అన్వేషించండి

Crop fire in Nirmal district: కన్నబిడ్డల్లా సాకిన పంటను కళ్లముందే కబళించిన అగ్ని - కన్నీరు పెట్టిస్తున్న నిర్మల్ జిల్లాలో అన్నదాతల ఆక్రందన!

Harvested crops: నిర్మల్ జిల్లాలో చేతికొచ్చిన పంట కాలిపోయింది. దీంతో ఆ రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Harvested crops burnt in Nirmal district: ఆ రైతుల పాలిట ఆ మొక్కజొన్న కంకులు కేవలం పంట కాదు.. ఆరు నెలలుగా రక్తాన్ని చెమటగా మార్చి పోషించిన కన్నబిడ్డలు. నిన్న మొన్నటి వరకు పచ్చగా కళకళలాడుతూ, గాలికి ఊగుతూ పలకరించిన ఆ పంటను చూసి..  ఈసారికి నా కష్టాలు తీరుతాయి, నా పిల్లల అవసరాలు గట్టెక్కుతాయి  అని ఆ రైతులు మురిసిపోయారు. కానీ, విధి ఎంత బలీయమైనదంటే.. సరిగ్గా ఆ బిడ్డలు ఇంటికి వచ్చే సమయానికి కసాయి అగ్ని రూపంలో వచ్చి కళ్లముందే కబళించేసింది. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగిన ఈ దారుణం చూస్తుంటే రాయి లాంటి గుండె కూడా ద్రవించక మానదు.

 చేతికొచ్చిన  పంట బుగ్గి 

గోసుకుల రాములు, కన్నె మల్లేష్ అనే ఇద్దరు రైతులు తమకున్న  10 ఎకరాల  పొలాన్ని నమ్ముకున్నారు. విత్తనం వేసిన నాటి నుండి మొలకలొచ్చి, పైరు ఎదిగి, కంకి వేసే వరకు.. ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అప్పులు తెచ్చి ఎరువులు వేశారు, ఎండలో ఎండిన పైరుకు తలదాచుకునే నీడనిచ్చారు. కానీ, మంగళవారం మధ్యాహ్నం ఆకాశం నుండి రాలిన నిప్పురవ్వలు ఆ పచ్చని పొలంలో చిచ్చు పెట్టాయి. ఆకలితో ఉన్న అగ్నికీలలు ఊపిరి సలపనివ్వకుండా ఆ మొక్కజొన్నను చుట్టేశాయి. 

 పొలమంతా ప్రతిధ్వనించిన రైతన్న రోదన

మంటలు ఎగసిపడుతుంటే ఆ రైతులు పడ్డ తపన చూసి ఆకాశం కూడా కన్నీరు పెట్టేలా ఉంది. పంటను కాపాడుకోలేకపోతున్నామనే బాధతో అని పొలంలో దొర్లుతూ ఆ రైతులు పెట్టిన కేకలు గాలిలో కలిసిపోయాయి. సుమారు 12 లక్షల రూపాయల పెట్టుబడి, శ్రమ అంతా గంటల వ్యవధిలోనే నల్లటి బూడిదగా మారింది. పచ్చని కంకులు రత్నాలలా మెరుస్తాయనుకుంటే.. ఇప్పుడు అక్కడ నిలబడి చూస్తే కేవలం నల్లటి మాడిన అవశేషాలే కనిపిస్తున్నాయి. అప్పులు ఇచ్చిన వాళ్లకు ఏం చెప్పాలి? పస్తులున్న ఇంటికి ఏ మొహం పెట్టుకొని వెళ్లాలి? అని వారు విలపిస్తున్న తీరు గుండెలను పిండేస్తోంది.

  నిర్లక్ష్యపు తీగలకు అన్నదాత బలి కావాలా?

పంట చేల మీదుగా వేలాడుతున్న విద్యుత్ తీగలే ఈ విలయానికి కారణమని బాధితులు గుండెలు బాదుకుంటున్నారు. తమకు రాబోయే ప్రమాదం గురించి తెలిసినా, అది తమ బతుకుల్ని ఇలా బూడిద చేస్తుందని ఊహించలేదు. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పేలోపే ఆ రైతుల ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇప్పుడు అక్కడ మిగిలింది ఆ రైతుల కన్నీరు.. వారి గుండెల్లో ఆరని వేదన మాత్రమే.

 ఆదుకోండి.. లేదంటే ఆత్మహత్యే గతి!

అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డ రాములు, మల్లేష్‌లను ప్రభుత్వం ఇప్పటికైనా కన్నబిడ్డల్లా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.  కేవలం కాగితాల మీద లెక్కలు చూడకుండా, ఆ రైతుల కన్నీళ్లను చూసి తక్షణమే ఆర్థిక సాయం అందించాలి.   తెచ్చిన అప్పుల భారం నుండి వారిని కాపాడి, మళ్లీ నాగలి పట్టే ధైర్యాన్ని నింపాలని కోరుతున్నారు.                   

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
Nirmal Udumpur Tribals Non Cooperation Movement : నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Raw Onions Side Effects : పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
Embed widget