Kothapalli Subbarayudu : చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ! కారణం ఏమిటంటే ?
వైఎస్ఆర్‌సీపీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. ఎన్నికల్లో ప్రసాదరాజుకు మద్దతిచ్చి తప్పు చేశానన్నారు.
![Kothapalli Subbarayudu : చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ! కారణం ఏమిటంటే ? Kottapalli Subbarayu former minister slapped himself With a slipper Kothapalli Subbarayudu : చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ! కారణం ఏమిటంటే ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/02/25921b544edb72227b93321936cf6f9d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ( Kothapalli Subbarayudu ) తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. నర్సాపురం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు మద్దతిచ్చి గెలిపించి తప్పు చేశానని ప్రాయశ్చితంగా తన చెప్పుతో ( Slipper ) తాను కొట్టుకున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు ఇలా ఆవేశ పడటానికి కారణం జిల్లాల విభజన. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజిస్తున్న ఏపీ ప్రభుత్వం జిల్లా కేంద్రాల విషయంలో మాత్రం మార్పులు చేసింది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తున్న ప్రభుత్వం.. జిల్లా కేంద్రంగా మాత్రం భీమవరంను ప్రకటించింది. దీంతో రాజకీయంగా గగ్గోలు ప్రారంభమయింది.
నర్సాపురాన్నే జిల్లా ( Narsa puram ) కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎలా చూసినా నర్సాపురం జిల్లా కేంద్రమే కరెక్ట్ అన్న వాదన పలువురు వినిపిస్తున్నాయి. బ్రిటిష్, డచ్ హయాం నుంచి సబ్ డివిజన్‌గా ఉన్న నరసాపురం పట్టణాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ( Mudunoori Prasada Raju ) పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటే అలా అన్నట్లుగా ఉన్నారు. దీంతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జిల్లా కేంద్రం సాధన ఉద్యమాన్ని యాక్టివ్‌గా నడుపుతున్నారు.
ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ ( TDP ) , జనసేన ( Janasena ) నేతల్ని కూడా ఉద్యమం చేస్తున్నారు. అందర్నీ కలుపుకుని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అభ్యంతరాల పరిశీలన గడువు కూడా పూర్తవుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదు. దీంతో బుధవారం నర్సాపురంలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. సభ కూడా పెట్టారు. సభలో మాట్లాడుతూనే హఠాత్తుగా తన చెప్పును తీసుకుని కొట్టుకున్నారు.
కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురంలో బలమైన నేత. చంద్రబాబు మొదటి కేబినెట్‌లో కీలక మంత్రిగా పని చేశారు. కానీ తర్వాత పార్టీలు మారుతూ వస్తున్నారు. ఏ పార్టీలోనూ నిలకడగా ఉండలేదు. టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లారు.అక్కడ గెలవలేదు. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లారు. అక్కడ కూడా గెలవలేదు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీలోకి వచ్చారు. చంద్రబాబు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.అయితే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదని మళ్లీ వైసీపీలో చేరి వైసీపీ అభ్యర్థి ప్రసాదరాజుకు మద్దతు పలికారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)