అన్వేషించండి

Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని కవిత డిమాండ్ చేశారు. బీజేపీ .. పవన్ కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని కొన్ని ఓట్లు సాధించాలని అనుకుంటోందన్నారు.

Telangana Rakshana Sena Kavitha:    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని జన్వాడ ప్రాంతంలో ఉన్న కోడి చెరువు కబ్జా ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆమె పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.  పవన్ గతంలో చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ  భూముల్ని తిరిగి ఇవ్వాలన్నారు. 

పవన్ కల్యాణ్ తాను చెరువును ఆక్రమించలేదని, ఒకవేళ అది గనుక రుజువైతే వెంటనే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారిక రికార్డులను పరిశీలిస్తే అది స్పష్టంగా చెరువు శిఖం భూమి అని తేలిపోయింది  అని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కల్యాణ్ వెంటనే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, అక్కడ అక్రమంగా వేసిన కంటైనర్లు, మట్టిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. హైదరాబాద్‌లోని జన్వాడ సమీపంలో ఉన్న కోడి చెరువు స్థలాన్ని ఆక్రమించి పవన్ కల్యాణ్ ఫామ్‌హౌస్ నిర్మించారంటూ విపక్షాలు, పలు సామాజిక సంఘాలు గ్రౌండ్ రిపోర్టులతో సహా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టిగా ఖండించారు. తాను ఎలాంటి చెరువు స్థలాన్ని కబ్జా చేయలేదని స్పష్టం చేసిన ఆయన, నిబంధనల ప్రకారమే తన భూమి ఉందని  తన ఇంటి వద్ద పెట్టిన ప్రెస్మీట్‌లో వివరణ ఇచ్చారు.అదికబ్జా  అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తాన్నారు.   

  
తెలంగాణ ఎవరిదో ఒకరి తాతల, ముత్తాతల జాగీరు కాదు. ఇది బరాబర్ తెలంగాణ ప్రజల జాగీరు. 1,200 మంది అమరవీరుల త్యాగాలు, కోట్ల మంది కడుపు కట్టుకుని చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సిద్ధించిన గడ్డ ఇది అని కవిత స్పష్టం చేశారు. స్థానిక వనరులను, అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని శక్తులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేయవచ్చు కానీ, దానికి కనీస నైతికత ఉండాలని, గతంలో తెలంగాణ వనరులను దోచుకున్న వారే ఇప్పుడు మళ్లీ ఇక్కడి సెంటిమెంట్‌ను వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో గత మరియు ప్రస్తుత పాలనను పోలుస్తూ ‘కేటీఆర్’ అనే మూడక్షరాలపై కవిత ఆసక్తికరమైన పొలిటికల్ పంచ్ వేశారు. "నాడు, నేడు.. ఎప్పుడైనా కేటీఆర్ పాలనే నడుస్తోంది" అని వ్యాఖ్యానించారు. అయితే దీనికి ఆమె ఇచ్చిన వివరణ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నాడు 'కేటీఆర్' అంటే.. కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు అని, నేడు 'కేటీఆర్' అంటే.. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని ఆమె చెప్పుకొచ్చారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ముగ్గురు నేతలు రాత్రింబగళ్లు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేశారని కవిత గుర్తుచేశారు. కానీ నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, పాలనను పూర్తిగా కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టి నడిపిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్, బీజేపీలు కలిసి లోపాయికారీగా వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించారు.

బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయిలో సొంతంగా బలమైన నాయకత్వం లేదని, కేవలం కొన్ని ఓట్ల కోసం పరాయి శక్తులపై ఆధారపడుతోందని కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజం మరియు ఇక్కడి కళలను కేవలం తమ వ్యాపారాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారే తప్ప, ఈ ప్రాంతంపై ఎవరికీ నిజమైన ప్రేమ లేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ మరింత ఉధృతంగా పోరాడుతుందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తామని కవిత స్పష్టం చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget