అన్వేషించండి

Kavitha new party: కవిత పార్టీ ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ - సెంటిమెంట్లు లేని రాజకీయాలే - కేటీఆర్ తట్టుకోగలరా?

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరో రోజులో కొత్త పార్టీ వస్తోంది. బీఆర్ఎస్‌ను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది.

Kavitha Party first target BRS:  తెలంగాణ రాజకీయాల్లో మరికొన్ని గంటల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీని లాంఛనంగా ప్రకటించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రక్రియలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కవిత తన రాజకీయ లక్ష్యం విషయంలో  స్పష్టతతో ఉండటం. ఆమె వేస్తున్న ప్రతి అడుగు, ఎక్కుపెడుతున్న ప్రతి విమర్శ కేవలం ఒకే ఒక్క దిశగా సాగుతున్నాయి—అదే  బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 

స్పష్టమైన టార్గెట్..కాంగ్రెస్, బీజేపీ కాదు.. బీఆర్ఎస్సే!

సాధారణంగా కొత్త పార్టీలు అధికార పార్టీని విమర్శించడం ద్వారా ఉనికిని చాటుకుంటాయి. కానీ కవిత మాత్రం అధికార కాంగ్రెస్‌ను , దూకుడుగా ఉన్న బీజేపీని కాకుండా,  బీఆర్ఎస్ మీదనే ఎక్కువ దృష్టి సారించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు సిద్ధాంతపరంగా ఆమె వైపు వచ్చే అవకాశం లేదని, అలాగే బీజేపీ హిందూత్వ ఓటు బ్యాంకు తన దరి చేరదని ఆమెకు బాగా తెలుసు. అందుకే, గత పదేళ్లుగా బీఆర్ఎస్ వెన్నంటి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకును, ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న శ్రేణులను తన వైపు తిప్పుకోవడమే ఆమె  సింగిల్ పాయింట్ అజెండా గా కనిపిస్తోంది.

కారు స్పీడుకు బ్రేకులు వేసే వ్యూహం

బీఆర్ఎస్ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో కవిత ఎంట్రీ ఆ పార్టీకి పెనుగండంగా మారేలా ఉంది. బీఆర్ఎస్ వైఫల్యాలను, ముఖ్యంగా మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని ఆమె పదే పదే ప్రస్తావిస్తుండటం యాధృచ్ఛికం కాదు. రేపు జరగబోయే ఆవిర్భావ సభలో కూడా ఆమె ప్రసంగం బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకునే సాగే అవకాశం ఉంది. తండ్రి చాటు బిడ్డగా కాకుండా, తెలంగాణ ఆకాంక్షలను మోసే స్వతంత్ర గళంగా తనను తాను ఆవిష్కరించుకోవడం ద్వారా బీఆర్ఎస్ క్యాడర్‌లో చీలిక తీసుకురావడమే ఆమె అసలు ప్లాన్.

రాజకీయ ఉనికి కోసం పోరాటం

నేటి రాజకీయాల్లో కేవలం సెంటిమెంట్‌తోనే ఓట్లు పడవని గుర్తించిన కవిత, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలహీనపడిన చోట తన పట్టును పెంచుకోవాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెల్లాచెదురైతే, అది కాంగ్రెస్‌కో లేదా బీజేపీకో వెళ్లకుండా తన  కొత్త పార్టీ  ఒక షెల్టర్ లాగా ఉపయోగపడాలని ఆమె ఆశిస్తున్నారు. ఈ వ్యూహం గనుక పారితే, బీఆర్ఎస్ ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, బీఆర్ఎస్ పునాదుల మీదనే తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకోవాలని కవిత గట్టి నిర్ణయానికి వచ్చారు.

మొహమాటాలకు తావులేని సమరం

 రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవు.. కేవలం బాధ్యతలే ఉంటాయి  అనే సంకేతాన్ని కవిత ఇప్పటికే ఇచ్చారు. కేసీఆర్ అనుసరించిన కొన్ని విధానాలను ఆమె బహిరంగంగానే తప్పుపట్టడం ద్వారా, తాను బీఆర్ఎస్ బి-టీమ్  కాదనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిర్భావ సభ తర్వాత ఆమె చేపట్టబోయే కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లోనే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు. ఇది కచ్చితంగా గులాబీ దళానికి ఒక హెచ్చరిక లాంటిదే. కవిత రాజకీయ చదరంగంలో తొలి పావును అత్యంత తెలివిగా కదిపారు. ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీలను వదిలేసి, తన సొంత ఇంటి  ఓటు బ్యాంకుపైనే ఆమె యుద్ధం ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీస్తోంది. రేపటి సభలో ఆమె ప్రకటించబోయే పార్టీ పేరు, విధివిధానాలు బీఆర్ఎస్ భవిష్యత్తును ఏ మేరకు ప్రభావితం చేస్తాయోనన్న ఆందోళన ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కవిత  కొత్త ప్రయోగం' విజయవంతమైతే, తెలంగాణలో బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడం అత్యంత కష్టతరంగా మారవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
TDP Rebel Candidates: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
Vijayawada Mayor Election: బెజవాడ మేయర్ పోరు - వంగవీటి రాధా vs ఏబీవీ.. త్రిముఖ పోరులో సంచలనం సృష్టిస్తారా?
బెజవాడ మేయర్ పోరు - వంగవీటి రాధా vs ఏబీవీ.. త్రిముఖ పోరులో సంచలనం సృష్టిస్తారా?
AP El Nino Drought Ground Reality: ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Ram Charan : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
Harish Rao On Mallanna Sagar: మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
Traffic E-Challans: ఈ-చలాన్లతో ఇబ్బంది పడుతున్నారా? నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.. ఇలా చేయండి
ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? లోక్‌ అదాలత్‌ ద్వారా జరిమానా తగ్గించుకునే ఛాన్స్‌!
AP El Nino Drought Ground Reality: ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
Embed widget