PM Narendra Modi: రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
Cyberabads Role in Indias Growth | దేశాభివృద్ధిలో సైబరాబాద్ పాత్ర కీలకమని, ఇది అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.

హైదరాబాద్: దేశాభివృద్ధిలో సైబరాబాద్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. సైబరాబాద్ ప్రస్తుతం ఒక అతిపెద్ద ఉపాధి కేంద్రంగా ఎదిగిందని, ముఖ్యంగా సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో ఈ ప్రాంతం విశేషమైన సేవలందిస్తోందని పేర్కొన్నారు. అనేక భారీ ప్రాజెక్టులు ఇక్కడ పురుడు పోసుకోవడం గర్వకారణమని, ఇవన్నీ దేశ పురోగతికి బాటలు వేస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఇటీవల ఎన్నికల ఫలితాలతో తొలిసారి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పాగా వేయడంతో బీజేపీ నేతలు హ్యాపీగా ఉన్నారు. నెక్ట్స్ టార్గెట్ మిషన్ తెలంగాణ అని పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది.
తెలంగాణలో రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులు
హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో సుమారు రూ. 9,377 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆదివారం నాడు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్‌లో ప్రారంభించిన పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కు దేశీయ జౌళి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, దీని ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల తెలంగాణ ఎంతగానో లాభపడుతుందని ప్రధాని అన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన మరియు పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడను అని రేవంత్ అంటున్నారు. నేను కూడా ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడను. అయితే 10 ఏళ్లలో గుజరాత్ కు ఇచ్చినవన్నీ తెలంగాణకు ఇచ్చేందు రెడీ. కానీ అలా చేస్తే కనుక మీకు ఇప్పుడు వచ్చే వాటిలో సగం కూడా రావు. మాతో కలిసి నడవండి. అన్ని ప్రయోజనాలు మీకు లభిస్తాయి - ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే..
- జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు పనులు (3,175 కోట్ల రూపాయలు).
- 21 కి.మీ. కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను ( 292 కోట్ల రూపాయలు).
- 118 కి.మీ. కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు ( 1,243 కోట్ల రూపాయలు).
- హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ పీవోఎల్ (611 కోట్ల రూపాయలు).
- వరంగల్‌లోని ‘పీఎం మిత్ర’ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (1,695.54 కోట్ల రూపాయలు).
- జహీరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ( 2,360.54 కోట్ల రూపాయలు).
A major push towards better infrastructure and seamless connectivity across Telangana. Speaking at the launch of various development works in Hyderabad. https://t.co/fFKrabr3Kl
— Narendra Modi (@narendramodi) May 10, 2026
ఈ కార్యక్రమం తరువాత ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో ప్రధాని మోదీ అవుతారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలతో పాటు దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ ను పరామర్శించనున్నారు.
సాయంత్రం 6.30కి పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇటీవల మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు. ఎస్పీజీ బృందాలు మూడు రోజుల కిందటే సభా ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకుని తనిఖీలు చేశాయి.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















