By: ABP Desam | Updated at : 04 May 2022 08:39 PM (IST)
బీజేపీ వైపు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చూపు ? బండి సంజయ్‌తో చర్చలు !
Konda Vishweshwar Reddy : బీజేపీ నేత బండి సంజయ్‌ను ( Bandi Sanjay ) మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిశారు. అంతకుముందు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో విశ్వేశ్వర్‌రెడ్డి సమావేశమయ్యారు. సంజయ్‌తో భేటీకి జితేందర్‌రెడ్డితో కలిసి వచ్చారు. సంజయ్‌తో భేటీ అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తండ్రీకొడుకులను ఓడించాలని.. కేసీఆర్, కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వెంటే తెలంగాణ ( Telangana ( సమాజం ఉందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. అయితే పార్టీలో చేరుతారా లేదా అన్నదానిపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
పసుపు బోర్డు తెచ్చే వరకూ ఎక్కడికక్కడ అడ్డుకొనుడే - నిజామాబాద్ ఎంపీపై కవిత ఫైర్ !
టీఆర్ఎస్ ( TRS ) ఎంపీగా చేవెళ్ల నుంచి గెలిచిన తర్వాత ఆ పార్టీ అగ్రనాయకత్వంతో విభేధాలు రావడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే కాంగ్రెస్‌లోనూ ఆయన ఇమడలేకపోయారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.ఆ తర్వాత ఆయన పలు పార్టీల నేతలతో భేటీ అయ్యారు. ఇంత వరకు ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. అప్పట్లో ఈటల బీజేపీలో చేరే సమయంలో కొండా కూడా కాషాయ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరిగింది.
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఆపే కుట్ర- కేంద్రంపై మంత్రి గంగుల సంచలన ఆరోపణలు
రేవంత్ రెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ ( T PCCC CHIIEF ) అయిన తర్వాత ఆయనతో ఓసారి సమావేశం అయ్యారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో మళ్లీ చేరుతానన్న సంకేతాలు పంపారు. అయితే ఇంత వరకూ చేరలేదు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లక్ష్యం టీఆర్ఎస్‌ను ఓడించడం. అయితే తాను ఏపార్టీలో అయినా చేరితే ఆ పార్టీ టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా మారితే తన పరిస్థితి ఏమిటని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఎవరు పోరాడుతారో వారితోనే ఉంటానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
ఉర్దు భాషపై ఉరుముల్ మెరుపుల్- తెలంగాణలో సరికొత్త వివాదం
అయితే అన్ని రాజకీయా పార్టీలతోనూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టచ్‌లో ఉంటున్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది చివరి వరకూ సస్పెన్స్‌గా ఉండే అవకాశం ఉంది.
3 Years of YSR Congress Party Rule : పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా మారిన సచివాలయ వ్యవస్థ ! మేలు జరుగుతుందా ? కీడు చేస్తుందా ?
Modi Tour Twitter Trending : మోదీ టూర్‌పై టీఆర్ఎస్, బీజేపీ ఆన్లైన్, ఆఫ్‌లైన్ వార్ - పాలిటిక్స్ అంటే ఇట్లుంటది మరి !
Bandi Sanjay: బండి సంజయ్ వివాదాస్పద కామెంట్స్ వెనుక కారణాలేంటి? మళ్లీ దానిపై కన్నేశారా!
Khammam: సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి వ్యాఖ్యల దుమారం! అదే పనిగా విమర్శలు, అందులో ఆంతర్యంటి?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?