అన్వేషించండి

YSRCP : వ్యక్తిగత ప్రవర్తనతో పార్టీని అభాసుపాలు చేస్తున్న నేతలు - వైసీపీ హైకమాండ్ కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతోంది ?

Jagan : వ్యక్తిగత ప్రవర్తన కారణంగా వివాదాల్లోకి వెళ్లిపోతన్న వైసీపీ నేతల సంఖ్య పెరిగిపోతోంది. ఎవరిపైనా పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో ఇతర నేతల్లోనూ ఈ ప్రవర్తన పెద్ద సమస్య కాదన్న అభిప్రాయం బలపడుతోంది.

Personal behavior of the YSRCP leaders become a problem for high command : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన సమస్యల్లో ఉంది. మళ్లీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవ్వాల్సి ఉంది. అయితే ఇలాంటి సమయంలో పార్టీకి తలనొప్పులు తెచ్చేలా  కొంత మంది  వ్యహారశైలి ఉంది. విజయసాయిరెడ్డి వ్యాహారం పూర్తిగా సద్దుమణగక ముందే ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం దుమారం రేపుతోంది. అది మార్ఫింగ్ అని చెబుతున్నారు కానీ.. ఆ వీడియోను చూపించి చాలా కాలంగా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా చెబుతున్నారు. అంటే.. అలాంటి వీడియో ఉందని ఆయనకు ముందే తెలుసన్నమాట. అది మార్ఫింగే అయితే అప్పట్లోనే ఫిర్యాదు చేసి ఉండేవారు కదా అని ఎక్కువ మంది డౌట్. అనంతపురం  రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలు చూసిన వారు..తెలిసిన వారు అదేమి మార్ఫింగ్ అని అనుకోవడం లేదు. 

వరుసగా వివాదాస్పదమవుతున్న వైసీపీ నేతల వ్యవహారాశైలి   

అనంతబాబు ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఉన్నారు. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కానీ లేకపోతే జైల్లోనే ఉండేవారు. ఇటీవల విజయసాయిరెడ్డి విషయంలో .. ఓ దేవాదాయ శాఖ ఉద్యోగిని భర్త చేసిన ఆరోపణలు సంచలనాత్మకమయ్యాయి. వాటిపై రోజుల తరబడి చర్చ జరిగింది. ఆ ఉద్యోగిని భర్త.. తన భార్యకు పుట్టిన  బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డేనని డీఎన్ఎ టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి మాత్రం ఆమెను ఓ కూతురిగా భావించి మాత్రమే సాయం చేశానని అంతే తప్ప.. మరేలాంటి ఆరోపణలకు చాన్స్ లేదని వాదించారు. ఆయనపై పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా ఎలాంటి వివరణ తీసుకోలేదు. 

దువ్వాడ కో న్యాయం మిగిలిన వాళ్ళకో న్యాయమా? రిగిలిపోతున్న కేడర్!

అంబటి, అవంతి, దువ్వాడ.. విజయసాయిరెడ్డి ! 

మరో వైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ వంటి వారి ఆడియోల వైరల్ అయ్యాయి. వేర్వేరు మహిళలతో వారు చేసిన సంభాషణలు.. శృతి మించి ఉన్నాయి. వారు కూడా ఆ మాటలు తమవి కావని  వాదించారు. నిజంగా అవి మార్ఫింగ్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి వెంటనే.. వాటిని మార్ఫ్ చేసిన వారిని పట్టుకుని  కఠఇనమైన సెక్ష్షన్ల కింద కేసులు పెట్టేవారు. కానీ అలాంటి ప్రయత్నమే చేయకపోవడంతో అవన్నీ నిజమైన టేపులేనన్న అభిప్రాయం ప్రాజల్లో కూడా బలపడింది. ఇక హిందూపురం ఎంపీగా ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చిన  గోరంట్ల మాధవ్ వీడియో ఎంత సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ వీడియో విషయంలోనూ అదే ఎదురుదాడి చేశారు. 

వైసీపీ లీడర్ అనంతబాబు న్యూడ్ వీడియో వైరల్! మార్ఫింగ్ అని కొట్టిపారేసిన ఎమ్మెల్సీ

చర్యలు తీసుకునే విషయాన్ని పట్టించుకోని వైసీపీ హైకమాండ్ 

తాాగా దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉంటూ.. సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వైనం సంచలనం అయింది.  ఇలా నేతల వ్యక్తిగత ప్రవర్తన పార్టీని ప్రజల్లో చులకన చేసేలా ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవానికి వైసీపీ అధినేత సంశయిస్తున్నారు. దువ్వాడను ఇంచార్జ్ పదవి నుంచి మాత్రం తప్పించారు. మిగతా వారిపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. వైసీపీ హైకమాం్ తీరు కూడా ఆయా నేతల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందన్న అభిప్రాయం ఏర్పడటానికి కారణం అవుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు
జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు
Andhra Pradesh: బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
JK Election: జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు
జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు
Andhra Pradesh: బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
JK Election: జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
TTD Clarity On Anam Video: ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
Vijayawada News: విజయవాడ వరద ప్రాంత ప్రజలకు మరో హెచ్చరిక- కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ప్రమాదం
విజయవాడ వరద ప్రాంత ప్రజలకు మరో హెచ్చరిక- కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ప్రమాదం
Modi America Tour: భారత ప్రధాని మోదీని కలిసేందుకు ట్రంప్ ఉత్సాహం.. ఎందుకంటే..?
భారత ప్రధాని మోదీని కలిసేందుకు ట్రంప్ ఉత్సాహం.. ఎందుకంటే..?
Jamili Elections : జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం ?  బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటి ?
జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం ? బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటి ?
Embed widget