అన్వేషించండి

Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?

bandi sanjay political future: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఆయన రాజకీయ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఒక బలమైన బీసీ నేత ఎదుగుదలకు ఇది ఆటంకమేనా?

Bandi Sanjay Political Career Impact: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఫైర్‌బ్రాండ్ నాయకుడు బండి సంజయ్ రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు ఒక ఊహించని సంక్షోభం ఎదురైంది. కింది స్థాయి నుంచి కౌన్సిలర్‌గా, ఎంపీగా, ఆపై కేంద్ర మంత్రిగా ఎదిగిన ఒక బలమైన బీసీ నేతకు తన కుమారుడి వ్యవహారశైలి ఇప్పుడు రాజకీయంగా పెద్ద తలనెప్పుగా మారింది.   రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగిన నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో బండి సంజయ్ కుమార్  ఒకరు. మున్సిపల్ కౌన్సిలర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి ఊపిరిపోసి, నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన ఆయన.. ఇప్పుడు   కుమారుడు  బండి భగీరథ్ చుట్టూ అల్లుకున్న వివాదంతో ఆత్మరక్షణలో పడ్డారు. తన కుమారుడిపై నమోదైన పోక్సో  కేసు ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికి ఒక పెద్ద రిమార్కుగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

 రాజకీయ వారసత్వం - వ్యక్తిగత నడవడిక 

సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లలు తండ్రి అధికారాన్ని చూసుకుని విర్రవీగుతున్నారనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. గతంలోనూ భగీరథ్ ఒక కాలేజీ విద్యార్థిపై దాడి చేసిన వీడియో వైరల్ అయినప్పుడు బండి సంజయ్ ఇబ్బంది పడ్డారు. తాజాగా ఒక మైనర్ బాలిక విషయంలో పోక్సో కేసు నమోదు కావడం, అది కూడా ఆయన కేంద్ర హోంశాఖలో  కీలక బాధ్యతల్లో ఉన్న సమయంలో జరగడం విపక్షాలకు బలమైన ఆయుధంగా మారింది. తండ్రి ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తూ ఎదిగితే, కుమారుడు ఆ పేరును చిక్కుల్లోకి నెట్టడం కార్యకర్తలను కూడా కలవరపెడుతోంది.

 కుట్ర కోణం - రాజకీయ ఎదురుదాడి 

ఈ కేసును బండి సంజయ్ పూర్తిగా రాజకీయ కుట్ర గా అభివర్ణిస్తున్నారు. తాను ఒక బీసీ నేతగా ఎదగడాన్ని సహించలేక, తనను నేరుగా ఢీకొనే ధైర్యం లేకనే తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భగీరథ్ తరపున కరీంనగర్‌లో  హనీట్రాప్,  బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో కౌంటర్ కేసు కూడా ఫైల్ అయింది. అయితే, చట్టం ముందు ఆరోపణలు నిరూపితమయ్యే వరకు ఈ నీలినీడలు ఆయనను వెంటాడుతూనే ఉంటాయి.  రాజకీయాల్లో కొన్ని సంఘటనలు తాత్కాలికంగా అనిపించినా, కీలక సమయాల్లో అవి మళ్లీ మళ్లీ తెరపైకి వస్తుంటాయి. ముఖ్యంగా బండి సంజయ్ వంటి నాయకుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగానో లేదా అంతకంటే పెద్ద పదవులకో రేసులో ఉన్నప్పుడు, ప్రత్యర్థులు ఈ కేసును ఉదాహరణగా చూపిస్తూ  కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టుకోలేని వారు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు  అనే విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక చట్టపరమైన చిక్కు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన పరీక్ష.

 నిర్ణయాత్మక తరుణంలో సెట్  విచారణ 

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని  సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. ఒక సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనే దానిపైనే బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం, బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ రాజీనామాకు డిమాండ్ చేయడం చూస్తుంటే.. ఈ సెగ త్వరగా చల్లారేలా కనిపించడం లేదు.  బండి సంజయ్ కింది స్థాయి నుంచి కష్టపడి నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యం ఇప్పుడు ఒక సున్నితమైన మలుపులో ఉంది. కుమారుడిని సమర్థించుకోవడం తండ్రిగా ఆయన బాధ్యత కావచ్చు, కానీ ప్రజా ప్రతినిధిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన.. చట్టం పట్ల తన నిబద్ధతను ఎలా నిరూపించుకుంటారన్నదే ముఖ్యం. కొన్నాళ్లకు ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోయినా, రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులు మాత్రం దీనిని ఒక శాశ్వత అస్త్రంగా వాడుకుంటూనే ఉంటారు.


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
AP Mega DSC Politics: డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget