అన్వేషించండి

KCR Received Notices : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు మరోసారి నోటీసులు! ఆదివారం విచారణకు రావాలని సిట్‌ ఆదేశం

KCR Received Notices: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ఆదివారం విచారించేందుకు సిట్ సిద్ధమైంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది.

KCR Received Notices : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం అందుబాటులో ఉండాలని సూచించారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు.  విచారణకు నందినగర్‌ నివాసంలో అందుబాటులో ఉండాలని సిట్ ఆదేశించింది. ఆయన అభ్యర్థించినట్టుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ప్రశ్నించేందుకు నిరాకరించారు అధికారులు.

ఫామ్ హౌస్ విచారణకు సిట్ నో

కేసీఆర్ 65 ఏళ్లు పైబడిన వ్యక్తి కాబట్టి సీఆర్‌పీసీ సెక్షన్ 160  నిబంధనల ప్రకారం ఆయనను పోలీస్ స్టేషన్‌కు పిలవకుండా, ఆయన నివాసంలోనే విచారించాల్సి ఉంటుంది. అందుకే సిట్ అధికారులు ఆయనను హైదరాబాద్ పరిధిలోని  నందినగర్ నివాసాన్ని ఎంచుకోవాలని సూచించారు . హైదరాబాద్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న  ఎర్రవెల్లి ఫాంహౌస్‌ లో విచారించడానికి  నిరాకరించారు. దర్యాప్తు సౌలభ్యం కోసం ,  భద్రతా కారణాల దృష్ట్యా విచారణను హైదరాబాద్ నగర పరిధిలోనే  నిర్వహించాలని సిట్ నిర్ణయించింది. దీనిపై స్పందించిన కేసీఆర్ తరపు వర్గం, చట్టప్రకారం వ్యక్తి ఎక్కడ నివసిస్తే అక్కడికే వచ్చి విచారించాలని, ఫాంహౌస్ కూడా తన నివాసమేనని వాదిస్తోంది. 
 
మున్సిపల్ ఎన్నికల వరకూ ఆగేది లేదు!

మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రశ్నించాలని కేసీఆర్ విజ్ఞప్తిని నిరాకరించింది. ఒక్క రోజు వ్యవధిలోనే విచారణ చేయాలని ఆదివారాన్ని ముహుర్తంగా ఖరారు చేసింది. సిట్ అత్యవసరంగా నోటీసులు జారీ చేయడం వెనుక ప్రధానంగా దర్యాప్తులో జాప్యాన్ని నివారించాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది. ఫిబ్రవరి 14 వరకూ  మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుందని, అప్పటివరకు వేచి చూస్తే సాక్ష్యాధారాల సేకరణలో జాప్యం జరిగి కేసు దారి తప్పే ప్రమాదం ఉందని సిట్ భావిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుల నుంచి సేకరించిన కీలక సమాచారం ఆధారంగా విచారణను వేగంగా ముగించాలని అధికారులు నిర్ణయించారు. అందుకే కేసీఆర్ కోరినట్లుగా ఎన్నికలు ముగిసే వరకు కాకుండా, కేవలం ఒక్క రోజు వెసులుబాటు ఇచ్చి మరీ ఫిబ్రవరి 1నే విచారణకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు.  

తొలిసారిగా నేరుగా విచారణకు రంగం సిద్ధం

ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రారంభమైనప్పటి నుండి అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు జైలుకు వెళ్లారు. మరికొందరు కీలక సాక్షులుగా మారారు.  గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు,  న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ఉన్నతాధికారులు కేవలం కేసీఆర్ ఆదేశాలతోనే పనిచేశారా? లేదా ఈ డేటా వినియోగం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయి? అన్న కోణంలో సిట్ ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్టయిన అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసీఆర్‌కు నోటీసులు అందడంతో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులని, కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి నోటీసులు ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.                        

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget