అన్వేషించండి

Mlc Iqbal: 'అందుకే వైసీపీకి రాజీనామా చేశా' - ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Andhrapradesh News: వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంపై మహ్మద్ ఇక్బాల్ స్పందించారు. తనకు టికెట్ ఇవ్వనందుకు కాదని.. అమర్యాదగా ప్రవర్తించినందుకే పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు.

Mlc Iqbal Sensational Comments: అనంతపురం జిల్లా వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (Iqbal) శుక్రవారం ఆ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, తన రాజీనామా వెనుక ఉన్న కారణాలపై ఆయన శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హిందూపురం టికెట్ ఇవ్వనందుకు కాదని, అమర్యాదగా ప్రవర్తించినందుకే వైసీపీకి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. మైనారిటీలకు ఏమీ చేసే అవకాశం ఇవ్వలేదని.. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు రక్షణ ఉండేదని అన్నారు. ఈ క్రమంలో 2 రోజుల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారని ఆయన ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మహ్మద్ ఇక్బాల్ ఓడిపోయారు. అనంతరం ఇక్బాల్ కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. హిందూపురం ఇంఛార్జ్ గా కొనసాగారు. నాలుగేళ్ల వరకూ పని చేసిన తర్వాత ఆయన స్థానంలో దీపిక ను ఇంఛార్జ్ గా నియమంచారు. ఇక్బాల్ పేరును జగన్ మరెక్కడా పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది.           

హిందూపురం నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీలో వర్గ పోరు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలుకు జిల్లాకు చెందిన ఇక్బాల్‌కు వ్యతిరేకంగా.. పార్టీ నేతలంతా జట్టు కట్టారు. ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఆద్వర్యంలో మాజీ ఎంఎల్ఏ అబ్దుల్ ఘనీ, కొండూరు వేణుగోపాల్ రెడ్డి లాంటి బలమైన నేతలంతా కలిసి స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్బాల్ ను తప్పించిన వైసీపీ హైకమాండ్ స్థానికురాలు కానప్పటికీ బీసీ మహిళ కోటాలో దీపికకు సీటు ఇచ్చారు. ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో.. రెండు వర్గాలుగా కలసి వస్తుందన్న అంచనాతో అభ్యర్థిని ఖరారు చేశారు. అయితే ఇక్బాల్ ను అసలు పరిగణనలోకి తీసకోలేదు. ఇటీవలి కాలంలో ఇక్బాల్ కు పార్టీ కార్యక్రమాలకూ పిలుపు రావడం లేదు. పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన అవమానం ఫీలయ్యారు. తనకే టిక్కెట్ అని ఏడాది కిందటి వరకూ నమ్మించారని ఇప్పుడు అసలు అవమానించడం ఏమిటని ఇక్బాల్ భావిస్తున్నారు. గతంలో తాను ఇంఛార్జిగా ఉన్నప్పుడు వర్గ పోరాటాన్ని కంట్రోల్ చేసేలా.. హైకమాండ్ వ్యవహరించలేదని.. ఇప్పుడు పూర్తిగా అవమానిస్తున్నారని అంటున్నారు. వైసీపీ తనను నిర్లక్ష్యం చేసినందున.. తనకు ఆ పార్టీ ఇచ్చిన పదవి కూడా వద్దనుకుని రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేశారు. 

Also Read: CM Jagan: 'మేనిఫెస్టో కాపీలు చూపించే దమ్ము చంద్రబాబుకు ఉందా?' - ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే అభివృద్ధి అన్న సీఎం జగన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Embed widget