అన్వేషించండి

Kalvakuntla Kavitha Attacks Pawan Kalyan: పవన్ కల్యాణే టార్గెట్‌గా కల్వకుంట్ల కవిత రాజకీయం! తెలంగాణలో ప్రభావం లేని జనసేనానిపై యుద్ధం వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Telangana Politics Sentiment: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ను అదే పనిగా టార్గెట్ చేస్తున్నరాు. కనీస బలం లేని జనసేనను టార్గెట్ చేస్తే కవితకు జరిగే లాభమేంటి?

Why Kavitha Targeting Pawan Kalyan:  తెలంగాణ రాజకీయ చిత్రపటంపై సరికొత్త వ్యూహాలు, సమీకరణాలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.  తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ ప్రాంతీయవాదాన్ని పవన్ అవమానించారంటూ ఆయనపై దేశద్రోహం కేసులు పెట్టాలనే డిమాండ్ల వరకు కవిత వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  
 
సెంటిమెంట్‌ను నమ్ముకున్న వ్యూహం! 

తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత ప్రస్తుతం తన రాజకీయ అస్తిత్వాన్ని, కొత్త పార్టీ ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిల్చడం ద్వారా ప్రజాదరణ పొందవచ్చని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పొరుగు రాష్ట్ర నేత అయిన పవన్ కల్యాణ్  హైదరాబాద్‌లో, ఢిల్లీ  లో   చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆమె తనకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నారు. తెలంగాణవాదులను, ప్రాంతీయ అస్తిత్వాన్ని పవన్ కించపరిచారనే భావనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా స్థానిక సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలనేది ఆమె అసలు స్కెచ్.

పవన్ ను విమర్శిస్తే సెంటిమెంట్ పెరుగుతుందా?

రాజకీయాల్లో ఒక పాపులర్ స్ట్రాటజీ ఉంది.. పెద్ద ఇమేజ్ ఉన్న నాయకుడిని లేదా సెలబ్రిటీని టార్గెట్ చేయడం ద్వారా చాలా తక్కువ సమయంలోనే వార్తల్లో నిలవవచ్చు. కవిత ప్రస్తుతం సరిగ్గా ఇదే ఫార్ములాను వాడుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఆమె ప్రధానంగా ఫైట్ చేయాల్సింది అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో లేదా తన పాత ఓటు బ్యాంక్ కలిగిన బీఆర్ఎస్‌తో. కానీ వారిని వదిలి, ఏపీలో తిరుగులేని పవర్‌తో దూసుకుపోతున్న పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం ద్వారా.. ఏమి సాధిస్తారన్నది ప్రశ్న. 

 తెలంగాణలో  జనసేన  బలం ఎంత? 

కవిత ఎంతగా విమర్శలు గుప్పిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు వాస్తవం ఏమిటంటే తెలంగాణలో జనసేన రాజకీయ ప్రభావం దాదాపు శూన్యం. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని కొన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సక్సెస్ తర్వాత హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన సరికొత్త ఆఫీసును ప్రారంభించినప్పటికీ, అది ఇంకా ఇక్కడ పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా ఎదగలేదు. అంతగా ప్రభావం లేని పార్టీ అధినేతను ఉద్దేశించి రోజూ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల, కవిత తన స్థాయిని తగ్గించుకోవడమే కాకుండా.. అనవసరంగా జనసేనకు ఇక్కడ మైలేజ్ ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

 సెంటిమెంట్ విఫల వ్యూహం.. జనం లైట్ తీసుకుంటున్నారా? 

పవన్ కల్యాణ్ ఏదో అన్నారని, దాని చుట్టూ దేశద్రోహం కేసుల వరకు వెళ్లడం క్షేత్రస్థాయిలో ప్రజలను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. తెలంగాణ సమాజం ప్రస్తుతం నిరుద్యోగం, రైతుల రుణమాఫీ, స్థానిక సమస్యలు, కాంగ్రెస్ పాలన వంటి అంశాలపై చర్చించుకుంటోంది. అంతే తప్ప ఏపీ నేత తెలంగాణ గురించి ఏం మాట్లాడారనే అంశంపై సామాన్యులకు పెద్దగా ఆసక్తి లేదు. ఫలితంగా కవిత చేస్తున్న ఈ విమర్శలు సోషల్ మీడియాలో ట్రోల్స్, కౌంటర్ అటాక్స్‌కు   పరిమితం అవుతున్నాయి తప్ప.. ఓటర్ల మధ్య ఒక సీరియస్ చర్చకు దారితీయడం లేదు.

 వ్యూహం మార్చుకోవాల్సిన సమయం! 

ఒక కొత్త ప్రాంతీయ పార్టీగా  తెలంగాణ రక్షణ సేన  ప్రజల్లోకి వెళ్లాలంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్  లేదా పొరుగు రాష్ట్ర నేతలపై విమర్శలు సరిపోవని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని గూడాలలో, పల్లెల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై లేదా స్థానిక సమస్యలపై పోరాడితేనే కవితకు మైలేజ్ వస్తుంది. లేదంటే పవన్‌ను టార్గెట్ చేసే ఈ వ్యూహం కేవలం డిబేట్లకే పరిమితమై, రాజకీయంగా ఆమెకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చకపోవచ్చు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
YSRCP Nellore Politics: నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
BRS YSRCP Silent on BJP Centre: జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
Advertisement

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
Embed widget