MLC Kavita : పసుపు బోర్డు తెచ్చే వరకూ ఎక్కడికక్కడ అడ్డుకొనుడే - నిజామాబాద్‌ ఎంపీపై కవిత ఫైర్ !

పసుపుబోర్డు ఎప్పుడు తెస్తారు ? పసుపు రైతులకు మద్దతు ధర ఎప్పుడిప్పిస్తారో చెప్పాలని నిజామాబాద్ ఎంపీని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. లేకపోతే ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు.

FOLLOW US: 

పసుపు బోర్డు తీసుకు వస్తానని బాండ్ రాసి ఇచ్చి ఓట్లు వేయించుకుని.. మూడేళ్లయినా ఎలాంటి బోర్డు తీసుకు రాని నిజామాబాద్ ఎంపీని ఎక్కడిక్కకడ అడ్డుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత... బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు నిజాలు చెప్పాలనే మీడియా సమావేశం పెట్టానని చెబుతూ ఎంపీపై విరుచుకుపడ్డారు. జిల్లాలో రైతుల సమస్యకు రాజకీయ రంగు పులిమి బీజేపీ అభ్యర్థి గెలిచారని.. కానీ ఇప్పటి వరకు బీజేపీ పార్టీ పసుపు రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పటి వరకూ ఎంపీ అరవింద్‌పై మాట్లాడలేదని.. కానీ ఆయన అసత్య ప్రచారాలు చేస్తూ.. మభ్య తపెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన తీరును ప్రజల ముందు ఉంచేందుకే మాట్లాడుతున్నాన్నారు.

పసుపు బోర్డు కోసం తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రధాన మంత్రి గారిని కలిశామని.. ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులనూ కలిశామన్నారు. వారి మద్దతు కూడా పొందామన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరం కలిసి  పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టామని గుర్తు చేశారు.  2015 లోనే   స్పైసెస్ బోర్డు రీజనల్  ఆఫీస్ ను పెట్టామని... 2017 లోనే డివిజనల్ ఆఫీస్ పెట్టామని పత్రాలను విడుదల చేశారు. పసుపు రైతులకు అవసరమైన బాయిలర్లను పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీగా అందించామన్నారు. కానీ ఇప్పుడు ఎంపీ అరవింద్ అవన్నీ తానే చేశానని చెప్పుకుంటున్నారని  మండిపడ్డారు.  లక్షలాది మంది రైతుల ప్రయోజనాల కోసం అరవింద్ తెచ్చింది ఒక్కో రైతుకు రూ. 300  మాత్రమేనన్నారు. ఆర్టీఐ ద్వారా తాను ఆ వివరాలను సేకరించానన్నారు.

మూడేళ్ల నుంచి నాలికకు మడత లేకుండా మాట్లాడుతున్న ఎంపీ సిగ్గుపడాలని కవిత మండిపడ్డారు. ఏ భాషలో అయినా హైస్పీడ్‌గా అబద్దాలు చెప్పడం బీజేపీకే సాధ్యమన్నారు. అబద్ధాలు చెప్పి బిజెపి అధికారంలోకి వచ్చిందని..  కులాల మధ్య ,మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పసుపు బోర్డు ఎప్పడు తెస్తారో అరవింద్ ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. మద్దతు ధర ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించారు. అధర్మపురి అరవింద్ ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్య పెడతారని కవిత్ ప్రశ్నించారు.

మూడేళ్లు ఓపిక పట్టినం ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. బోర్డు తెచ్చే వరకు ఇక్కడి కక్కడ అడ్డుకుంటాం ..జిల్లా ప్రజలకు ఎంపి సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.  ఉద్యోగాల్లో వివాదాలు లేపకుండా కేంద్రంలో ఖాళిగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని...   మోడీ ప్రభుత్వం ఎన్నికైన నుండి  తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కానీ నవోదయ కాలేజీ కానీ ఇవ్వలేదన్నారు  
  
Published at : 04 May 2022 05:54 PM (IST) Tags: nizamabad MLC Kavita Nizamabad news TRS MLC

సంబంధిత కథనాలు

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule : యువత ఆశలు గల్లంతు - మూడేళ్లలో జాబ్ క్యాలెండర్ హామీ నిలబెట్టుకోలేకపోయిన సీఎం జగన్ !

3 Years of YSR Congress Party Rule :   యువత ఆశలు గల్లంతు - మూడేళ్లలో  జాబ్ క్యాలెండర్ హామీ నిలబెట్టుకోలేకపోయిన సీఎం జగన్ !

3 Years of YSR Congress Party Rule : దూరమైన ఫ్యామిలీ, ఆత్మీయులు - మూడేళ్లలో జగన్ కొత్త శత్రువులను పెంచుకున్నారా ?

3 Years of YSR Congress Party Rule : దూరమైన ఫ్యామిలీ, ఆత్మీయులు - మూడేళ్లలో జగన్ కొత్త శత్రువులను పెంచుకున్నారా ?

Telugu Desam Party : సై అంటున్న సైకిల్ పార్టీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన

Telugu Desam Party : సై అంటున్న సైకిల్ పార్టీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన

TDP Digital Plan : తెలుగుదేశం డిజిటల్ బాట - యువతకు చేరువయ్యేందుకు కొత్త వ్యూహం !

TDP Digital Plan :   తెలుగుదేశం డిజిటల్ బాట - యువతకు చేరువయ్యేందుకు కొత్త వ్యూహం !

టాప్ స్టోరీస్

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!