By: ABP Desam | Updated at : 23 Sep 2023 11:02 AM (IST)
Retired IPS Mannem Nageswara Rao once again made a controversial tweet
రిటైర్డ్ ఐపీఎస్ ఎం.నాగేశ్వరరావు ట్విటర్ వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంసారులపై బురద చల్లడానికి వ్యభిచారులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారని అన్నారాయన. అది లైంగిక వ్యభిచారులైనా.. రాజకీయ వ్యభిచారులైనా అంతేనంటూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కేసులపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించే ఆయన ఈ ట్వీట్ చేశారంటూ చర్చ జరుగుతోంది.
సంసారులపై బురద చల్లడానికి వ్యభిచారులు ఎల్లప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు.
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) September 23, 2023
అది లైంగిక వ్యభిచారులైనా లేక రాజకీయ వ్యభిచారులైనా!
ఎం.నాగేశ్వరరావు.. ఆయన రూటే సపరేటు. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ఎన్నో వివాదాస్పద ట్వీట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లపై జరుగుతున్న రగడపైనా ఆయన కాంట్రావర్సీ కామెంట్స్‌తో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పేరును వైఎస్ఆర్ ప్రదేశ్‌గా మార్చేస్తే ఎలాంటి సమస్య ఉండదంటూ ఏపీ సీఎం జగన్‌కు సలహా కూడా ఇచ్చారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఆందోళనలు విస్తృతమైన సమయంలో ఆయన అలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఐపీఎస్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యే వారం ముందు కూడా హిందూత్వానికి అనుకూలంగా ట్వీట్ చేసి వివాదాలకు తెరతీశారు. స్వాతంత్య్ర కాలం నాటి ముస్లిం విద్యావేత్తలను కించపరిచేలా, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలతోనే ట్వీట్ చేశారు. సంసారులపై బురద చల్లడానికి వ్యభిచారులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారని.. అది లైంగిక వ్యభిచారులైనా.. రాజకీయ వ్యభిచారులైనా అంతేనంటూ ట్వీట్ చేశారు. అంటే... చంద్రబాబును అనుకూలంగానే ఆయన ట్వీట్ చేశారంటున్న కొందరు విశ్లేషకులు. స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించింది ఏసీబీ కోర్టు. ఆయన అవినీతి చేశారని... ఆధారాలతో సహా దొరికిపోయారని వైసీపీ సర్కార్, మంత్రులు, నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు చేసిన ఈ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సంసారులపై బురద చల్లడానికి వ్యభిచారులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారంటూ ఆయన ట్వీట్ చేయడంతో .. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడాలంటూ చర్చ జరుగుతోంది.
1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మన్నెం నాగేశ్వరరావు తెలుగువ్యక్తి. ఒడిశా క్యాడర్ చెందిన ఐపీఎస్ అధికారి. వరంగల్ జిల్లామంగపేట మండలం బోర్‌నర్సాపూర్.. ఆయన స్వగ్రామం. 2018లో సీబీఐ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 2020 ఆగస్టులో రిటైరయ్యారు. పదవిలో ఉన్నప్పటి నుంచే వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తున్నారు నాగేశ్వరరావు. ఇప్పుడు మరోసారి... ఆయన స్టయిల్‌లో ట్వీట్ చేసి... మరో వివాదానికి అగ్గి రాజేశారు.
Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !
Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !
Telangana Elections 2023 : ఫుల్ స్వింగ్‌లో బెట్టింగ్ బంగార్రాజులు - సొంత సర్వేలతో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పందేలు !
Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!
Telangana Elections 2023 : ప్రలోభాల్లో ఎవరూ తగ్గట్లే - కొన్ని డబ్బులు డిమాండ్ చే్సతున్న ఓటర్లు !
Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!
Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!
Telangana Polling 2023 : హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!
Revanth Reddy: కేసీఆర్ పన్నాగాలు ఫలించవు, అన్ని దింపుడుకల్లం ఆశలే - సాగర్ ఉద్రిక్తతలపై రేవంత్
/body>