By: ABP Desam | Updated at : 09 Mar 2023 07:00 AM (IST)
లెఫ్ట్ పార్టీలు కూడా టీడీపీకి దగ్గరవుతున్నాయా ?
New Alliance In Andhra : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త పొత్తులకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించుకోవాలని లెఫ్ట్ పార్టీలు, టీడీపీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్‌సీపీని ఓడింటి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తెలుగుదేశం, వామపక్షాలు కలిసి పని చేయాలని నిర్ణయించకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పర సహకారంపై ఈ పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరింది. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు ఈ నెల 23న పోలింగ్ జరుగనుంది. ఇందులో టీడీపీ మూడు పట్టభద్ర స్థానాలకు బరిలోకి దిగింది. ఉపాధ్యాయ స్థానాలకు మాత్రం పోటీ చేయడం లేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు పీడీఎఫ్ కూటమిగా ఏర్పడి పట్టభద్ర, ఉపాధ్యాయ స్థానాలన్నింటిలోనూ పోటీ చేస్తున్నాయి.
ఓట్ల లెక్కింపు కీలకం - అందుకే పరస్పర సహకారం!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. సాదారణ ఎన్నికల్లోలా మెజార్టీ చూడరు. యాభై శాతం ఓట్లు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇందుకోసం భిన్నమైన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్య ఓట్లు ఉంటాయి. ఓటరు తనకు బాగా నచ్చిన వారికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి మిగిలిన వారికి రెండో ప్రాధాన్య ఓటు.. మూడో ప్రాధాన్య ఓటు వేయవచ్చు. ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్య ఓట్ల ద్వారా ఏ అభ్యర్థీ గెలవకపోతే రెండో ప్రాధాన్య ఓట్లు, ఆ తర్వాత మూడో ప్రాధాన్య ఓట్లు కూడా లెక్కిస్తారు. అన్నీ కలిపి ఎవరికి ఎక్కువ వస్తే వారు గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్య ఓట్లు చాలినన్ని ఎవరికీ రాకపోతేనే మిగిలిన రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. అందుకే రెండో ప్రాధాన్య ఓట్లు కూడా కీలకంగా మారాయి.
రెండో ప్రాధాన్య ఓట్ల కోసం పరస్పర సహకారం !
వైఎస్ఆర్‌సీపీపీ మొత్తం పట్టభద్ర, ఉపాధ్యాయ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడా గెలవకుండా చేసేందుకు పరస్పరం సహకరించుకోవడానికి టీడీపీ, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పట్టభద్ర స్థానాల్లో రెండో ప్రాధాన్య ఓట్లు పరస్పరం వేసుకుందామని, దీనికి బదులుగా ఉపాధ్యాయ స్థానాల్లో తమకు మద్దతివ్వాలని వామపక్షాలు టీడీపీని కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి టీడీపీ ప్రతినిధులు కూడా అంగీకరించినట్లుగా తెలు్సతోంది. పట్టభద్ర స్థానాల్లో వామపక్షాలు మొదటి ప్రాధాన్య ఓటును తమ వారికి వేసుకుని రెండో ప్రాధాన్య ఓటును టీడీపీకి వేస్తాయి. అలాగే టీడీపీ కూడా మొదటి ప్రాధాన్య ఓటును తనకు వేసుకుని రెండో ప్రాధాన్య ఓటును వామపక్షాల అభ్యర్థులకు వేస్తుంది. దీనికి బదులుగా ఉపాధ్యాయ స్థానాల్లో పీడీఎఫ్ అభ్యర్థులను టీడీపీ బలపరచాలని ఆ పార్టీలు కోరాయి. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా తమ మద్దతు టీడీపీ అభ్యర్థులకు ఉంటుందని.. ఏ క్షణమైనా ఈ అంశంపై రెండు పార్టీలు ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ పొత్తుల సహకారం సక్సెస్ అయితే సాధారణ ఎన్నికలకూ !
వామపక్ష పార్టీలు కొంత కాలంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్నాయి. అయితే ఎప్పుడూ పొత్తుల ప్రస్తావన రాలేదు. కలసి పని చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. స్థానిక ఎన్నికల్లోనూ ఎవరికి వారు పోటీ చేశారు. ఇప్పుడు వామపక్షాలు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసేందుకు సిద్ధం కావడంతో... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరి సహకారం.. కలిసి వస్తే.. తదుపరి సాధారణ ఎన్నికల్లో ఇలాంటి సహకారంపై చర్చించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. మహాకూటమి తరహాలో టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీల కూటమి ఏర్పడే అవకాశం ఉంటుంది.
YSRCP Fail : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పెక్కడ జరిగింది ? - ఎమ్మెల్సీ ఫలితంపై వైఎస్ఆర్సీపీలో అంతర్మథనం !
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
AP MLC Elections : ఒక్క ఓటుతో జాతకాల తారుమారు - ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ !
TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?
Somu Veerraju On Pawan: కొందరికి మోదీ నచ్చుతారు, బీజేపీ నచ్చదు: జనసేనానిపై సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు
Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి