అన్వేషించండి

GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?

AIMIM vs Congress MBT Alliance: గ్రేటర్ ఎన్నికల వేళ పాతబస్తీలో హైవోల్టేజ్ పాలిటిక్స్. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ - ఎంబీటీ కూటమి స్కెచ్. డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై యువత మార్పు కోరుకుంటోందా?

GHMC Old City Politics:   గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో భాగ్యనగర రాజకీయాలు, ముఖ్యంగా పాతబస్తీ  వేదికగా సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీకి తిరుగులేని కోటగా ఉన్న పాతబస్తీలో ఈసారి మునుపెన్నడూ లేని విధంగా ఒక ఆసక్తికరమైన పొలిటికల్ ఈక్వేషన్ తెరపైకి వచ్చింది. ఎంఐఎంను వారి సొంత గడ్డపైనే కట్టడి చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ, స్థానిక మజ్లిస్ బచావో తెహ్రీక్ తో చేతులు కలిపి ఉమ్మడి కూటమిగా బరిలోకి  దిగే ప్రయత్నాలు చేస్తోంది.  

 ఎంఐఎం గుత్తాధిపత్యానికి చెక్ 

చార్మినార్, బహదూర్‌పురా, యాకుత్‌పురా, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపల్ డివిజన్లు ఎప్పుడూ ఎంఐఎంకు ఏకపక్ష విజయాలను అందిస్తూ వచ్చాయి. అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి పాతబస్తీని నామమాత్రంగా వదిలేయడానికి సిద్ధంగా లేదు. ఎంఐఎం వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చకుండా, పాతబస్తీ గల్లీల్లో బలమైన క్యాడర్ ఉన్న ఎంబీటీ తో అధికారిక లేదా అనధికారిక అవగాహనకు  వచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.  బహదూర్‌పురా, యాకుత్‌పురా వంటి డివిజన్లలో ముస్లిం మైనారిటీ ఓటర్ల విభజనను నిరోధించి, ఉమ్మడి అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా ఎంఐఎంకు చమటలు పట్టించాలని కాంగ్రెస్ స్థానిక నాయకత్వం భావిస్తోంది.

 ఎంబీటీ నెట్‌వర్క్ – కాంగ్రెస్‌కు దొరికిన గ్రౌండ్ లెవెల్ వెపన్ 

పాతబస్తీలో ఎంఐఎంకు సైద్ధాంతికంగా, రాజకీయంగా గట్టి పోటీ ఇచ్చే ఏకైక స్థానిక శక్తి 'మజ్లిస్ బచావో తెహ్రీక్' . అమన్ నగర్, యాకుత్‌పురా, చంచల్‌గూడ వంటి పాకెట్స్‌లో ఎంబీటీకి ఇరవై ముప్పై ఏళ్లుగా చెక్కుచెదరని వాలంటీర్ నెట్‌వర్క్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి పాతబస్తీలో నాయకత్వం ఉన్నప్పటికీ, గల్లీ స్థాయి బూత్ మేనేజ్‌మెంట్ బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎంబీటీ నెట్‌వర్క్‌ను కాంగ్రెస్ తనతో కలుపుకోవడం ద్వారా, ఎంఐఎం కోటలోని లూప్‌హోల్స్‌ను సులభంగా టార్గెట్ చేయగలుగుతోంది. ముఖ్యంగా మైనారిటీలలోని మతపరమైన సెంటిమెంట్ల కంటే, స్థానిక సమస్యలపై ఎంబీటీ చేసే పోరాటాలు కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో మైలేజ్ ఇస్తున్నాయి.

 సెంటిమెంట్ వర్సెస్ సివిక్ ఇష్యూస్ 

ఈసారి పాతబస్తీ ఎన్నికల సరళిలో కనిపిస్తున్న అతిపెద్ద మార్పు.. అక్కడి యువత ఆలోచనా విధానం. దశాబ్దాలుగా కేవలం భావోద్వేగాలు, మతపరమైన సెంటిమెంట్ల ఆధారంగానే పాతబస్తీలో ఓటింగ్ జరుగుతూ వచ్చింది. కానీ, చదువుకున్న నేటి తరం యువత  మా గల్లీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తోంది. నిరంతరం పొంగిపొర్లే డ్రైనేజీలు, కలుషిత తాగునీటి సరఫరా, వర్షం వస్తే మునిగిపోయే రోడ్లు, ఉపాధి అవకాశాల లేమి వంటి మౌలిక సమస్యలపై యువతలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఐటీ కారిడార్ ఉన్న హైటెక్ సిటీ అభివృద్ధిని, తమ పాతబస్తీ వెనుకబాటుతనాన్ని పోల్చి చూసుకుంటున్న యువత.. ఈసారి మార్పు వైపు మొగ్గు చూపే సంకేతాలు గల్లీల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్వాన్, యాకుత్‌పురా నియోజకవర్గాల్లోని కొన్ని డివిజన్లలో దశాబ్దాలుగా డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు నోచుకోలేదు. తాగునీటి పైప్‌లైన్లు, మురుగునీటి లైన్లు కలిసిపోయి కలుషిత నీరు వస్తోందని స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పౌర సమస్యలనే కాంగ్రెస్-ఎంబీటీ కూటమి తమ ప్రధాన ఎన్నికల అస్త్రాలుగా మలచుకుంది.   అధికారంలో ఉన్నందున తాము గెలిస్తేనే పాతబస్తీ డెవలప్‌మెంట్‌కు నిధులు వస్తాయనే  డబుల్ ఇంజన్   కార్డ్‌ను కాంగ్రెస్ బలంగా వాడనుంది. 

 ఎంఐఎం రివర్స్ వ్యూహం 

ఈ ఉమ్మడి దాడిని ఎంఐఎం అధినాయకత్వం కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. అసంతృప్తిగా ఉన్న డివిజన్లలో సిట్టింగ్ కార్పొరేటర్లను మార్చడం, యువతకు కొత్తగా టికెట్లు కేటాయించడం ద్వారా యాంటీ-ఇంకంబెన్సీని తగ్గించుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ వ్యూహాలు రచిస్తున్నారు. తాము లేకపోతే పాతబస్తీలో ముస్లింల రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడుతుందనే పాత సెంటిమెంట్‌ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. అయితే, గతంలో లాగా కాకుండా ఈసారి ప్రతి గల్లీలోనూ కాంగ్రెస్-ఎంబీటీ కూటమి గట్టిగా ఎదురుతిరుగుతుండటంతో, ఎంఐఎం తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి మునుపటి కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.  కాంగ్రెస్ పార్టీ   అధికార బలం, ఎంబీటీ  లోకల్ క్యాడర్,  యువతలో ఉన్న సివిక్ అసంతృప్తి.. ఈ మూడు కలిస్తే ఎంఐఎం అజేయ శక్తేమీ కాదని నిరూపించే అవకాశం ఉంది. ఎంఐఎం తన కోటను కాపాడుకుంటుందా లేక కాంగ్రెస్-ఎంబీటీ కూటమి పాతబస్తీ గల్లీల్లో కొత్త చరిత్ర లిఖిస్తుందా అనేది రాబోయే రోజుల్లో జరిగే హైవోల్టేజ్ పోలింగ్ తేల్చనుంది. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా.. తీవ్ర పోరు ఖాయమని అనుకోవచ్చు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
BJP New National Executive: నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget