అన్వేషించండి

Kavitha Name Mistakes: కవిత బిగినర్స్ మిస్టేక్స్ - పేరులోనే తడబాటు.. అసలు వ్యూహం ఎక్కడ తప్పింది?

Telangana Rakshna Sena: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రస్థానం ఆరంభంలోనే అడుగులు తడబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సేన అని ఊదరగొట్టి, చివరకు తెలంగాణ రక్షణ సేన పేరుతో దరఖాస్తు చేయడం విమర్శలకు కారణం అవుతోంది

Kavitha new Party Mistakes: రాజకీయాల్లో ఒక కొత్త పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే స్పష్టమైన అజెండా, అంతకంటే స్పష్టమైన పేరు ఉండాలి. కానీ, కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ విషయంలో మొదటి అడుగులోనే అయోమయం నెలకొంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర సేన  పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆవిష్కరణ కార్యక్రమాలు, సోషల్ మీడియా హంగామా చేసిన కవిత టీమ్, ఇప్పుడు అధికారికంగా తెలంగాణ రక్షణ సేన  పేరును తెరపైకి తెచ్చింది. అసలు రాష్ట్ర సేన పేరు కోసం ఆమె దరఖాస్తు కూడా చేయలేదని వెల్లడికావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

 పేరు కోసం అడ్డదారి.. చివరకు తప్పని తిప్పలు

 పాత టీఆర్ఎస్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే  TRS అనే సంక్షిప్త నామం వచ్చేలా రాష్ట్ర సేన  పేరును కవిత ఎంచుకున్నారు. అయితే, బీఆర్ఎస్ నుండి వచ్చే తీవ్రమైన అభ్యంతరాలు, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆ పేరు దక్కదని ముందే గ్రహించి, సేఫ్ సైడ్‌గా రక్షణ సేన ను ప్రతిపాదించినట్లు కనిపిస్తోంది. కానీ, ప్రచారానికి ఒక పేరు, దరఖాస్తుకు మరో పేరు వాడటం ఆమె పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉంది.

  సోషల్ మీడియా హంగామా.. క్షేత్రస్థాయిలో కన్‌ఫ్యూజన్

పార్టీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా ఖాతాలను రాష్ట్ర సేన  పేరుతోనే ప్రారంభించి, లోగోలు, జెండాలు కూడా అదే పేరుతో ఆవిష్కరించారు. ఇప్పుడు తీరా ఈసీ నుండి  రక్షణ సేన  పేరుతో పబ్లిక్ నోటీసు వచ్చేసరికి, కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా కవిత టీమ్ చేయలేదు. ఈ స్థాయిలో తడబాటు ఉంటే ప్రజలు పార్టీని ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటారనే చర్చ మొదలైంది. రాజకీయం అంటే కేవలం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కాదని, ప్రతి అడుగులోనూ పారదర్శకత ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ఈసీ గుర్తింపు రాలేదు.. అప్పుడే సంబరాలా?

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కవిత పార్టీకి ఎన్నికల కమిషన్ ఇంకా అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. కేవలం పేరు నమోదు కోసం అప్లికేషన్ పెట్టుకుంటే, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈసీ నోటీసు ఇచ్చింది. ఇది ఒక ప్రాథమిక దశ మాత్రమే. కానీ, కవిత టీమ్ మాత్రం అప్పుడే ఈసీ ఆమోదం తెలిపేసిందని, తమదే అసలైన టీఆర్ఎస్ అని ప్రచారం చేసుకోవడం వారి అత్యుత్సాహానికి నిదర్శనం. అభ్యంతరాల స్వీకరణ తర్వాతే ఫైనల్ రిజిస్ట్రేషన్ జరుగుతుందనే కనీస అవగాహన లేకుండా ప్రకటనలు చేయడం ఆమెను రాజకీయంగా డిఫెన్స్‌లో పడేసింది.

 కవిత ఎందుకింత కంగారు పడుతున్నారు?

పార్టీ పేరు విషయంలో ఇంత భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు, కనీసం తన అనుచరులకు లేదా ప్రజలకు క్లారిటీ ఇవ్వకుండా కవిత ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నారనేది మిస్టరీగా మారింది. అబద్ధపు ప్రచారంతో సెంటిమెంట్‌ను రగిల్చవచ్చని భావిస్తే అది వికటించే అవకాశం ఉంది.  రాష్ట్ర సేన కాకపోయినా రక్షణ సేన అయినా టీఆర్ఎస్  వస్తుంది కదా  అనే  భావనలో ఉన్నారు.   ఏదైనా కొత్త వ్యవస్థను ప్రారంభించేటప్పుడు పునాదులు బలంగా ఉండాలి. కానీ, కవిత పార్టీ ప్రారంభం నుండే అస్థిరమైన ప్రకటనలు, పేరు మార్పులు, సాంకేతిక లోపాలతో సాగుతోంది. ఈ గందరగోళం ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రజల నుండి ఆశించిన మద్దతు లభించడం కష్టమే. రాజకీయాల్లో  బిగినర్స్ మిస్టేక్స్  సహజమే అయినా, పార్టీ పేరు వంటి అత్యంత ప్రాథమిక విషయంలోనే ఇన్ని తడబాట్లు రావడం కవిత రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
TDP Rebel Candidates: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
Vijayawada Mayor Election: బెజవాడ మేయర్ పోరు - వంగవీటి రాధా vs ఏబీవీ.. త్రిముఖ పోరులో సంచలనం సృష్టిస్తారా?
బెజవాడ మేయర్ పోరు - వంగవీటి రాధా vs ఏబీవీ.. త్రిముఖ పోరులో సంచలనం సృష్టిస్తారా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget