మద్దతుదారులు కూడా జూఎన్టీఆర్ పలానా కార్యక్రమంలో పాల్గొనలేదని.. ఫలానా సమయంలో మద్దతు ఇవ్వలేదని ప్రకటనలు చేస్తూ ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూంటారు. ఇదంతా ఎన్టీఆర్ కు సంబంధం లేని అంశాలే.
రాజకీయ నీడ ఉన్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొనని తారక్
పూర్తిగా సినీ కెరీర్ మీదనే ఎన్టీఆర్ దృష్టి పెట్టారు. ఇతర అంశాలు మాట్లాడితే.. అవే హాట్ టాపిక్ అవుతాయని మాట్లాడటం మానేశారు. ఓన్లీ సినమాలపైనే మాట్లాడుతున్నారు. ఈ కారరణంగా రాజకీయం అని అనిపించిన ఏ చిన్న అంశంలోనూ స్పందించడం లేదు. కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చివరికి తన సోదరి పోటీ చేసినా మద్దతు లాంటి ప్రకటనలు చేయలేదు. ఆయన కంప్లీట్ గా పొలిటికల్ పిక్చర్ నుంచి దూరంగా ఉన్నారు. కానీ ఆయనను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాటిపై స్పందిస్తే ఇంకా ఎక్కువ రాజకీయం అవుతుందని ఆయన సైలెంట్ గా ఉంటున్నారు.
రకరకాల పుకార్లతో ఎన్టీఆర్ పై రాజకీయ ముద్ర వేసే ప్రయత్నం
కుటుంబపరమైన విషయాల్లో నందమూరి ఫ్యామిలీ కలుపుకోవడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూంటారు. కానీ అందరూ ఎప్పటికప్పుడు కుటుంబ కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉంటారు. నారా లోకేష్ కూడా చాలా సార్లు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఆయనతో గతంలో ఉన్న చనువు ప్రకారం ... కొంత మంది రాజకీయంగా ప్రకటనలు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. సోషల్ మీడియాలోనూ అదే పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎ ప్రకటన చేసినా.. దానికి లోతైన అర్థాలు ఇవే అంటూ.. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తూ రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం.. గట్టిగా ఒకే సందేశం ఇచ్చారు.





















