అన్వేషించండి

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి పేరు దాదాపు ఖరారు అయింది. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏం సంబంధమనే అనుమానం కలుగుతుంది. అందుకే ఈ స్టోరీ చదవండి

Andhra Pradesh News: రాజకీయాల్లో ఏ నిర్ణయమైనా సరే అంత ఆషామాషీగా తీసుకోరు నాయకులు. నాన్నకు ప్రేమతో సినిమాలో చెప్పినట్టు బటర్‌ఫ్లై ఎఫెక్ట్ పాలిటిక్స్‌లో కచ్చితంగా ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కీలక నేతలు తీసుకున్న నిర్ణయం వెనుకాల చాలా పెద్ద స్కెచ్‌ ఉంటుంది. అలాంటిదే విజయసాయి రెడ్డి రాజీనామా. ఇప్పుడు రాజీనామాతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన పావులు కదపబోతోంది. 

వైసీపీకి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. తనకు రాజకీయాలతో సంబంధంలేదని ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయడం అది ఆమోదం పొందడం జరిగిపోయింది. ఈ రాజీనామా కేంద్రంగానే బీజేపీ ఎత్తులు పై ఎత్తులు వేస్తోందని సమాచారం. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇటు తెలంగాణలో కీలక నిర్ణయాలు తీసుకుటుందని అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడి కోసం అన్వేషణ

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షురాలిగా ప్రస్తుతం పురందేశ్వరి ఉన్నారు. ఆమె స్థానంలొ కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఎప్పటి నుంచో కాషాయ నాయకత్వం యోచిస్తోంది. దీని కోసం అనేక సమీకరణాలను పరిశీలిస్తోంది. యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలా లేకుంటే సామాజిక లెక్కలు చూసుకొని అధ్యక్షుడిని ఖరారు చేయాలా అనే అంశంపై గత కొన్ని రోజులుగా చర్చలు సాగిస్తోంది. 

వైసీపీలో విజయసాయి రెడ్డికి ఎప్పటి నుంచో ఉక్కపోత 

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడి నియామకం విషయంలో చర్చలు సాగుతున్న టైంలోనే విజయసాయి రెడ్డి ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. మొదటి నుంచి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన సొంత పార్టీలో మూడు నాలుగేళ్లగా ఉక్కపోతకు గురవుతున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడీ జరిగిన తర్వాత వైసీపీలో ఆయనకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. అందుకే బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేశారట. అలాంటి ప్రయత్నాల్లో పార్టీ మారడం కూడా ఒకటిగా చెబుతున్నారు. 

బీజేపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి ఓకే- టీడీపీ నాట్‌ ఓకే 

వైసీపీకి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసిన టైంలోనే విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన వీటిని ఖండించారు. కానీ అది నిజమేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు చాలా విధాలుగా ప్రయత్నాలు చేశారట. అయితే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరితే తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మిత్ర పక్షాలైన టీడీపీ, జనసేన అభ్యంతరం వ్యక్తం చేశాయిట. 

టీడీపీ అయితే విజయసాయి రెడ్డి ప్రయత్నాలకు పూర్తిగా రెడ్‌ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ బీజేపీలో ఆయన చేరితే మూడు పార్టీల నేతలు, కేడర్‌తోపాటు రాష్ట్ర ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ అధినాయకత్వానికి వివరించారు. ఇది రాజకీయకంగా కూడా చాలా పెను ప్రభావం చూపుతుందని తెలిపారట. జరగబోయే పరిణమాలు వివరించారట. అందుకే ఆయన్ని చేర్చుకోకపోవడమే మంచిదని నచ్చజెప్పారని టాక్. 

బీజేపీ నేతలు కూడా రెడ్‌ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో రెండు మిత్ర పక్షాలతోపాటు, రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా అందుకే అంగీకరించలేదు. ఆయన రాకతో ప్రజల్లో పలుచన అవుతాని కాంగ్రెస్‌కు ఛాన్స్ ఇచ్చినట్టేని గట్టిగానే చెప్పారని తెలుస్తోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ అధినాయకత్వం పరిస్థితిని విజయసాయి రెడ్డికి వివరించింది. రాజీనామా చేసి సైలెంట్‌గా ఉండాలని కోరింది. పార్టీలో చేరికకు అంగీకరిస్తేనే తాను రాజీనామా చేస్తానంటూ చెప్పేశారు. ఎలాంటి లబ్ధి జరగనప్పుడు తాను ఆ సీటును కూటమికి ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న ఆయన నుంచి వచ్చింది. 

Also Read: విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు

విజయసాయి రెడ్డి రాజీనామాకు ఇలా పీఠముడి పడటంతో బీజేపీ అధినాయకత్వం ఆలోచనలో పడింది. కీలకమైన జమిలీ ఎన్నిల బిల్లు ఆమోదం పొందే నాటికి రాజ్యసభలో మెజార్టీ సాధించాలని భావిస్తున్న ఆ పార్టీ అడుగులు ముందుకు పడకుండా పోయాయి. ఈ టైంలోనే లీడ్ తీసుకునేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ముందుకు వచ్చారు. విజయసాయిరెడ్డిని ఒప్పించే బాధ్యతను తీసుకున్నారట. 

విజయసాయిరెడ్డిని ఒప్పించిన చౌదరి

ఏ పార్టీలో చేరకుండా రాజీనామా చేసి సైలెంట్‌గా ఉండేలా విజయసాయిరెడ్డిని ఒప్పించడంలో సుజనా చౌదరి విజయవంతమయ్యారట. ఆయన ప్రోత్బలంతోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇలా చేసేందుకు ఆయనకు కీలకమైన హామీలు లభించాయనే టాక్ నడుస్తోంది. ఎవరి ఒత్తిడి, ఎలాంటి లబ్ధి లేకుండానే తాను రాజీనామా చేసినట్టు విజయసాయి రెడ్డి చెప్పిప్పటికీ తెరవెనుక పెద్ద మంత్రాంగమే నడిచిందని అంటున్నారు. 

ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టనుంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఈ సీటు కేటాయించనుంది. మరోవైపు విజయసాయి రెడ్డి కుమార్తె రాజకీయం అరంగేట్రానికి కూడా బీజేపీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో ఆమె త్వరలోనే చేరనున్నారు. దీనికి విజయసాయి రెడ్డి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా

ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుజనాచౌదరికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించలేని పరిస్థితి ఉంది. అందుకే ఆయన్ని ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేయబోతున్నారని తెలుస్తోంది. విజయసాయిరెడ్డితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దినందుకు ఆయనకు అధ్యక్షపదవి బీజేపీ ఆఫర్ చేస్తోందని సమాచారం. ఈ వారంలో ఈ ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఈ పదవి కోసం చాలా మంది పోటీ ఉన్నప్పటికీ సుజనా చౌదరి అయితే మిత్ర పక్షాలు కూడా ఓకే చెప్పారని సమాచారం. ఇదన్నమాట ఆంధ్రప్రదేశ్‌లో బటర్‌ఫ్లై ఎఫెక్ట్ రాజకీయాలు. 

Also Read: Andhra Pradesh డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు, వివాదాలకు చెక్ పెట్టేశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhadrachalam Sri Rama Kalyanam: భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం Watch Live
భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం Watch Live
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో నేటి రాత్రి 9 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనదారులు ఆ రూట్లలో వెళ్లకపోవడమే బెటర్
హైదరాబాద్‌లో నేటి రాత్రి 9 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనదారులు ఆ రూట్లలో వెళ్లకపోవడమే బెటర్
Tirupati News: ఎస్వీయూలో బోనులో చిక్కిన చిరుత, ఊపిరి పీల్చుకున్న వర్సిటీ విద్యార్థులు
ఎస్వీయూలో బోనులో చిక్కిన చిరుత, ఊపిరి పీల్చుకున్న వర్సిటీ విద్యార్థులు
Peddi Glimpse: 'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ వేరే లెవల్ అంతే..
'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది - ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాలా.. రామ్ చరణ్ ఆ షాట్ వేరే లెవల్ అంతే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs GT Match Preview IPL 2025 | నేడు ఉప్పల్ లో గుజరాత్ తో సన్ రైజర్స్ ఢీ | ABP DesamKL Rahul Batting IPL 2025 | పదిహేనేళ్ల తర్వాత చెన్నైలో గెలిచిన ఢిల్లీ | ABP DesamJofra Archer Bowling vs PBKS IPL 2025 | నిద్ర పవర్ ఏంటో చాటి చెప్పిన జోఫ్రా ఆర్చర్ | ABP DesamMS Dhoni Parents at Chennai CSK Match | ధోని చెన్నైలో ఆఖరి మ్యాచ్ ఆడేశాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhadrachalam Sri Rama Kalyanam: భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం Watch Live
భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం Watch Live
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో నేటి రాత్రి 9 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనదారులు ఆ రూట్లలో వెళ్లకపోవడమే బెటర్
హైదరాబాద్‌లో నేటి రాత్రి 9 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనదారులు ఆ రూట్లలో వెళ్లకపోవడమే బెటర్
Tirupati News: ఎస్వీయూలో బోనులో చిక్కిన చిరుత, ఊపిరి పీల్చుకున్న వర్సిటీ విద్యార్థులు
ఎస్వీయూలో బోనులో చిక్కిన చిరుత, ఊపిరి పీల్చుకున్న వర్సిటీ విద్యార్థులు
Peddi Glimpse: 'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ వేరే లెవల్ అంతే..
'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది - ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాలా.. రామ్ చరణ్ ఆ షాట్ వేరే లెవల్ అంతే..
CSK Captain Ruturaj Comments: వ‌రుస ఓట‌ముల‌పై చెన్నై కెప్టెన్ ఫైర్.. ఆ త‌ప్పుల‌తోనే ప‌రాజ‌యాల‌ని వెల్ల‌డి.. దీన స్థితిలో సీఎస్కే
వ‌రుస ఓట‌ముల‌పై చెన్నై కెప్టెన్ ఫైర్.. ఆ త‌ప్పుల‌తోనే ప‌రాజ‌యాల‌ని వెల్ల‌డి.. దీన స్థితిలో సీఎస్కే
kingdom Teaser: విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' టీజర్‌కు ముగ్గురు స్టార్ హీరోస్ - అసలు స్టోరీ ఏంటో చెప్పిన విజయ్
విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' టీజర్‌కు ముగ్గురు స్టార్ హీరోస్ - అసలు స్టోరీ ఏంటో చెప్పిన విజయ్
Kancha Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
Layoffs: ట్రంపరితనం వల్ల ఈ కంపెనీల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌!, లిస్ట్‌లో ఫస్ట్‌ పేరు ఇదే
ట్రంపరితనం వల్ల ఈ కంపెనీల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌!, లిస్ట్‌లో ఫస్ట్‌ పేరు ఇదే
Embed widget