News
News
వీడియోలు ఆటలు
X

BRS Politics : కమ్యూనిస్టులకూ కేసీఆర్ దూరమేనా ? జాతీయ రాజకీయాలపై పూర్తిగా ఆలోచన వదిలేశారా ?

తెలంగాణలో కమ్యూనిస్టులతోనూ కేసీఆర్ పొత్తు కోరుకోవడం లేదా ?

కలసి పని చేద్దామని మునుగోడులో చెప్పి ఇప్పుడెందుకు సైలెంట్ ?

జాతీయ రాజకీయాల్లోనూ కలిసి పని చేయరా ?

FOLLOW US: 
Share:

BRS Politics :   భారత రాష్ట్ర సమితితో  కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటానికి తామేమీ సన్యాసం తీసుకోలేదని సీపీఐ అగ్రనేత నారాయణ స్పష్టం చేశారు. కేసీఆర్ నుంచి పొత్తులపై సానుకూల సంకేతాలు రాకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో కేసీఆర్..కమ్యూనిస్టులతో కలిసి రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలోనూ కలిసి పని చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వెనక్కి తగ్గుతున్నారు. దీంతో జాతీయ రాజకీయాల విషయంలోనూ కేసీఆర్ వెనక్కి తగ్గుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

రాష్ట్ర స్థాయిలో ఎవరితోనూ పొత్తుల ఆలోచనలు చేయని కేసీఆర్ 
 
తెలంగాణ ఏర్పడిన తర్వాత  భారత రాష్ట్ర సమితి ఎప్పుడూ పొత్తుల గురించి ఆలోచించలేదు. మజ్లిస్ తెర వనుక నుంచి ఇచ్చే సహకారం చాలని.. అనుకుంటోంది. మజ్లిస్ సహకరిస్తూ వస్తోంది. అయితే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాతా జాతీయ రాజకీయాలను ప్రారంభించిన కేసీఆర్  కమ్యూనిస్టులను చేరదీశారు. వచ్చే ఎన్నికల్లోనూ కలిసి  పనిచేద్దామని మునుగోడు ఉపఎన్నికల్లో వారి మద్దతు పొందారు. బీఆర్ఎస్ విజయంలో వారి ఓట్లు కీలకమయ్యాయని చెబుతూ ఉంటాు.  కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ లెఫ్ట్ పార్టీల గురించి మాట్లాడటం లేదు. కనీసం పిలిచి మాట్లాడటం లేదు. నిజం చెప్పాలంటే.  ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల  గురించే మాట్లాడటం లేదు కాబట్టి.. లెఫ్ట్ పార్టీల నేతలకూ ఆహ్వానాలు లేకుండా పోయాయి. అందుకే సీపీఐ జాతీయ నేత నారాయణ.. కేసీఆర్ తీరుపై అసహనం  వ్యక్తం చేశారు. సరైన స్పందన రావడం లేదని..  అలాగని తామేమీ సన్యాసం తీసుకోలేదని ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామంటున్నారు. అంటే టీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటే సీట్లివ్వాలి కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా కేటాయించే అవకాశం లేదు. అలాంటి సూచనలు కూడా కేసీఆర్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. 

మజ్లిస్‌తో అయినా బీఆర్ఎస్‌కు తెరవెనుక సహకారం అందడం కష్టమే ! 

ప్రతీ సారి మజ్లిస్ తో లోపాయికారీ పొత్తులు ఉంటాయి.  ఈ సారి మజ్లిస్ నుంచి ఆ పార్టీకి అలాంటి సహకారం వస్తుందా లేదా అన్నది సందేహమే. పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వరకూ ఢోకా లేదు. కానీ ఆ బయట కూడా సత్తా చూపించాలని ఊబలాటపడుతోంది. రెండు, మూడు అసెంబ్లీ సీట్లు ఇచ్చినా  సంతృప్తి పడుతుంది. కానీ కేసీఆర్ పాతబస్తీ బయట మజ్లిస్ బలపడటానకి చాన్సిస్తారా అంటే.. అసలు చాన్స్ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది  ఇక అడపా దడపా కాంగ్రెస్ పార్టీతో పొత్తుల గురించి చర్చల్లోకి వస్తుంది కానీ.. అది అసాధ్యమని రాజకీయ వర్గాలందరికీ తెలుసు. ఒక వేళ జాతీయ స్థాయి లో ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే అక్కడ చేస్తారు కానీ.. గల్లీలో మాత్రం ఆ రెండు పార్టీలు కొట్లాడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే అవకాశం లేదు.  

జాతీయ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టినట్లే ! 

జాతీయ రాజకీయాల కోణంలో తెలంగాణలోనూ కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే విషయాన్ని ఆలోచన చేయాలని గతంలో కేసీఆర్ అనుకున్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తుల గురించి ఆలోచించినట్లుగా తెలుస్తోంది. కారణం ఏదైనా కానీ..కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. గతంలోలా ఇతర రాష్ట్రాల నుంచి నేతల్ని పిలిపించి కండువాలు కప్పడం లేదు. బహిరంగసభల ఆలోచనలు చేయలేదు. దీంతో ..  ముందు తెలంగాణలో ఒంటరి పోరు చేసి.. బీఆర్ఎస్ ను గట్టెక్కించుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. 

Published at : 16 May 2023 08:00 AM (IST) Tags: BRS Telangana CM KCR communists alliances of communists with BRS

సంబంధిత కథనాలు

Mini Jamili Elections :  మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?

Mini Jamili Elections : మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

KCR Plan For Elections : పథకాల వరద పారించి ఎన్నికలకు కేసీఆర్ - మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా !?

KCR Plan For Elections :   పథకాల వరద  పారించి ఎన్నికలకు కేసీఆర్ - మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా !?

AP Cabinet : ముందస్తుపై కీలక ఆలోచనలు చేస్తారా ? ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ !

AP Cabinet : ముందస్తుపై కీలక ఆలోచనలు చేస్తారా ? ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ !

టాప్ స్టోరీస్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News :  రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్