Sharmila Vs Jagan: వైఎస్ ఫ్యామిలీని చీల్చింది జగనే- దేవుడు, తల్లే సాక్ష్యం- షర్మిల సంచలన కామెంట్స్
Sharmila Reacts Jagan Comments On Family matters: కాంగ్రెస్ తన కుటుంబాన్ని చీల్చిందన్న సీఎం జగన్ కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు షర్మిల.
Sharmila Reacts Jagan Comments On Family matters: కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చింది అని జగన్ అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. YSR కుటుంబం చీలింది అంటే చేతులారా చేసుకున్నది జగన్ ఆన్న గారే అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్సార్ భార్య విజయమ్మ అని వివరించారు. యావత్ కుటుంబం దీనికి సాక్ష్యంగా ఉన్నరని తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉన్నప్పుడు తాను నిలబడ్డానని చెప్పుకొచ్చారు. 18 మంది రాజీనామాలు చేసి జగన్ వైపు నిలబడితే అధికారంలోకి వచ్చాక మంత్రులను చేస్తా అన్నారని గుర్తు చేశారు. ఇవాళ వారిలో ఎంతమంది మంత్రులు ఉన్నారో చెప్పాలన్నారు. వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ,నేను వాళ్ళ కోసం తిరిగామని వివరించారు. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డామన్నారు. వాళ్ళను గెలిపించామని గుర్తు చేశారు.
వైసీపీ కష్టాల్లో ఉందని తనను పాదయాత్ర చేయమంటే అరక్షణం ఆలోచించకుండా ముందుకు దూకానన్నారు. నా ఇంటిని, పిల్లలకు పక్కన పెట్టీ ఎండనక, వాననక రోడ్ల మీదనే ఉన్ననని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశానని వివరించారు.
తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశానని తెలిపారు షర్మిల. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డానని గుర్తు చేశారు. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశానని వివరించారు. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగానని తెలిపారు. దేశంలోనే మిస్ట్ సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేశానని పేర్కొన్నారు.
అన్నీ చేసి వారిని గెలిపిస్తే... జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు షర్మిల. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి వేరే మనిషి అన్నారు. పూర్తిగా మారిపోయారని తెలిపారు. తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నానని తెలిపారు. తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు ..YSR పేరు,ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నట్టు వివరించారు. YSR పేరు నిలబెడతాడు అనుకున్నట్టు పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారాడం ఆశ్చర్యం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే,ఎంపీ లేరు కానీ... అయినా ఏపిలో బీజేపీ రాజ్యం ఏలుతుందని విమర్శించారు షర్మిల. జగన్, ఆయన పార్టీని,రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఘాటుగా ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ YSR డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. అంతకు ముందు ఏ ప్రభుత్వాలు చేయని సాహసం YSR చేశారని అన్నారు. వైఎస్సార్ 2004 లో ముఖ్యమంత్రిగా ఆయిన 6 నెలల్లో ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టారని వివరించారు. వైఎస్సార్ హయాంలో 4500 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించారని... ఆయన మరణం తర్వాత TDP, YCP ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్ ను నిరక్ష్యం చేశాయని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చిందని తెలిపారు షర్మిల. బాబు అధికారంలో వచ్చాక అంచనా వ్యయం 30 వేల కోట్లకు పెంచారే తప్పా ఉపయోగం లేదన్నారు. వైఎస్సార్ పనితీరు మీలో కల్పిస్తే మీరు వైఎస్సార్ వారసులు అవుతారని జగన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అయిందన్నారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా మార్చారని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని దుయ్యబట్టారు.