CM Jagan: 'మేనిఫెస్టో కాపీలు చూపించే దమ్ము చంద్రబాబుకు ఉందా?' - ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే అభివృద్ధి అన్న సీఎం జగన్
Andhrapradesh News: వైసీపీ హయాంలో అన్ని వర్గాలకు మంచి జరిగిందని అది కొనసాగాలంటే ప్రభుత్వానికి అంతా మళ్లీ మద్దతు పలకాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. కావలి సభలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
CM Jagan Comments In Kavali Meeting: ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలని.. పేదల పక్షాన మీ బిడ్డ ఉంటే, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉన్నారని సీఎం జగన్ (Cm Jagan) అన్నారు. 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలిలో (Kavali) నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్నారని.. అలాంటి వ్యక్తికి, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు యుద్ధమని పేర్కొన్నారు. 'ఈ యుద్ధంలో మీ బిడ్డ ఎప్పుడూ పేదల పక్షమే. మోసగాళ్లంతా కుట్రలు చేస్తున్నారు. అందరి ప్రయోజనాలు రక్షించుకునేందుకు, మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు మీరంతా సిద్ధం కావాలి. పేదల భవిష్యత్ నిర్ణయించేది ఈ ఎన్నికలే.' అని జగన్ తెలిపారు.
పేదల పక్షాన మీ బిడ్డ జగన్ ఉన్నాడు..పెత్తందార్ల పక్షాన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఉన్నారు. మంచి చేసిన మీ బిడ్డకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా?
— YSR Congress Party (@YSRCParty) April 6, 2024
-సీఎం @ysjagan #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/mCN0bZeYs8
'ఆ ధైర్యం ఉందా.?'
అబద్ధాలు, వెన్నుపోట్లు, కుట్రలు అనే పాత్రలన్నీ కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ చంద్రబాబు
— YSR Congress Party (@YSRCParty) April 6, 2024
14 ఏళ్లు సీఎంగా పనిచేసి మేనిఫెస్టోలో ఫలానా హామీలు అమలు చేశా అని ఒక్కసారైనా చెప్పారా?
-సీఎం @ysjagan #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan#MosagaduBabu pic.twitter.com/wM4TIPuhpF
మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు మంచి చేసిన ఒక్క పథకం కూడా గుర్తు రాదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 'మేనిఫెస్టో కాపీలు చూపించే దమ్ము, ధైర్యం ఆయనకు లేవు. మేనిఫెస్టోలో 10 శాతం హామీలైనా అమలు చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా.?. ఎన్నికలొస్తే ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు ముందుకు వస్తారు. ఆయన అభివృద్ధి చేసి ఉంటే పొత్తు ఎందుకు.?. బెంజ్ కారు, బంగారం ఇస్తామంటూ చెప్తారు. నా ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేరు. ఐదేళ్లలో పేదలందరికీ మంచి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నాం. నాడు - నేడుతో స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి చూపించాం. ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని నేరుగా అందించాం. రూ.2.70 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు అందరికీ సంక్షేమం అందేలా చర్యలు చేపట్టాం. 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ ఆశీర్వదించాలని కోరుతున్నా. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే. ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కొనసాగుతుంది. సూపర్ సిక్స్ అంటూ వస్తోన్న చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మొద్దు.' అని జగన్ పిలుపునిచ్చారు.
గ్రామాల్లో స్కూళ్ల రూపురేఖలు మార్చాం.. ఇంటింటికీ పౌరసేవలు అందిస్తున్నాం.
— YSR Congress Party (@YSRCParty) April 6, 2024
మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా..
-సీఎం @ysjagan #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/jl83ka54EK
మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా.. మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం సిద్ధం అంటూ లక్షల సింహాలు గర్జిస్తున్నాయి
— YSR Congress Party (@YSRCParty) April 6, 2024
-సీఎం @ysjagan #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan#TDPJSPBJPCollapse pic.twitter.com/gwhjL4siMZ
Also Read: YSRCP News : షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్ - సజ్జల తీవ్ర విమర్శలు