అన్వేషించండి

Phone tapping case: కేసీఆర్ విచారణకు హాజరు అనుమానమే - న్యాయపోరాటం చేసే చాన్స్

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై కేసీఆర్ న్యాయపోరాటం చేసే అవకాశం కనిపిస్తోంది. తన రిప్లయ్‌లో ప్రస్తావించిన అనేక అంశాల ఆధారంగానే కోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన బీఆర్ఎస్ పెద్దలు చేస్తున్నారు.

KCR likely to fight legal battle: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు,  ప్రత్యేక విచారణ బృందం  మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు స్థలం   సమయం చుట్టూ తిరుగుతున్న ఒక పెద్ద న్యాయపరమైన పోరాటంగా మారింది. సిట్ అధికారులు ఫిబ్రవరి 1న విచారణకు హాజరుకావాలని గట్టిగా పట్టుబడుతుంటే, కేసీఆర్ మాత్రం తనదైన శైలిలో లా పాయింట్లను తెరపైకి తెచ్చి మున్సిపల్ ఎన్నికల తర్వాతే దీనిపై స్పందిస్తామనే సంకేతాలు ఇస్తున్నారు.   బీఆర్ఎస్ న్యాయనిపుణులు సిద్ధం చేస్తున్న వ్యూహాలు, కోర్టుకు వెళ్లే అవకాశాలపై మేథోమథనం జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. 

ఎర్రవెల్లికే రావాలంటున్న కేసీఆర్ 

సిట్ అధికారులు కేసీఆర్‌కు జూబ్లీహిల్స్‌లోని నందినగర్ నివాసంలో నోటీసులు అందజేయగా, ఆయన తన నివాసం  ఎర్రవెల్లి ఫాంహౌస్ అని స్పష్టం చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను వారి నివాసంలోనే విచారించాలి. అయితే, సిట్ అధికారులు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో నందినగర్ అడ్రస్ ఉందని, కాబట్టి అక్కడే విచారణకు రావాలని కోరుతున్నారు. చట్టప్రకారం ఒక వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రదేశాన్నే నివాసంగా పరిగణించాలని, ఫాంహౌస్ కూడా తన నివాసమేనని కేసీఆర్ వాదిస్తున్నారు. ఈ పాయింట్ మీద ఆయన కోర్టును ఆశ్రయించి  లొకేషన్ మార్పు కోసం స్టే కోరే అవకాశం ఉంది.

మున్సిపల్ ఎన్నికల తర్వాతే విచారణ ఉండాలంటున్న కేసీఆర్ 

మున్సిపల్ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 14 వరకు తనకు సమయం కావాలని కేసీఆర్ కోరారు. అయితే, సిట్ మాత్రం కేవలం ఒక్క రోజు వ్యవధి ఇచ్చి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. విచారణాధికారికి విచారణ జరిపే హక్కు ఉన్నప్పటికీ, సాక్ష్యం చెప్పే వ్యక్తికి ఉన్న వెసులుబాటును కాలరాయకూడదని బీఆర్ఎస్ న్యాయ నిపుణులు చెబుతున్నారు. అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందో సిట్ కోర్టుకు వివరించాల్సి ఉంటుందని వారు వాదిస్తున్నారు.

న్యాయపోరాటానికి కసరత్తు ?
 
సిట్ తీరును చూస్తుంటే ఇది కేవలం విచారణే కాదు, మున్సిపల్ ఎన్నికల ముందు పార్టీని దెబ్బతీసే రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందుకే, కేసీఆర్ నేరుగా విచారణకు వెళ్లకుండా, సిట్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లేదా విచారణ వాయిదా కోరుతూ  పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షులుగా పిలిచే వ్యక్తులకు వారి అనుకూలమైన సమయం, స్థలాన్ని ఎంచుకునే హక్కు కొంత మేరకు ఉంటుందని గతంలో కొన్ని తీర్పులు స్పష్టం చేసినందున ఈ పాయింట్‌తోనే కేసీఆర్ కోర్టును ఆశ్రయించవచ్చు. ఇదే అంశాన్ని సిట్ కు రాసిన రిప్లయ్‌లో కూడా కేసీఆర్ ప్రస్తావించారు. 

కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం

కేసీఆర్ ఇప్పటివరకు  ఈ నోటీసులపై  బహిరంగంగా స్పందించలేదు. కానీ, ఆయన తన లాయర్ల ద్వారా సిట్‌కు పంపిన ప్రత్యుత్తరంలో ప్రతి మాటను చాలా జాగ్రత్తగా తూచి తూచి ఉపయోగించారు. సిట్ కోరుతున్నట్లుగా నందినగర్ లో విచారణకు హాజరైతే, తదుపరి విచారణలన్నీ నగరంలోనే జరుగుతాయని, అదే ఎర్రవెల్లి అయితే ప్రశాంతంగా న్యాయ పోరాటం చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. సిట్ అధికారులు  ఆదివారం మధ్యాహ్నం నందినగర్ చేరుకునే లోపే కోర్టు నుంచి ఏవైనా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవాలన్న ప్రయత్నాల్లో బీఆర్ఎస్ న్యాయవిభాగం ఉంది.  ఫిబ్రవరి 1న కేసీఆర్ సిట్ ముందు నిలబడతారా? లేక కోర్టు మెట్లు ఎక్కి స్టే తెచ్చుకుంటారా? అన్నది  ఆసక్తికరంగా మారింది.   

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget