Andhra Pradesh : వైసీపీ ఓటమిలో ప్రధాన కారణంగా చంద్రబాబు అరెస్ట్ - జగన్‌ను తప్పుదోవ పట్టించిందెవరు ?
YSRCP : చంద్రబాబు అరెస్ట్ అంశం తప్పిదమని వైసీపీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో చంద్రబాబును అరెస్టు చేయాలనే సలహా జగన్‌కు ఇచ్చిందెవరు ?
Chandrababu arrest is wrong For YSRCP : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అరెస్టు చేసి ఏడాది అయిందని టీడీపీ గుర్తు చేసుకుంది. ఆ సందర్భంగా వైసీపీ నేతల తీరును మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఏడాది ముందు ఓ ప్రతిపక్ష నేతను జైల్లో పెట్టడం. సరైన ఆధారాలు చూపకపోను.. వరుస కేసులు పెట్టి జైల్లో ఉంచాలనుకునే వ్యూహాన్ని అమలు చేశారు. తద్వారా టీడీపీని నిర్వీర్యం చేయాలని ప్లాన్ చేసుకున్నారని .. ఇక టీడీపీ కోలుకోలేదని అనుకున్నారని అంటారు. ఈ అరెస్టుకు చాలా కాలం మందు నుంచే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వచ్చే ఉగాదికి టీడీపీ ఉండదని ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఈ వ్యూహం ఫెయిలయింది. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్ష హోదాలో కూడా లేదు. ఉగాదికి టీడీపీ అధికారంలో ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబును అరెస్టు చేసి ఏదో చేద్దామనుకుంటే అది టీడీపీకే ప్లస్ అయిందని.. వైసీపీ పునాదుల్ని కదిలించేలా చేసిందని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబును అరెస్టు చేసి టీడీపీకి కట్టడి చేయాలన్నది ఎవరి ఆలోచన ?
వైసీపీలో రాజకీయ వ్యూహకర్తలకు కొదవ లేదు. అయితే ఆ వ్యూహాలు రాంగ్ ట్రాక్ లోకి వెళ్లడమే అసలు మైనస్ గా మారింది. చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలపై కనీస చర్యలు తీసుకోవడానికి కూడా ఆయా రాష్ట్రాలు వెనుకాడతాయి. సాక్ష్యాలున్నప్పటికీ అంతే. ఎందుకంటే.. భారత రాజకీయాల్లో సానుభూతి అనేది చాలా కీలకం. ఎవరినైనా వేధిస్తున్నారని అనిపిస్తే ప్రజలు వారికి మద్దతుగా నిలుస్తారు. ఇది చరిత్రలో చాలా సార్లు నిరూపితమయింది. కానీ చంద్రబాబును అరెస్టు చేసి గెలిచేద్దామని వైసీపీ నేతలు అనుకున్నారు. అసలు అంత రివర్స్ లో ఎలా ఆలోచించారో వైసీపీ క్యాడర్ కు కూడా సరిగ్గా అర్థం కాలేదు. ఆ ఆలోచన తప్పని ఆ తర్వాత ప్రజల్లో వచ్చిన రియాక్షన్ తో వైసీపీ అర్థం చేసుకుని ఉంటుంది. అందుకే.. కేసుల గురించి ఎన్నికల్లో మాట్లాడకుండా.. సుప్రీంకోర్టు నుంచి ఆదే్శాలు తెచ్చుకోగలిగారు. కానీ జరుగుతున్న నష్టాన్ని ఆపలేకపోయింది.
ఎంతో నమ్మకంతో గెలిపించారు, తేడా వస్తే ఊరుకునేది లేదు - పరిటాల సునీత
చంద్రబాబు అరెస్ట్ తర్వాత నష్టాన్ని అంచనా వేయడంలోనూ విఫలం
వైసీపీ వ్యూహకర్తలు చంద్రబాబు అరెస్టు తర్వాత తమ పార్టీకి జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయడంలోనూ విఫలమయ్యారు. చట్టం ప్రకారం చంద్రబాబు విషయంలకో చర్యలు తీసుకోలేదని ఎక్కువ మంది ప్రజలు నమ్మారు. ఎఫ్ఐఆర్ లేకుండా మనీ ట్రయల్ లేకుండా ఓ ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడంతో ప్రజల్లో ఓ రకమైన భయాందోళన వ్యక్తమయింది. చంద్రబాబుకే రక్షణ లేకపోతే.. తమను ఏ కేసులో అయినా.. సాక్ష్యాలేకపోియనా అరెస్టు చేస్తారన్న భయం సామాన్యుల్లో వచ్చింది. ఇలాంటి పరిస్థితి వస్తే.. అలాంటి ప్రభుత్వాన్ని ఏ ఒక్కరూ నమ్మలేరు. అది ఓటింగ్ లో స్పష్టంగా కనిపించింది. కానీ జరిగిన తప్పును గుర్తించి వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం కలిగించే పనులను వైసీపీ చేయలేకపోయింది.
Also Read: బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఈ తప్పు వెంటాడుతూనే ఉంటుందా ?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలపై పెట్టిన కేసులు, వాటిని దర్యాప్తు చేసిన వారి వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతానికి వారికి పోస్టింగుల్లేకుండా పక్కన పెట్టారు. కానీ వారిని అలా వదిలేసే అవకాశం ఉండదు. పాలనను గాడిలో పెట్టుకున్న తర్వాత చంద్రబాబు తమపై విచక్షణా రహితంగ ప్రవర్తించిన అధికారుల సంగతి చూసే అవకాశం ఉంది. గతంలోలా ఆయన క్షమించే అవకాశం లేదని.. కేసుల విషయంలో చివరికి భువేశ్వరి, బ్రహ్మణిలను కూడా ఇరికించే ప్రయత్నం చేసినందున ఆయన క్షమించరని అంటున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి కూడా ఇబ్బందికరమే. ఆ అధికారులు తాము ఎవరు చెబితే చేశామో.. చివరికి వెల్లడిస్తే.. రాజకీయంగా పెను సంచలనం అవుతుంది. ముందు ముందు ఈ వ్యవహారంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు పరిణామం.. వైసీపీ ఓటమితో ఆగిపోదని అంటున్నారు.