అన్వేషించండి

Jammu Kashmir Election 2024: నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ

Assembly Election Results 2024 : సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య ప్రజలు బీజేపీకి షాక్ ఇస్తే ఈదఫా జమ్ముకశ్మీర్ ప్రజల వంతు వచ్చింది. ఈ రెండు విషయాల్లో మాత్రం మోదీపై రాహుల్ గాంధీ పైచేయి సాధించారు.

Jammu And Kashmir Assembly Election Results 2024 : వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్న సామెత ఇప్పుడు బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో, ఇవాళ జమ్మూకశ్మీర్ ఎలక్షన్స్‌ ఫలితాలు చూస్తే ఇదే స్పష్టం అవుతుంది. 500 ఏళ్ల హిందువుల కల అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టినా, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా బీజేపీకి చేదు ఫలితం ఎదురైంది.

మొన్న రామ మందిరం షాక్

రామ మందిరాన్ని కట్టించి హిందువుల చిరకాల కోరికను నిజం చేసి చూపించారు ప్రధాని మోదీ. అవాంతరాలు, అడ్డంకులు..కోర్టు కేసులు..వివాదాలు అన్నీ ఒక్కొటిగా దాటుకుని భవ్యరామ మందిరం నిర్మాణం పూర్తి చేశారు. రాముడి ప్రతిష్ఠ జరిపారు. దేశమంతా హ్యాపీ అనుకున్నారు. ఇది చూసిన హిందువులు, బీజేపీ ఇంకా హ్యాపీ. రాముడికి ఇన్నాళ్లకు ఓ నీడ దొరికిందని సంతోష పడ్డారు. రామ మందిరం నిర్మాణం పూర్తి చేశామన్న ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికలకు దిగిన బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అయోధ్య అసెంబ్లీ ఉన్న ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గాన్ని ఇండీ కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. అంటే ఇన్నేళ్ల కలను తీర్చిన అయోధ్య ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్లు బీజేపీని తిరస్కరించారని అర్థం. ఇది ఊహించని షాక్ బీజేపికి అని చెప్పవచ్చు.

నేడు జమ్మూలో షాక్

తాజాగా రెండో షాక్ తగిలింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ను పూర్తిగా భారత్ చట్టాల పరిధిలోకి తీసుకువచ్చింది బీజేపీ ప్రభుత్వం. దీని కోసం ఎన్నో ఏళ్లుగా వ్యూహం పన్నింది. అస్సలు బీజేపీ ఐడియాలజీకి సరిపోని మెహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకుని గెలిచింది. తర్వాత మద్దతు ఉపసంహరించుకుని మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. రాజకీయ వ్యూహాలతో కశ్మీర్ లోని పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసి వేర్పాటువాద శక్తులు సైతం బిత్తరపోయేలా ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఫలితంగా కశ్మీర్ రాష్ట్రం హోదా కోల్పోయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్ము కశ్మీర్ , లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త ప్రయాణం మొదలు పెట్టాయి.  తర్వాత తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జనరల్ గా పాకిస్థాన్ కబంధ హస్తాల్లోనూ..వేర్పాటు వాద శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్న కశ్మీర్ ను పూర్తిగా మన చేతుల్లోకి తెచ్చుకునేలా..పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మాదే అని పార్లమెంటులో గర్జించిన అమిత్ షా కామెంట్స్ కు దేశభక్తి తో ఉప్పొంగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలి కదా. అందుకే ఈసారి పీడీపీతో కూడా పనిలేకుండా సింగిల్‌గా బరిలోకి దిగింది. కానీ ఈరోజు వచ్చిన రిజల్ట్ బీజేపీకి షాక్ ఇచ్చింది. అబ్దుల్లాల పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ తో జత కట్టిన కాంగ్రెస్ కశ్మీర్ లో హవా చూపించింది. 

రాహుల్ గాంధీ అప్పర్ హ్యాండ్

ఈక్వేషన్ సింపుల్. ఫైట్ ఏదైనా కానీ ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేదే చూస్తారు. మన దేశంలో జాతీయ స్థాయిలో రెండే ప్రధాన అధికార కేంద్రాలు. ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్. పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న మోదీ గద్దె దింపాలని ఈ కాంగ్రెస్ దేశంలోనే చాలా విపక్షాలు ఏకం చేసి ఇండీ కూటమిగా ఏర్పడ్డాయి. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ నడిచారు. శ్రీనగర్ లో మంచులో తడుస్తూ యాత్రను ముగించే ప్రసంగం చేశారు కూడా. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఊహించనంత పోటీ ఇచ్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి. సొంతంగా 99 ఎంపీ స్థానాలు గెలుచుకుని బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించటమే కాదు..పార్లమెంటులో బీజేపీ ఆటలు సాగే అవకాశం లేనంత పెద్దశక్తిగా నిలబడింది. 

కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే..బీజేపీ అనే పార్టీ ఏర్పాటుకు కొన్ని సిద్ధాంతాలు చాలా మూలం. వాటి సాధన కోసమే భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఇద్దరు ఎంపీలతో ప్రస్థానాన్ని ప్రారంభించి దేశంలో ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అలాంటి కీలక సిద్ధాంతాల్లో రెండైన అయోధ్య రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 లాంటి వి రద్దు చేసినా..ప్రధానంగా ఆ ప్రభావం కనిపించాల్సిన రెండు ప్రాంతాల్లోనూ బీజేపీ ఓటమి అనేది రాహుల్ గాంధీ విజయంగా..తనను తగ్గించుకునైనా సరే అక్కడ ఎవరిని పెట్టాలో వాళ్లని పెట్టి..ఎవరితో చేతులు కలపాలో వాళ్లతో చేతులు కలిపి మోదీ, అమిత్ షా లాంటి వాళ్లకే షాక్ ఇచ్చిన రాజకీయ వ్యూహంగా చూడాలా. లేదా రెండు ఏదో కాకతాళీయంగా ఓడిపోయింది బ్యాడ్ లక్ అనుకోవాలా..

Also Read: పడిలేచిన కెరటంలా బీజేపీ- హర్యానాలో హ్యాట్రిక్‌ దిశగా కమలం - అనూహ్యంగా పడిపోయిన కాంగ్రెస్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
Telangana Wineshops: తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
Sai Durgha Tej: అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
Bitcoin Price: బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Trump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP DesamUsha Chilukuri vs Kamala Harris |  Donald Trump విక్టరీతో US Elections లో తెలుగమ్మాయిదే విక్టరీ | ABP DesamUsha Vance Chilukuri on Donald Trump Win | US Elections 2024 లో ట్రంప్ గెలుపు వెనుక తెలుగమ్మాయిDonald Trump Won US Elections 2024 | అధికారం కోసం అణువణువూ శ్రమించిన ట్రంప్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
Telangana Wineshops: తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
Sai Durgha Tej: అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
Bitcoin Price: బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
Honda Activa: రూ.10 వేలు కట్టి యాక్టివా కొనేయచ్చు - నెలవారీ ఈఎంఐ ఎంత?
రూ.10 వేలు కట్టి యాక్టివా కొనేయచ్చు - నెలవారీ ఈఎంఐ ఎంత?
AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
US New President Donald Trump: మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
Vasamsetti Subhash: చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
Embed widget