అన్వేషించండి

Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్

నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో కుట్రలు చేస్తున్నారు.. మేం ఏ తప్పు చేయలేదని.. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమోషనల్ అయ్యారు.

Bandu Sanjay At BJP Meeting | హైదరాబాద్: జై శ్రీరామ్ అంటే మాలో ఆవేశాన్ని నింపుతోంది, ఆలోచనలు నింపుతుంది. మాలో పౌరుషాన్ని నింపుతుంది. జై శ్రీరామ్ నినాదమే కేసీఆర్ కుటుంబ గడీలు బద్ధలుకొట్టి మిమ్మల్ని ఫాం హౌస్‌కు పరిమితం చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏరోజూ పార్టీ తలవంచుకునే పని చేయలేదన్నారు. తాను బీజేపీ కార్యకర్తనని జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అని నినాదం చేసేవాడ్ని.. ఏ తప్పు చేయలేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఫాం హౌస్‌లో ఎలుకని కాదని, అయ్య పేరు, తాత పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదని.. కాషాయ జెండాను భుజంపై మోసిన వ్యక్తినన్నారు. యువ మోర్చా కార్యకర్తగా, ఏబీవీపీ కార్యకర్త, బీజేపీ కార్యకర్తగా, మోదీ శిష్యుడిగా ఎప్పుడూ తలవంచే ప్రసక్తే లేదన్నారు. 

ఢిల్లీకి మూటలు మోస్తున్న కాంగ్రెస్ నేతలు

 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగసభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ ఈ నినాదంతోనే 9,400 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చారు. జై శ్రీరామ్ నినాదంతోనే రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారు. మోదీ లేకపోతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నడవదు. మేం కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇస్తుంటే.. ఇక్కడి కాంగ్రెస్ పాలకులు ఢిల్లీకి మూటలు మోస్తున్నారు.

6 గ్యారంటీలు అమలు చేయకుండా మోసం..

తెలంగాణ ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయలేక కాంగ్రెస్ పెద్దలు తెలంగాణకు రావడం మానేశారు. రాష్ట్రానికి రావడానికి ముఖం చాటేస్తున్నారు. బెంగాల్‌లో అంత ఈజీగా బీజేపీ గెలవలేదు. అనేక మంది కార్యకర్తలు బలిదానంతో అధికారం సాధ్యమైంది. మహిళా మోర్చా కార్యకర్తల్ని హత్యాచారం చేశారు. ఇంట్లో కట్టేసి ఎంతో మందిని నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో అమిత్ షా, నరేంద్ర మోదీలు బెంగాల్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. 

కేరళలో ఓ ఏబీవీపీ ర్యాలీకి వెళ్లాను. ఓ నేత అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. ఆయన స్పీచ్ ఇస్తుంటే మధ్యలో కన్ను బయటకు వచ్చింది. అంతా ఆశ్చర్యపోయాం. పీఎఫ్ఐ మైనారిటీ గూండాలు నా చేతులు కట్టేసి నా కళ్లు పీకేశాయి. అయినా తాను పారిపోయే వ్యక్తిని కాదని దేశం కోసం ధైర్యం కోసం పోరాటం చేస్తున్నారు. రాజ్యసభలో సుందరం మాస్టర్ రెండు కాళ్లు నరికేస్తే పెట్టుడు కాళ్లతో పనిచేస్తున్నారు. ఆయనకు ప్రధాని మోదీ రాజ్యసభ ఛాన్స్ ఇచ్చారు. 

కేంద్రం నిధులతోనే తెలంగాణలో పాలన

అక్కడక్కడా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. వాటన్నింటిని పక్కనపెట్టి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువద్దాం. కార్యకర్తలు, అమరవీరుల బలిదానాలకు అప్పుడే విలువు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి నిధులిచ్చేది మనం. అభివృద్ధి చేసేది మనం. కానీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొంటలేదు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇంతవరకూ కొనుగోలు చేయడకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ లేదు. విద్యార్థులకు, నిరుద్యోగులకు భరోసా లేదు. రైతు భరోసా లేదు, రైతు బోనస్ లేదు. కేవలం ఢిల్లీకి పైసలు పంపడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. 

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు, రైల్వేకు నిధులు, కొనుగోలు కేంద్రాలకు, శ్మశాన వాటికలకు నిధులు కేంద్రం ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బద్నాం చేసే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేద్దాం. ఏ వర్గానికి కొమ్ముకాయం. సనాతన ధర్మాన్ని కించపరిచేస్తే బీజేపీ కార్యకర్త చూస్తూ ఊరుకోడని గుర్తుంచుకోవాలని’ అన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget