అన్వేషించండి

Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు

Telangana Politics | 12 ఏళ్లు అయినా రాజధాని కట్టుకోలేకపోయారని, జగన్ MAVIGUN బాంబు పేల్చడంతో పొలిటికల్ మైలేజీ కోసం కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

BRS Politics | హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆంధ్రా పాలకుల ఏజెంట్ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ MAVIGUN బాంబు పేల్చారని.. రాజధానిపై పొలిటికల్ మైలేజీ రావడం లేదని కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. వానకాలం వస్తే చాలు ఏపీ రాజధాని మునిగిపోతుందని, సెక్రటేరియట్ లో సీఎం సీటు కింద నీళ్లు రాకుండా చూసుకోవాలని సెటైర్లు వేశారు. గత కొన్నేళ్లుగా తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రోళ్ల విగ్రహాలు పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దాని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఉద్యమ ఆకాంక్షలు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి ఏపీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందన్నారు. 12 ఏళ్లలో రాజధాని కూడా కట్టుకోలేకపోయారు ఏపీ పాలకులు అని విమర్శించారు. 

బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు - సాధన-రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘12 ఏళ్లు అయినా రాజధాని కూడా కట్టుకోలేకపోయారు. గతంలో కర్నూలులో గూడారాలలో రాజధాని ఉందని, ఈ ప్రాంతాన్ని కలుపుకుని హైదరాబాద్ ను రాజధాని చేసుకున్నారు. రాష్ట్రం విడిపోయాక రెండు ప్రభుత్వాలు పాలించినా రాజధాని కట్టుకోలేకపోయారు. దాంతో కేంద్రం జోక్యం లేకుండా రాష్ట్రం చూసుకోవాల్సిన రాజధాని అంశాన్ని కూటమి నేతలు పార్లమెంట్ కు తీసుకెళ్లారు. పార్లమెంట్ లో అమరావతి ఏపీ రాజధాని అని తీర్మానం చేసుకున్నారు. రాష్ట్రం విషయంలో కేంద్రం జోక్యం వద్దని వైసీపీ అధినేత జగన్ దాన్ని వ్యతిరేకించారు. 

జగన్ మావిగన్ బాంబుకు తట్టుకోలేక..
ఏపీ మాజీ సీఎం జగన్ మావిగన్ MAVIGUN అని రాజధాని ప్రతిపాదనతో బాంబు పేల్చారు. మచిలిపట్నం విజయవాడ గుంటూరులకు అన్యాయం జరుగుతుందని వీటిని అభివృద్ధి చేయాలని మావిగన్ అని బాంబు వేశారు. కేంద్రం వరకు వెళ్లి రాజధానిపై విజయం సాధిస్తే అమరావతి విషయంలో మైలేజీ రావడం లేదని, ఆంధ్ర ప్రజలను డైవర్షన్ చేయడానికి తెలంగాణ వాళ్ల మీద పడి ఏడవాలి. ఇందుకోసం సీఆర్డీఏలో జగనన్న చెప్పిన మావిగన్ ఏరియాను కలిపారు.  మహానాడు నిర్వహణలో పాల్గొన్న తెలంగాణ నేత నుంచే తెలంగాణ అనే పదమే లేదని చెప్పించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఈ మాటలు అంటాడా. భారత రాజ్యాంగంలో తెలంగాణ పదం ఉంది చూసుకోండి. ఆంధ్రోళ్ల డిక్షనరీలో ఈ పదం ఉంటే ఎంత. లేకపోతే ఎంత. అది మాకు అవసరం లేదు.

వానకాలం వస్తుంది.. సీఎం సీటు కింద నీళ్లు రాకుండా చూసుకోండి 
తెలంగాణలో విస్తరిస్తాం అని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అంటున్నారు. ఇప్పుడు వానకాలం వస్తుంది. ప్రతి వానకాలం మీ సెక్రటేరియట్‌లో మీ సీఎం సీటు కింద నీళ్లు రాకుండా చూసుకోండి. ప్రతి వానకాలంలో మీ రాజధాని మునిగిపోతుంది. ఏపీ ప్రజలకు ఇది ఎంత అవమానం. ఇప్పటికీ ఆపరేషన్ల కోసం ఆంధ్ర మంత్రులు హైదరాబాద్‌కు వస్తున్నారు. మీరంటే హెలికాఫ్టర్లు, కార్లలో వస్తారు. రాష్ట్ర ప్రజలకు హాస్పిటల్స్ కట్టరా. వసతులు కల్పించరా. అనంతపురం వాళ్లు బెంగళూరు పోతున్నారు. నెల్లూరు వాళ్లు చెన్నైకి పోవాలి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇదేనా ఏపీ ప్రజలకు మీరు అందిస్తున్న పాలన, కల్పించే సౌకర్యాలు అని’ కవిత ప్రశ్నించారు.

Frequently Asked Questions

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి కవిత ఏమన్నారు?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా పాలకుల ఏజెంట్ అని, రాజధానిపై పొలిటికల్ మైలేజీ కోసం కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు.

ఏపీ పాలకులు రాజధాని విషయంలో ఎందుకు విమర్శించబడ్డారు?

12 ఏళ్లలో ఏపీ పాలకులు రాజధానిని కూడా కట్టుకోలేకపోయారని, రాష్ట్రం విడిపోయాక కూడా రాజధాని కట్టుకోలేకపోయారని కవిత విమర్శించారు.

జగన్ 'మావిగన్' బాంబు అంటే ఏమిటి?

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులకు అన్యాయం జరుగుతుందని, వాటిని అభివృద్ధి చేయాలని జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' ప్రతిపాదనను కవిత 'మావిగన్ బాంబు' అని అభివర్ణించారు.

వానకాలంలో ఏపీ సచివాలయం గురించి కవిత ఏమన్నారు?

ప్రతి వానకాలంలో ఏపీ సచివాలయంలో సీఎం సీటు కింద నీళ్లు రాకుండా చూసుకోవాలని, ప్రతి వానకాలంలో వారి రాజధాని మునిగిపోతుందని కవిత సెటైర్లు వేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains in Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
Breaking News:ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
TG Inter Supply Results: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్స్
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్స్
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
King Maker CBN: పాతాళం నుంచి శిఖరాగ్రానికి - రెండేళ్లలోనే దేశ రాజకీయాన్ని శాసించే పవర్‌ఫుల్ లీడర్‌గా చంద్రబాబు ‘రైజ్’ !
పాతాళం నుంచి శిఖరాగ్రానికి - రెండేళ్లలోనే దేశ రాజకీయాన్ని శాసించే పవర్‌ఫుల్ లీడర్‌గా చంద్రబాబు ‘రైజ్’ !
Raghava Lawrence : మీరు ఎస్ అంటేనే... లేకుంటే... - పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్
మీరు ఎస్ అంటేనే... లేకుంటే... - పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
US Military Attack: పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Embed widget