అన్వేషించండి

Kavitha TRS: కవిత పార్టీ ప్రారంభించిన మొదటి రోజే బీఆర్‌ఎస్‌కు షాక్! ఆ ఛాన్స్‌ లేకుండా పోయింది!

Kavitha TRS: కొత్త పార్టీతో వచ్చిన కవిత బీఆర్‌ఎస్‌కు కోలుకోలేని దెబ్బ తీసింది. పార్టీ మార్పుపై చర్చకు తావులేకుండా చేశారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్‌, తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు.
  • కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పాలన, బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
  • బీఆర్‌ఎస్‌‌ను టీఆర్‌ఎస్‌గా మార్చే అవకాశాన్ని కవిత పార్టీతో తొలగించారు.
  • టీఆర్‌ఎస్‌ పేరుతో కవిత పార్టీ పెట్టడం బీఆర్‌ఎస్‌కు షాక్‌గా మారింది.

Kavitha TRS: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును టీఆర్‌ఎస్‌గా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రజల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ ప్రకటించిన సందర్భంగా కేసీఆర్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బానిస సంకెళ్లు పాతాయని అనుకుంటే వ్యక్తిగత స్వేచ్చ పోయిందని దుమ్మెత్తి పోశారు. విమర్శలు పక్కన పెడితే వస్తూ వస్తూనే బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చారు. ఇకపై టీఆర్‌ఎస్‌గా మార్చుకునే వీలు లేకుండా చేశారు. 

2023 ఎన్నిలక ముందు దేశ రాజకీయాల్లో అడుగు పెట్టాలని టీఆర్‌ఎస్ పేరును కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చేశారు కేసీఆర్. అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి బీజేపీతో యుద్ధం చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే అదే పేరుతో ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. దీంతో చాలా మంది విమర్శలు చేశారు. తెలంగాణతో ఉన్న సెంటిమెంట్‌ పోయిందని ఇది కూడా ఓటమికి ఒక కారణంగా విశ్లేషించారు. 

పార్టీ పేరు మార్చాలని కేసీఆర్‌పై ఒత్తిడి

ప్రజల్లోకి మరోసారి టీఆర్‌ఎస్ పేరుతో వెళ్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని నేతలు భావించారు. ఇదే విషయం చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ఈ మధ్య  కాలంలో బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గా మార్చే డిమాండ్ గురించి ఆలోచిస్తున్నామని కేటీఆర్ అన్నారు. దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ వద్ద చర్చించాల్సి ఉంటుందని కూడా అన్నారు. 

Also Read: కవిత పార్టీ ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ - సెంటిమెంట్లు లేని రాజకీయాలే - కేటీఆర్ తట్టుకోగలరా?

ఇంతలోనే టీఆర్‌ఎస్ పేరుతో సిక్సర్ కొట్టిన కవిత

కేటీఆర్ ఇంకా చర్చల దశలోనే ఉండగానే కవిత సిక్సర్ కొట్టారు. వారికి ఉన్న ఆప్షన్‌ను ఎత్తుకుపోయారు. టీఆర్‌ఎస్ అనే పేరుతో ప్రత్యేకంగా పార్టీ పెట్టారు. ఆ టీఆర్‌ఎస్‌, ఈ టీఆర్‌ఎస్ వేరు అయినప్పటికీ ఇకపై అలాంటి పేరుతో పార్టీ రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ప్రారంభించిన మొదటి రోజే బీఆర్‌ఎస్‌కు ఇది షాకింగ్ విషయమని అంటున్నారు. 

ఇక చర్చకు తావు లేకుండా చేసిన కవిత

ఒక వేళ ఒరిజినల్ తమదే అని టీఆర్‌ఎస్‌గా మార్చినా కవితకు, ఇతరుల నుంచి వచ్చే విమర్శలకు భయపడి కేసీఆర్ తన పార్టీ పేరు మార్చారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అక్కడ కూడా కవిత పై చేయి సాధించినట్టు అవుతుంది. అందుకే ఇకపై బీఆర్ఎస్ మార్పు అంశంపై పార్టీలో చర్చలేకుండా చేయనున్నారని టాక్. ఇప్పటికే చాలా సార్లు కేసీఆర్ పార్టీ పేరు మార్పు ఉండబోదని ప్రకటించారు. అయినా సమయం వచ్చినప్పుడల్లా కచ్చితంగా ఈ విషయం ప్రస్తావనకు వస్తూ ఉంది. ఇప్పుడు టీఆర్‌ఎస్ పేరుతో కవిత పార్టీ పెట్టినందున బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆ విషయం జోలికి వెళ్లకపోవచ్చు. 

Also Read: టీఆర్‌ఎస్‌ పేరుతోనే వస్తున్న కవిత! తెలంగా రాష్ట్ర సేన వివరాలు వెల్లడి

అప్పుడే హింట్ ఇచ్చిన కవిత

చాలా రోజు క్రితమే టీఆర్‌ఎస్ పేరుతో వస్తున్నానని హింట్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం టీఆర్‌ఎస్ ఓపెన్ ఆప్షన్‌లో ఉందని దాన్ని ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు. అప్పుడే ఆమె టీఆర్ఎస్ పేరుతో వస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఇదే విషయంపై బీఆర్‌ఎస్‌లో కూడా చర్చలు జరిగాయి. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ ప్రజలతో ఒక అటాచ్‌మెంట్ ఉందని, అదే పేరుతో కేసీఆర్ సొంతి ఇంటి నుంచే పార్టీ పెడితే ప్రమాదమని అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఇది కచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందని రాజకీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి దీనికి కౌంటర్‌గా కేసీఆరె ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారో అన్న ఆసక్తి అందరిలో ఉంది. 

Frequently Asked Questions

కవిత కొత్త పార్టీ పేరు ఏమిటి?

కవిత కొత్త పార్టీ పేరు టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సేన).

టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా ఎందుకు మార్చారు?

2023 ఎన్నికలకు ముందు దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చారు.

బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది?

కొంతమంది విశ్లేషకుల ప్రకారం, తెలంగాణ సెంటిమెంట్‌తో కూడిన టీఆర్‌ఎస్‌ పేరును వదులుకోవడం ఓటమికి ఒక కారణం.

కవిత పార్టీ పెట్టడం వల్ల బీఆర్‌ఎస్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

కవిత టీఆర్‌ఎస్‌ పేరుతో పార్టీ పెట్టడం వల్ల, బీఆర్‌ఎస్‌ ఇకపై ఆ పేరును మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది పార్టీలో చర్చలకు తావు లేకుండా చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
BJP New National Executive: నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget