అన్వేషించండి

Kavitha Politics: ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్

ఓసారి మాతో పెట్టుకుంటే తెలంగాణ సాధించుకున్నాం, మళ్లీ జోక్యం చేసుకుంటే పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఏపీకి పార్సిల్ చేస్తామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ జోక్యం చేసుకుంటే ఏపీ నేతల పళ్లు రాలగొడతాం: కవిత
  • ఆంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణలో చక్రం తిప్పడానికి వీల్లేదు
  • ఏపీ పాలకుల ఏజెంట్ సీఎం రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు
  • అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చకుంటే ఉద్యమంగా మారుతుంది

హైదరాబాద్: పాలిటికల్ అవసరాల కోసం తెలంగాణ మీద పడి ఏడవటం సరికాదని, మేం రాజకీయ పరిణతి చెందిన వ్యక్తులమని.. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్లం కాదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ విషయాల్లో జోక్యం చేసుకుంటే పళ్లు రాలగొడతాం అని ఏపీ నేతలను హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు- సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విస్తరిస్తామన్న నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఆకాంక్షలపై కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ పాలకుల ఏజెంట్ తెలంగాణ సీఎంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ ఇష్టం వచ్చినట్లుగా విగ్రహాలు పెడుతున్నారని.. మేం అధికారంలోకి వచ్చాక బిడ్డా.. ఈ విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రాకు పార్సిల్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తనకు ఓపిక చాలా తక్కువ అని, పాత నాయకుల తీరుగా ఉండనని, తనకు అంత విశాల హృదయం లేదన్నారు. ఏపీ నుంచి రావొచ్చు పోవచ్చు. సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చు. రావొచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు పోవచ్చు అన్నారు.  వ్యాపారవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తాం. స్విట్జర్లాండ్, యూకే, జపాన్ వాళ్ల కాళ్లు పట్టుకుని ఇక్కడికి రండి భూములిస్తాం అంటున్నారు.  ఆంధ్రలో శేఖర్ రెడ్డి శ్రీ సిటీ కట్టారు. 30 దేశాల నుంచి వచ్చి చాలా కంపెనీలు పెట్టారు. వ్యాపారం చేసుకుంటే మాకు ఎలాంటి సమస్య లేదు. ఆంధ్ర రాజకీయ నాయకులు మళ్లొచ్చి చక్రం తిప్పుతాం అంటూ చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

Also Read: Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు

‘పవన్ కళ్యాణ్ మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ మాట అన్నారు. తరువాత పాశం యాదగిరన్న ఓ మాట మాట్లాడారు. ఇక్కడ ఏపీ పాలకుల ఏజెంట్ సీఎం కనుక మా ఇంటికి పోలీసులు వస్తున్నారు. ఇలా చేస్తే చూస్తూ ఊరుకేనేది లేది. మాకు అన్ని హక్కులు ఉన్నాయి. రాజకీయంగా దమ్ముంటే ఎదుర్కోండి. అక్కడ రాజధాని కట్టడానికి చేత కాలేదు కాదు. కానీ ఇక్కడ తెలంగాణను నవ నిర్మాణం చేస్తారా.. మా పనులు మేం చేసుకుంటాం. మా నిర్మాణం మేం చేసుకుంటాం. విడిపోయింది రాష్ట్రమే కానీ ప్రజలు కాదు. ప్రజల మధ్య చిచ్చుపెడితే మాట్లాడే వాళ్లు లేరనుకున్నారా.. ఈ జెండా రాకముందే లెక్క వేరు. ఇప్పుడు లెక్క వేరు. ఇప్పుడు టీఆర్ఎస్ 2.o ఇక్కడ. ఇదివరకు మాతో పెట్టుకుంటే రాష్ట్రం సాధించుకున్నాం. ఈసారి మాతో పెట్టుకుంటే మూతిపళ్లు రాలిపడతాయి. కాబట్టి మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడటం, మా మేధావులను టచ్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. లేనిపోని సాంస్కృతిక పెత్తనం చేయాలని చూస్తే సహించేది లేదు. మా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయం తరువాత చూసుకోండి. ముందు మీరు రాజధాని కట్టుకోండి. ఇక్కడ సెటిలైన ఆంధ్రవాళ్లు మా వాళ్లు. మాతో కలిసి ఉన్నారు. వాళ్లను కడుపున పెట్టుకుని చూసుకుంటాం. తెలంగాణ వాళ్లు ఎవ్వరిని ఇబ్బంది పెట్టే రకం కాదు. మా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాం, మీ సెక్రటేరియట్లో వేలు పెడతాం. మీ నీళ్లు దోచుకుంటాం అంటే కుదరదు. మా అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ప్రవర్తిస్తే ఊరుకోం. ఏపీ పాలకుల ఏజెంట్ అయిన సీఎం ఆ పని చేసినా సహించేది లేదన్నారు’ కవిత.

తెలంగాణ రాజకీయాలు తరువాత.. ముందు ఏపీలో రాజధాని కట్టుకోండి..

రెండున్నరేళ్లు అయింది. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేశాం. కమిటీలు వేసింది చాలు. కేకేలు పీకేలు మాకొద్దు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చాలి. వారి కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు హామీలు నెరవేర్చాలి. ఎవరిని చూసి ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారో వాళ్లు బాధ్యతగా ఇవి నెరవేర్చకపోతే ఉద్యమంగా మారుతుందన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే ప్రోగ్రాం వాయిదా వేసుకుని, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం కోసం పోరాడదాం. గోదావరి, కావేరి లింక్ ప్రాజెక్టు పోలవరం నుంచి పోతుందంటే ఒప్పుకుని సంతకం పెట్టి నీటి హక్కులు పోగొడుతున్నారని, ఇది సరికాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. రాష్ట్రం తెచ్చుకున్న వాళ్లం, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎలా నిలదీసి పోరాటం ద్వారా సాధించుకోవాలి, ఏపీ ప్రభుత్వం కుట్రలను ఎలా ఛేదించుకోవాలో ఈ సందర్భంగా చర్చించుకుంటామన్నారు. రౌండ్ టేబుల్ తరువాత తీర్మానాలు చేసుకుంటామని పేర్కొన్నారు.         

Frequently Asked Questions

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆంధ్ర నాయకులను ఎందుకు హెచ్చరించారు?

తెలంగాణ విషయాల్లో ఆంధ్ర నాయకులు జోక్యం చేసుకుంటే సహించేది లేదని, వారి పళ్లు రాలగొడతామని కవిత హెచ్చరించారు.

తెలంగాణలో విగ్రహాల ఏర్పాటుపై కవిత ఏమన్నారు?

రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ విగ్రహాలు పెడుతున్నారని, అధికారంలోకి వచ్చాక వాటిని పగలగొట్టి ఆంధ్రాకు పార్సిల్ చేస్తామని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

వ్యాపారవేత్తల విషయంలో కవిత వైఖరి ఏమిటి?

వ్యాపారవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తామని, స్విట్జర్లాండ్, యూకే, జపాన్ వంటి దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని కవిత తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో కవిత ఏమని డిమాండ్ చేశారు?

ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు హామీలు నెరవేర్చాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎంకు కవిత ఎలాంటి సూచన చేశారు?

పోలవరం నుంచి గోదావరి, కావేరి లింక్ ప్రాజెక్టు పోతుందంటే ఒప్పుకుని నీటి హక్కులు పోగొట్టుకోవద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కవిత సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Embed widget