అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  ECI | ABP NEWS)

BJP : అధికార వ్యతిరేకతకు అతీతం బీజేపీ - ఆ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ ఏం చేయాలి ?

Elections : హర్యానాలో భారతీయ జనతా పార్టీ విజయంతో అధికార వ్యతిరేకతతో ప్రజలే ఆ పార్టీని ఓడిస్తారని ఆశ పెట్టుకున్న కాంగ్రెస్‌కు నిరాశే ఎదురయిది. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ ఇంకేదో చేయాల్సి ఉంది.

Impossible for BJP to lose due to anti incumbency :  రాజకీయాల్లో  గెలుపోటములు రెండు రకాలు. గెలుపులు అధికారంలో ఉన్న పార్టీ పాలనలో చేసిన తప్పుల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెంచుకోవడమో, ఎంత కాలం వీళ్లుంటారు మరొకరికి ఓ చాన్స్ ఇద్దామని ఆలోచించడం వల్లనో అధికారం కోసం ఎదురు చూస్తున్న పార్టీలకు గెలుపులు వస్తాయి. ఓటములు కూడా రెండు రకాలుగా వస్తాయి. పాలనలో తాము చేసే తప్పిదాలతో పాటు విపక్ష పార్టీలు చేసే పోరాటాలు మరో కారణం. అయితే ప్రస్తుత రోజుల్లో విపక్షాలు పోరాటాలు చేయడం ఆపేశాయి. ప్రజలే త్వరగా అసంతృప్తికి గురవుతున్నారు కాబట్టి తానే ప్రత్యామ్నాయం గెలిపిస్తారని అనుకుంటున్నారు. కానీ బీజేపీ విషయంలో ఆ పప్పులేమీ ఉడకవని హర్యానా ఫలితాలతో తేలిపోయింది. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ అంతకు మించి పోరాటం చేయాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

బీజేపీపై కోపమే కానీ కాంగ్రెస్‌కు ఓటు వేయడం లేదు ! 

బీజేపీని ఓడించాలంటే ప్రజలకు విరక్తి వచ్చి తమను గెలిపిస్తారనుకుంటే కుదరదని కాంగ్రెస్ పార్టీకి హర్యానా ఎన్నికలు మరోసారి నిరూపించాయి. పదేళ్లుగా హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దాన్ని ఓట్లుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు శూన్యం. బీజేపీపై కోపంతో ప్రత్యామ్నాయంగా ఉన్న తమకే ఓట్లేస్తారని.. ఏడు గ్యారంటీలు ప్రకటించి ఎదురు చూస్తూ కూర్చున్నారు. కనీ ప్రజలు బీజేపీపై కోపం ఉంది కానీ..చూస్తూ చూస్తూ కాంగ్రెస్ కు ఓటు వేయలేకపోతున్నామని తేల్చి చెప్పారు. ఫలితంగా  చేతిలోకి వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. హర్యానా ఎన్నికల ఫలితం నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సి చాలా ఉందన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. 

బీజేపీ ఊస్టింగ్ ఖాయమని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ - కానీ ఫలితం రివర్స్ - హర్యానాలో ఏం జరిగింది ?

ఒక్క హర్యానా కాదు మధ్యప్రదేశ్ , గుజరాత్ సహా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి !

బీజేపీ అధికారంలో ఉండి.. కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడం కాంగ్రెస్ కు పెద్ద సమస్యగా మారింది. బీజేపీ అధికారంలో ఏళ్ల తరబడి ఉన్నా ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. తమను ప్రత్యామ్నాయంగా గుర్తించాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు పట్టించుకోవడం లేదు. గుజరాత్‌లో వరుసగా బీజేపీ గెలుస్తూనే ఉంది. ఎప్పుడూ కాంగ్రెస్ ను అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయగా చూడలేదు. మధ్యప్రదేశ్ లోనూ అదే పరిస్థితి అతి కష్టం మీద ఓ సారి బీజేపీ ఎలాగోలా అధికారంలోకి వచ్చినా నిలబెట్టకోలేకపోయింది. ఆ తర్వాత ఇంకా ఘోరంగా ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కూడా  బీజేపీ రెండో సారి గెలవకుండా నిలవరించలేకపోయారు. అధికార వ్యతిరేకతను నిలువరించలేకపోయారు. ఉత్తరాఖండ్ లోనూ అదే పరిస్థితి. అంటే.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధికార వ్యతిరేకత ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. 

నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ

కేంద్రంలోనూ మూడో సారి - ఇలాగే ఉంటే నాలుగోసారి కూడా !

రాష్ట్రాల్లోనే కాదు కేంద్ర ప్రభుత్వంపై కూడా అధికార వ్యతిరేకత ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓట్లుగా మల్చుకోలేకపయింది. మొదటి టర్మ్ లోనే బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగింది.కానీ ఫలితాలు అలా రాలేదు. రెండో టర్మ్ పూర్తయిన తర్వాత ప్రజావ్యతిరేకత బాగా ఉందని తెలిసి వచ్చింది కానీ.. అది కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు వరకూ రాలేదు. అంటే. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు మూడో సారి ప్రభుత్వం ఏర్పాటయింది. నాలుగోసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతతోనే తమపై ఓట్లు వేస్తారని అనుకుంటే మాత్రం .. నాలుగో సారి కూడా బీజేపీనే గెలుస్తుంది. రికార్డులు అవే చెబుతున్నాయి. కాంగ్రెస్ అంతకు మించి ఏదో చేయాల్సిన అవసరాన్ని మాత్రం రాజకీయ పరిస్థితులు ఎత్తి చూపుతున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP : ఐపీఎల్‌లో హిట్‌ అయిన ఫార్ములాతో విజయం సాధిస్తున్న బీజేపీ- హర్యానాలోనూ ఫలించిన వ్యూహం
ఐపీఎల్‌లో హిట్‌ అయిన ఫార్ములాతో విజయం సాధిస్తున్న బీజేపీ- హర్యానాలోనూ ఫలించిన వ్యూహం
Pawan Kalyan :  పల్లె పల్లెలో పవన్ ముద్ర కనిపించేలా పనులు - వ్యూహాత్మకంగా జనసేనాని ముందడుగు ?
పల్లె పల్లెలో పవన్ ముద్ర కనిపించేలా పనులు - వ్యూహాత్మకంగా జనసేనాని ముందడుగు ?
BRS Local Party :  బీఆర్ఎస్‌ను ప్రాంతీయ పార్టీగానే భావిస్తున్న కేటీఆర్ - కేసీఆర్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టేశారా ?
బీఆర్ఎస్‌ను ప్రాంతీయ పార్టీగానే భావిస్తున్న కేటీఆర్ - కేసీఆర్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టేశారా ?
Assembly Election Results 2024:హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ప్రమాణ స్వీకారం చేయబోయే సీఎంలు ఎవరు?
హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ప్రమాణ స్వీకారం చేయబోయే సీఎంలు ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vinesh Phogat Julana Election Result | ఎమ్మెల్యేగా నెగ్గిన మల్లయోధురాలు వినేశ్ ఫోగాట్ | ABP DesamTop Reasons For BJP Failure In J&K | జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది | ABP DesamAAP Huge Loss in Haryana Elections | కేజ్రీవాల్ కు హర్యానాలో ఊహించని దెబ్బ | ABP DesamISRO News: 8 ఏళ్ల క్రితం నింగిలోకి ఇస్రో రాకెట్ - ఇప్పుడు భూమ్మీద పడ్డ శకలాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP : ఐపీఎల్‌లో హిట్‌ అయిన ఫార్ములాతో విజయం సాధిస్తున్న బీజేపీ- హర్యానాలోనూ ఫలించిన వ్యూహం
ఐపీఎల్‌లో హిట్‌ అయిన ఫార్ములాతో విజయం సాధిస్తున్న బీజేపీ- హర్యానాలోనూ ఫలించిన వ్యూహం
Pawan Kalyan :  పల్లె పల్లెలో పవన్ ముద్ర కనిపించేలా పనులు - వ్యూహాత్మకంగా జనసేనాని ముందడుగు ?
పల్లె పల్లెలో పవన్ ముద్ర కనిపించేలా పనులు - వ్యూహాత్మకంగా జనసేనాని ముందడుగు ?
BRS Local Party :  బీఆర్ఎస్‌ను ప్రాంతీయ పార్టీగానే భావిస్తున్న కేటీఆర్ - కేసీఆర్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టేశారా ?
బీఆర్ఎస్‌ను ప్రాంతీయ పార్టీగానే భావిస్తున్న కేటీఆర్ - కేసీఆర్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టేశారా ?
Assembly Election Results 2024:హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ప్రమాణ స్వీకారం చేయబోయే సీఎంలు ఎవరు?
హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ప్రమాణ స్వీకారం చేయబోయే సీఎంలు ఎవరు?
BJP : అధికార వ్యతిరేకతకు అతీతం బీజేపీ - ఆ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ ఏం చేయాలి ?
అధికార వ్యతిరేకతకు అతీతం బీజేపీ - ఆ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ ఏం చేయాలి ?
Samantha: రానా నా బ్రదర్... కొండా సురేఖకు సమంత ఇన్ డైరెక్ట్ కౌంటర్?
రానా నా బ్రదర్... కొండా సురేఖకు సమంత ఇన్ డైరెక్ట్ కౌంటర్?
Daddojanam Temple Style Recipe  : సరస్వతీ దేవి రూపంలో అమ్మవారికి దద్దోజనంతో పాటు సమర్పించే నైవేద్యం ఇదే.. నవరాత్రుల్లో ఏడో రోజు ఇవి చేయాలట
సరస్వతీ దేవి రూపంలో అమ్మవారికి దద్దోజనంతో పాటు సమర్పించే నైవేద్యం ఇదే.. నవరాత్రుల్లో ఏడో రోజు ఇవి చేయాలట
Weather Latest Update: ఏపీ, తెలంగాణలో వర్షాలతో పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ - కొన్నిచోట్ల ఉక్కపోతతో పాట్లు
ఏపీ, తెలంగాణలో వర్షాలతో పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ - కొన్నిచోట్ల ఉక్కపోతతో పాట్లు
Embed widget