అన్వేషించండి

Revanth Reddy Sentiment Politics: తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు - భాగమవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - రేవంత్ ప్లానేంటి?

Telangana Sentiment Politics: తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోబోతున్నారు?

Telangana Sentiment Politics Revanth Strategy :   తెలంగాణ రాజకీయాల్లో మరోసారి  ప్రాంతీయ సెంటిమెంట్ తెరపైకి వస్తోంది. పదేళ్ల రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పుడిప్పుడే పరిపాలన, అభివృద్ధి అంశాలపై చర్చ జరుగుతుందనుకుంటున్న తరుణంలో, మళ్ళీ ఆంధ్ర-తెలంగాణ భావోద్వేగాలను రగిల్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.  

 తెలంగాణలో మళ్ళీ  సెంటిమెంట్  రాజకీయం 

తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్న సెంటిమెంట్ రాజకీయాల వెనుక ప్రధానంగా బీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగాలు క్రియాశీలకంగా కనిపిస్తున్నాయి. గతంలో కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలను తెరపైకి తెచ్చి ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే, ఇప్పుడు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  టార్గెట్ గా జరుగుతున్న రాజకీయం, పవన్ కూడా తెలంగాణపై దృష్టి సారించడం, జూన్ 2న నిర్వహించబోయే సమావేశం వంటి పరిణామాలను ఆయుధంగా చేసుకుని తెలంగాణ ఆత్మగౌరవం  పేరుతో కొత్త ఉద్యమాన్ని లేవనెత్తాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. తద్వారా కోల్పోయిన రాజకీయ ఉనికిని మళ్ళీ చాటుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహం.

కాంగ్రెస్ లోనూ కనిపిస్తున్న రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ సెంటిమెంట్ వేడి కనిపిస్తోంది. అనిరుధ్ రెడ్డి, మందుల సామ్యూల్ వంటి నేతలు ఏపీ నేతలను టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వీరు కూడా ప్రాంతీయ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రాంతీయ సెంటిమెంట్ మళ్ళీ బలపడితే, ఆ సెంటిమెంట్‌కు పేటెంట్ హక్కు కలిగిన బీఆర్‌ఎస్‌కే అంతిమంగా లాభం చేకూరుతుందని రేవంత్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన భావోద్వేగాల కంటే బాధ్యతాయుతమైన పరిపాలనకే మొగ్గు చూపుతున్నారు.

సెంటిమెంట్ రాజకీయాలకు రేవంత్ దూరం

రేవంత్ రెడ్డికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌ను ఎన్నుకున్నది కేవలం సెంటిమెంట్ కోసం కాదు,  మార్పు , పరిపాలన  కోసం. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ ఉచ్చులో పడితే, కాంగ్రెస్ తన అభివృద్ధి అజెండాను పక్కన పెట్టాల్సి వస్తుంది. పైగా, ఏపీతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని ఆయన భావిస్తున్నారు. కానీ, తన సొంత పార్టీ నేతలు కొందరు కంట్రోల్ కాకుండా ఏపీపై విమర్శలు చేయడం ఆయనకు తలనొప్పిగా మారింది. రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి  డ్యూయల్ స్ట్రాటజీ  అమలు చేసే అవకాశం ఉంది. ఒకటి, పార్టీ నేతలకు కఠినమైన ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఏపీ నేతలపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవడం. రెండు, బీఆర్‌ఎస్ చేస్తున్న సెంటిమెంట్ ప్రచారాన్ని రాజకీయ డైవర్షన్ గా ప్రజల్లోకి తీసుకెళ్లడం. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులను ఇప్పుడు సెంటిమెంట్ పేరుతో కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని ఆయన వాదించనున్నారు.

పవన్ ను పావుగా వాడుతున్న రాజకీయం

పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా ఈ సమీకరణాల్లో కీలకం. పవన్‌ను టార్గెట్ చేయడం ద్వారా సెంటిమెంట్‌ను పెంచాలని బీఆర్‌ఎస్ చూస్తుంటే, రేవంత్ మాత్రం దాన్ని కేవలం ఒక పొరుగు రాష్ట్ర నేత పర్యటనగా మాత్రమే పరిగణించాలనే ధోరణిలో ఉన్నారు.  తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు అనేవి ఒక  డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటివి. రేవంత్ రెడ్డి ఈ సెంటిమెంట్ వేవ్ ను సమర్థవంతంగా అడ్డుకోగలిగితేనే కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. ఒకవేళ తన పార్టీ నేతలను కంట్రోల్ చేయడంలో విఫలమైతే, అది బీఆర్‌ఎస్‌కు ఆక్సిజన్ అందించినట్లు అవుతుంది.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Andhra Pradesh Law and Order Issue: మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Vizag Fishermen Missing: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Embed widget